ప‌ద్మావ‌త్‌కి సైడిచ్చిన ప్యాడ్‌మాన్‌

Sat,January 20, 2018 12:38 PM
akshay film release post poned

బాలీవుడ్‌లో హై బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం ప‌ద్మావ‌త్‌. ప‌లు వివాదాలు ఈ సినిమాని చుట్టు ముట్ట‌డంతో రిలీజ్ కాస్త లేట‌యింది. జ‌న‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది ప‌ద్మావ‌త్‌. అయితే జ‌న‌వ‌రి 25న ప్యాడ్ మాన్ చిత్రం విడుద‌ల కానుందని ఎప్పుడో ప్ర‌క‌టించారు ఆ మూవీ చిత్ర బృందం. కాని ప‌ద్మావ‌త్‌, ప్యాడ్ మాన్ చిత్రాలు ఒకే రోజు విడుద‌లైతే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ పోటీ నెల‌కొంటుంద‌ని, అందుకే ప్యాడ్ మాన్ రిలీజ్ డేట్ ని కొద్దిగా ముందుకు జ‌రుపుకోవాల‌ని సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్యాడ్‌మాన్ టీంకి సూచించాడ‌ట‌. పెద్ద మ‌న‌స్సుతో అర్ధం చేసుకున్న వారు ప్యాడ్ మాన్ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఈ క్ర‌మంలో ప‌ద్మావ‌తి టీం దీపిక‌, రణ్‌వీర్‌, షాహిద్ క‌పూర్‌తో పాటు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్యాడ్ మాన్ మూవీ టీం కి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ప‌ద్మావ‌త్ చిత్రం రాణి ప‌ద్మావ‌తి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తుండ‌గా, ప్యాడ్ మాన్ మూవీ ఇండోర్ ప్రాంతంలో శానిటరీ ప్యాడ్స్ పై మ‌హిళల్లో అవగాహన కల్పించేందుకు ఓ జంట పడ్డ శ్రమను ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నారు.
1023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS