ఇల్లు కొనుక్కోమ‌ని డ్రైవ‌ర్‌కి పాతిక ల‌క్ష‌లు ఇచ్చిన యంగ్ న‌టి

Tue,March 19, 2019 01:15 PM
Alia Bhatt gifts driver and helper Rs 50 lakh cheques

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఆ మ‌ధ్య‌ ముంబైలోని పోష్ ఏరియా అయిన జుహులో రెండు ఫ్లాట్లను కొన్న ఆలియా.. ఆ త‌ర్వాత రూ.7 కోట్లు ఖ‌రీదు ఉన్న ఓ ఫ్లాట్‌ని రూ.13.11 కోట్లకు కొని హాట్ టాపిక్‌గా మారింది. ఇక రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్‌లో క‌థానాయిక‌గా ఎంపిక కావ‌డంతో ఈ అమ్మ‌డి పేరు మార్మోగిపోయింది. ప్ర‌స్తుతం బ్ర‌హ్మ‌స్త్రా, ఇన్షా అల్లా, క‌ళంక్‌, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 చిత్రాల‌తో బిజీగా ఉంది అలియా. అయితే ఇటీవ‌ల త‌న బాయ్ ఫ్రెండ్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో పాటు చిన్న‌నాటి ఫ్రెండ్స్‌తో బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకున్న అలియా, పుట్టిన రోజుకి ముందు త‌న డ్రైవ‌ర్‌తో పాటు స‌హాయ‌కుడికి కొంత‌ న‌గ‌దు బ‌హుమ‌తిగా ఇచ్చి ముంబై ప్రాంతంలో ఇల్లు కొనుక్కోమ‌ని చెప్పింద‌ట‌. అలియా ఒక్కొక్క‌రికి 25 ల‌క్ష‌ల చెక్ అందించ‌గా సునీల్‌, అన్మోల్ ఇప్ప‌టికే జుహూ,ఖాన్ దండ‌లో హౌజ్ బుక్ చేసుకున్నార‌ని తెలుస్తుంది. అలియా ఔదార్యంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. 26 ఏళ్ళ వ‌య‌స్సులో అలియా చూపుతున్న ఔదార్యం భేష్ అంటూ ఆమె స‌న్నిహితులు పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు.

8773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles