మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన విజువల్ వండర్ 2.0 బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 500 కోట్ల రూపాయలతో బడ్జెట్‌తో తెరకెక్కగా, చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించాయి. విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తారు. అయితే ఈ చిత్రం తాజాగా గోల్డెన్ రీల్ అవార్డుకి నామినేట్ అయింది. ఫిబ్రవరి 17న అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో ఘనంగా జరగనున్న 66వ గోల్డెన్ రీల్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకూ అధిక శాతం ఓటింగ్ పొందిన చిత్రానికి ఈ అవార్డ్ అందించనున్నారు. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకని ఈ సారి కూడా అంతే బ్రహ్మాండంగా జరపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. 3డీ ఫార్మెట్లో 4డీ ఎస్ఎల్ఆర్ సౌండ్‌సిస్టంలో రూపొందిన 2.ఓ చిత్రం తప్పక గోల్డెన్ రీల్ అవార్డు అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. విదేశీ చిత్రాల క్యాటగిరీలో ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్ విభాగంలో 2.0 చిత్రం గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయ్యింది . ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్, ఎడిటింగ్ కళాకారులకు గోల్డెన్ రీల్ అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే.