షూటింగ్ లో గాయపడ్డ 2.0 బ్యూటీ

Sun,March 19, 2017 11:28 AM
షూటింగ్ లో గాయపడ్డ 2.0 బ్యూటీ

ఇంగ్లీష్ బ్యూటీ అమీ జాక్సన్ ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొనేందుకు తాజాగా లండన్ వెళ్లిందట. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ అమ్మడు అదుపుతప్పి పడిపోవడంతో కాలికి గాయమైందని చెబుతున్నారు. గాయంతోనే అలా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత చికిత్స తీసుకుందట. వైద్యులు పరీక్షానంతరం అమీకి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పినట్టు తెలుస్తుంది. శంకర్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 2.0 లో కథానాయికగా నటించిన అమీ జాక్సన్ తాజాగా చిత్ర షూటింగ్ కి గుడ్ బై చెప్పింది. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించేందుకు రెడీ అయింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రాన్ని కాష్మోరా ఫేం గోకుల్ తెరకెక్కించనున్నాడని తెలుస్తుండగా ఇందులో హీరోయిన్ గా అమీనే తీసుకోవాలని భావిస్తున్నారట. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.

2047

More News

VIRAL NEWS