జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ బచ్చన్..

Mon,June 19, 2017 05:58 PM
జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ బచ్చన్..


ముంబై: జీఎస్టీ (వస్తు సేవల పన్ను)పై విస్తృత ప్రచారం కల్పించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్రం ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ ని జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. జీఎస్టీపై దేశవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం అమితాబ్‌తో 40 సెకన్ల నిడివిగల వీడియోను రూపొందించింది. ఏకీకృత జాతీయ మార్కెట్‌ను ఏర్పాటు చేయటానికి జీఎస్టీ ఉపయోగపడుతుందని ట్వీట్ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ ..వీడియోను ప్రజలకు షేర్ చేసింది. జీఎస్టీ ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ వ్యవస్థకు నాందిపలుకుతుందని అమితాబ్ వీడియోలో సందేశాన్నిచ్చారు. ఈ నెల 30 అర్థరాత్రి నుంచే కేంద్రం జీఎస్టీని అమలులోకి తేనున్న విషయం తెలిసిందే.

929

More News

VIRAL NEWS