చైనాలో 4 వేల థియేట‌ర్ల‌లో బాహుబ‌లి 2 రిలీజ్‌!

Sun,June 18, 2017 01:14 PM
Bahubali 2 will be releasing in China in over 4 thousand Screens

ఇండియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన బాహుబ‌లి 2 ఇక చైనాలో స‌త్తా చాట‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ది. అధికారికంగా వెలువ‌డిన స‌మాచారం మేర‌కు చైనాలోని 4 వేల థియేట‌ర్ల‌లో బాహుబలి 2 రిలీజ్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో సినిమా రిలీజ్ కానున్న‌ట్లు ట్రేడ్ అన‌లిస్ట్ ర‌మేష్ బాలా వెల్ల‌డించాడు. బాహుబ‌లి స్టార్సంతా ప్ర‌మోష‌న్ కోసం చైనా వెళ్ల‌నున్న‌ట్లు కూడా చెప్పాడు. చైనాలో దంగ‌ల్‌ను ప్రమోట్ చేసిన డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీనే బాహుబ‌లి 2 మేక‌ర్స్ సంప్ర‌దించారు. దంగ‌ల్ ఇండియాలో కంటే చైనాలోనే ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడ‌దే కంపెనీ ప్ర‌మోట్ చేస్తే.. బాహుబ‌లి 2 చైనాలోనూ రికార్డులు కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని మూవీ టీమ్ భావిస్తున్న‌ది. చైనీస్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేసిన‌ట్లు స‌మాచారం. ఇండియాతోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా ఇప్ప‌టికే రూ.1500 కోట్ల‌కుపైగా వ‌సూలు చేసిన నేప‌థ్యంలో.. చైనాలోనూ అదే రేంజ్‌లో వ‌స్తే మాత్రం దంగ‌ల్‌ను వెన‌క్కి నెట్టడం ఖాయం.

5134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS