వరుణ్‌తో అలియా.. 'కలంక్' జంట ఫోటో వైర‌ల్‌

Fri,January 18, 2019 05:38 PM

వరుణ్ దావన్, అలియా భట్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, మాధూరీ దీక్షిత్ లాంటి మహామహులు నటిస్తున్న సినిమా కలంక్. పౌరాణిక డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కరణ్ జొహార్ నిర్మిస్తున్నాడు. తాజాగా వ‌రుణ్‌, అలియా క‌లిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఆ ఫోటోలో అలియా.. వరుణ్ భుజం మీద చేయి వేసి అమాయకంగా చూస్తుంటుంది. ఆ ఫోటోను వరుణ్, అలియా.. ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. వరుణ్, అలియా ఇద్దరు కలిసి నటించిన నాలుగో సినిమా ఇది. ఇదివరకు వాళ్లిద్దరు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హంప్టీ శర్మ కి దుల్హానియా, భద్రీనాథ్ కి దుల్హానియా సినిమాల్లో నటించారు. కలంక్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వరుణ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసిన అలియా.. వరుణ్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపింది. వరుణ్ కష్టపడేతత్వం, క్రేజీ ఎనర్జీ తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయంటూ అలియా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది. వరుణ్ కూడా సేమ్ ఫోటోను షేర్ చేసి అలియా అద్భుతంగా నటించిందంటూ కితాబిచ్చాడు. ఇలా ఇద్దరూ ఆ ఫోటోను షేర్ చేసి ఒకరినొకరు పొగుడుకున్నారు.

3097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles