అభిమానులకు అమీర్‌ఖాన్ విజ్ఞప్తి..

Mon,August 21, 2017 07:03 PM
అభిమానులకు అమీర్‌ఖాన్ విజ్ఞప్తి..


ముంబై: బీహార్, అసోం, గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో వరద ముంపులో చిక్కుకున్న ప్రజలకు అండగా నిలవాలని పముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ తన అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశాడు. వరదలతో నిరాశ్రయులైన కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకురావాలని అమీర్‌ఖాన్ కోరాడు. వరద బాధితులకి బాసటగా నిలిచేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు చేతనైన సాయాన్ని విరాళంగా అందించి..ప్రభుత్వానికి చేయూతనివ్వాలని కోరాడు అమీర్‌.

1210
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS