మ‌హ‌ర్షి 50 రోజుల వేడుక‌కి గెస్ట్‌గా నేచుర‌ల్ స్టార్?

Wed,June 26, 2019 08:26 AM
actor nani chief guest for maharshi 50 days function

మ‌హేష్ బాబు, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వంశీపైడిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్రం మ‌హ‌ర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించి ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌హ‌ర్షి చిత్రం ఈ నెల 27కి 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇప్ప‌టికి ఈ చిత్రం 200 కేంద్రాల్లో స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తుండ‌డంతో చిత్ర యూనిట్ జూన్ 28వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో 50 రోజుల వేడ‌కని ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నేచుర‌ల్ స్టార్ నానీని ఆహ్వానించినట్టుగా సమాచారం. ప్ర‌స్తుతం వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతున్న నానికి, మ‌హేష్‌కి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న నేప‌థ్యంలో నిర్మాత‌లు అడిగిన వెంట‌నే నాని ఓకే అన్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న 26వ సినిమాకి స‌న్న‌ద్ద‌మ‌వుతుండ‌గా, నాని గ్యాంగ్ లీడ‌ర్ అనే చిత్రంతో బీజీగా ఉన్నాడు.

333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles