‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘ఆర్ఎక్స్ 100’..?

Mon,September 24, 2018 10:41 PM
aahan shetty in rx 100 remake ?

తెలుగు సినిమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. పూరీ, మహేశ్ ల బ్లాక్ బ్లాస్టర్ సినిమా పోకిరి ఇప్పటికే రీమేక్ చేశారు. తెలుగులో హిట్ గా నిలిచిన ప్రస్థానం, టెంపర్, అర్జున్ రెడ్డి హిందీలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో తెలుగు చిత్రం కూడా చేరినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అజయ్ భూపతి, కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 ఏ స్థాయిలో వసూళ్లను రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అజయ్, కార్తికేయ, పాయల్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి ఈ చిత్రంలో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. సాజిద్ నదియావాలా ఆర్ఎక్స్ రీమేక్ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే.

4467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles