వైఎస్ జగన్‌తో నాగార్జున భేటీ.. గుంటూరు నుంచి పోటీ?

Tue,February 19, 2019 04:43 PM
actor nagarjuna meets YS Jagan Mohan reddy

హైద‌రాబాద్: వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని లోటస్‌పాండ్‌లోని ఆయ‌న‌ నివాసంలో ప్ర‌ముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున క‌లిశారు. జగన్‌తో నాగార్జున భేటీ రాజకీయంగా సంచలనం రేపుతోంది. గుంటూరు నుంచి నాగ్ పోటీచేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్ద‌రి మ‌ధ్య అర‌గంట పాటు స‌మావేశం జ‌రిగింది. ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్‌తో భేటీ త‌ర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు.

సినీ నటుడు మంచు విష్ణు దంపతులు ఇటీవ‌ల జగన్‌ను కలిసిన విష‌యం తెలిసిందే. విష్ణు భార్య విరోనికా జగన్‌కి బంధువు. మోహన్ బాబు వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

3932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles