వ‌రుణ్ తేజ్ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Wed,August 15, 2018 09:48 AM
Antariksham 9000Kmph first look revealed

ఘాజీ చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం పొందిన డైరెక్టర్ సంక‌ల్ప్ రెడ్డి ప్రస్తుతం వరుణ్‌ తేజ్, అదితిరావు హైద‌రి, లావ‌ణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో ఓ సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం వరుణ్‌ వ్యోమగామిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. అయితే స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. అంత‌రిక్షం అనే పేరుని మూవీకి టైటిల్‌గా ఫిక్స్ చేయ‌గా, పోస్ట‌ర్‌లో వ్యోమ‌గామిగా క‌నిపిస్తున్నాడు వ‌రుణ్ తేజ్. డిసెంబ‌ర్ 21న చిత్రం విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్‌, అదితి రావులు వ్యోమ‌గామిగా కనిపించ‌నున్నారని టాక్. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఘాజీ చిత్రంలానే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది.

1938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS