ఆచారి అమెరికా యాత్ర ప్రారంభం

Sun,March 19, 2017 12:22 PM
ఆచారి అమెరికా యాత్ర ప్రారంభం

మంచు విష్ణు - జి. నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ లో దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించగా ఇప్పుడు ఈ కాంబో హ్యట్రిక్ పై కన్నేసింది. మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. లాంచింగ్ కార్యక్రమానికి సుబ్బిరామిరెడ్డి, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, మంచు మనోజ్ తదితరులు హాజరయ్యారు. రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సుబ్బి రామిరెడ్డి క్లాప్ కొట్టినట్టు తెలుస్తుంది. పద్మజ పిక్చర్స్ బేనర్ పై కీర్తి చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మనందం కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢీ చిత్రంలో విష్ణు, బ్రహ్మీ మధ్య సంభాషణలకు ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇప్పుడు ఆచారి అమెరికా యాత్రలోను మరోసారి ఈ కామెడీని రిపీట్ చేయనున్నట్టు సమాచారం. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా ఇందులో విష్ణు లుక్ తో పాటు బ్రహ్మీ లుక్ చాలా ఆకట్టుకుంది. ఇక కృష్ణమాచారి తప్పులు-అప్పలాచారి తిప్పలు సినిమా క్యాప్షన్ సినిమాపై అభిమానులలో మరింత క్రేజ్ ని తీసుకొస్తుంది. చిత్రానికి సంబంధించి మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

1960

More News

VIRAL NEWS