అక్ష‌య్‌కి ఈ సారి పోటీ త‌ప్పేలా లేదుగా

Sun,January 21, 2018 01:25 PM
akshay fight with three movies

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ సినిమాల స్పీడ్ ఏ మాత్రం త‌గ్గించ‌డం లేదు. గ‌త ఏడాది నాలుగు సినిమాలు చేసిన అక్ష‌య్ ఈ ఏడాది ప్యాడ్ మాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. జ‌న‌వ‌రి 25న విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9కి వెళ్లింది. ప‌ద్మావ‌త్ మూవీ జ‌న‌వ‌రి 25న విడుద‌ల అవుతున్న కార‌ణంగా , రెండు పెద్ద సినిమాలు ఒకేసారి పోటిప‌డ‌డం మంచి కాద‌ని భావించి ప్యాడ్ మాన్ చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్‌ని కాస్త ముందుకు జ‌రిపారు. కాని అదే రోజు మనోజ్‌ బాజ్‌పాయ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, రకుల్‌ప్రీత్‌ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన‌ ‘అయ్యారే’ పోటికి రానుంద‌ని తెలుస్తుంది. ఈ మూవీ కూడా రిప‌బ్లిక్ డేకి విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ప‌ద్మావ‌త్ రిలీజ్ సంద‌ర్భంగా ముందుగానే ఫిబ్ర‌వరి 9కి ఫిక్స్ అయ్యారు. ఇక మ‌రో చిన్న చిత్రం ‘సోనుకె టిటుకి స్వీటీ’ కూడా ఫిబ్ర‌వ‌రి 9న‌ విడుదలవుతోంది. అంటే అక్ష‌య్ చిత్రంతో అయ్యారే, ‘సోనుకె టిటుకి స్వీటీ’ చిత్రాలు పోటీ ప‌డ‌నున్నాయ‌న్న‌మాట‌. మ‌రోవైపు అక్ష‌య్ కుమార్ కేస‌రి అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

1282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS