సినిమాకి వెళ్లిన అంజలి.. దెబ్బలు తిన్న సీతమ్మ

Fri,April 21, 2017 01:28 PM
anjali shares her experience in child

పెద్దవాళ్లు వద్దన్నది చేయాలని పిల్లలకి అనిపిస్తుంది. అది పెద్దలకు నచ్చదు. నిజం చెప్పాలంటే ... ఏదో కారణం లేకుండా కొట్టరు కదా. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెద్దలు కొడతారు. సరే. తెలిసీ తెలీక తప్పులు చేయడం పిల్లలకు మామూలే. కాలేజీకి వెడుతున్నానని చెప్పి, క్లాసులెగ్గొట్టి సినిమాలకి వెళ్లడం, సీక్రెట్ గా గాళ్ ఫ్రెండ్ నో, బాయ్ ఫ్రెండ్ నో కలుసుకోడానికి వెళ్లడం, ఆ తర్వాత అడిగితే ..ఏదో స్టోరీ చెప్పడంలో పిల్లలు 100 పర్సెంట్ పర్ఫెక్ట్.

సినిమాలో సీతమ్మే కానీ .. హీరోయిన్ అంజలి కూడా తన చిన్నప్పుడు చిలిపివేషాలు వేసింది. అల్లరి చేసింది. ఆమె ఈమధ్య.. తన కాలేజ్ డేస్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది. ఇంట్లో చెప్పకుండా సినిమాకెళ్లడం ఆ రోజుల్లో ఓ సాహసమేననాలి. అలాంటి సాహసం తను కూడా చేశానన్నది. తాను చదువుకునే రోజుల్లో ఓసారి ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్లిందట.

అంజలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు 'నువ్వేకావాలి ' సినిమా వచ్చింది. ఆ సినిమాకి మంచి టాక్ రావడంతో, ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిందట. అయితే అంజలి ఇంటికి చేరుకోడానికి ముందే తాను సినిమాకి వెళ్లిన విషయం ఇంట్లో తెలిసిపోయింది. దాంతో తన పేరెంట్స్ తో తన్నులు తిన్నానని చెప్పింది. అయితే అప్పటి నుంచి కాలేజికి బంక్ కొట్టి సినిమాలకి, షికార్లకి వెళ్లలేదని బుద్ధిగా చదువుకున్నాననీ అన్నది ఈ సీతమ్మ.

2584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS