ఫిరంగి ముల్లా.. నవ్వు తెప్పిస్తున్న ఆమిర్‌ఖాన్ ఫస్ట్‌లుక్

Mon,September 24, 2018 02:04 PM
Aamir Khan as Firangi Mullah in Thugs of Hindostan here is the motion poster

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీలో ఒక్కో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. చివరగా తన లుక్‌ను సోమవారం రిలీజ్ చేశాడు. ఇప్పటికే ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న అమితాబ్ బచ్చన్, ఫాతిమా సనా షేక్, కత్రినా కైఫ్, లాయ్ ఓవెన్‌ల మోషన్ పోస్టర్లను ఆమిర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఫిరంగి ముల్లా క్యారెక్టర్ పోషిస్తున్నాడు ఆమిర్ ఖాన్. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ మూవీలో ఆమిర్ క్యారెక్టర్ కాస్త సరదాగా సాగేలా కనిపిస్తున్నది. గాడిదపై కూర్చొని, మెడలో ఓ మందు బాటిల్ వేసుకొని, ఓ చిత్రవిచిత్రమైన గెటప్‌లో ఆమిర్ కనిపిస్తున్నాడు. 1839లో ఫిలిప్ మిడోస్ టేలర్ రాసిన నవల కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసే ఓ దోపిడీదారు, అతని గ్యాంగ్ ఈ మూవీలో ప్రధానంగా కనిపిస్తుంది. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో తొలిసారి ఆమిర్, అమితాబ్ కలిసి నటించారు. కుదాబక్ష్‌గా అమితాబ్, జఫీరాగా ఫాతిమా సనా షేకర్, సురయ్యాగా కత్రినా కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS