మ‌రోసారి జ‌త‌క‌ట్టిన వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్

Fri,April 26, 2019 09:35 AM

సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్ దగ్గ‌ర భారీ విజ‌యం సాధించిన చిత్రం ఎఫ్‌2 (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌). ఈ చిత్రంలో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. వీరిద్ద‌రి న‌ట‌నకి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లికారు. అయితే మ‌రోసారి వీరిద్ద‌రు జ‌త‌క‌ట్టారు. హాలీవుడ్ చిత్రం అల్లాదిన్ కోసం వీరిద్ద‌రు గొంతు అరువు ఇచ్చారు. అల్లాదిన్ చిత్రంలో జీనీగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ కనిపించనున్నాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్‌ నటిస్తుండగా, ప్రిన్స్‌ జాస్మిన్‌గా నయోమి స్కాట్‌ అలరించనుంది. అయితే, జీనికి టాలీవుడ్‌ అగ్ర హీరో వెంకటేష్‌ గొంతు అరువివ్వగా, అల్లాదిన్‌కు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఎఫ్ 2 కాంబో చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కి డ‌బ్బింగ్ చెప్ప‌డం సినిమాకి చాలా ప్ల‌స్ అవుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. గాయ్‌ రిట్చయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ 'అల్లాదిన్ మే 24, 2019న విడుదలకానుంది. తాజాగా సినిమాకి సంబంధించిన తెలుగు టీజ‌ర్ విడుద‌ల కాగా, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. అబ్బాయి అమ్మాయిని కలిసాడు. ఒక నిమిషం.అబ్బాయి జీనీని కలిసాడు. జీనీ తన మూడు కోరికలు తీర్చాడు. మిగితావన్ని చరిత్రే. తరువాత జరిగేదేంటో మే 24th తెలుసుకోండి అంటూ మేక‌ర్స్ తెలిపారు.


2370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles