సాంఘికశాస్త్ర బోధనా పద్ధతులు


Wed,November 15, 2017 02:38 AM

socialT
స్కూల్‌అసిస్టెంట్ నియామక పరీక్షలో మెథడాలజీ విభాగంలో 16 మార్కులకుగాను 32 ప్రశ్నలు ఉంటాయి. సాంఘికశాస్త్రంలో 9, 10 తరగతుల్లో భూగోశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం (పౌరశాస్త్రం) విషయాల్లో బోధనాభ్యసన ప్రక్రియలు వేర్వేరు పద్ధతుల్లో నిర్వహిస్తారు. 6 నుంచి 8 తరగతుల్లో పాఠ్యాంశాల కూర్పు, ఇతివృత్తాల పద్ధతిలో 6 విభాగాల్లో బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహిస్తారు. వీటిపై అభ్యర్థుల అవగాహన, వినియోగం, జ్ఞాపకశక్తి, సమకాలీన అంశాలపై, అన్వయం పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బోధనా వ్యూహాలు, బోధనా వనరులు, మూల్యాంకనాంశాలపై విస్తృత అవగాహన ఏర్పర్చుకోవాలి. క్వశ్చన్‌బ్యాంక్, బిట్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా, డిస్క్రిప్టివ్ స్టడీమెటీరియల్‌ను చదవడం ద్వారా ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి అడిగినా సమాధానాలను సులభంగా గుర్తించగలుగుతారు.

సాంఘికశాస్త్రం - అర్థం, స్వభావం - పరిధి


1సాంఘికశాస్త్రం మొదట ఏ దేశ విద్యా ప్రణాళికలో చేర్చారు?
1) జర్మనీ 2) భారతదేశం 3) ఫ్రాన్స్ 4) అమెరికా

2. మనదేశంలో సాంఘికశాస్త్ర భావనపై చర్చించిన
విద్యా విధానపత్రం?
1) కొఠారి విద్యా కమిషన్ 2) మొదలియార్ కమిషన్ 3) బేసిక్ విద్యావిధానం 4) ఎన్‌ఈపీ-1986

3. బోధనావశ్యత కోసం సామాజికశాస్ర్తాల నుంచి ఎంపికైన విభాగాన్నే సాంఘికశాస్త్రం అని నిర్వచించినవారు?
1) వెస్లీ 2) ఎంపీ ముఫత్
3) జేఎమ్ ఫారెస్టర్ 4) జేమ్స్ హెమింగ్స్

4.ఏ విద్యా కమిషన్ సిఫారసులో సాంఘికశాస్త్రం మన విద్యా ప్రణాళికలో ముఖ్య భాగమైంది?
1) జాతీయ విద్యావిధానం-1986
2) మొదలియార్ కమిషన్
3) కొఠారి కమిషన్ 4) ప్రొ. యశ్‌పాల్ నివేదిక

5. సాంఘికశాస్త్ర అధ్యయన బోధన లక్ష్యం కానిది?
1) మానవతా విలువలు 2) కమ్యూనిజం
3) లౌకికవాదం 4) ప్రజాస్వామ్యం

6. సాంఘిక శాస్త్ర బోధనపై కొఠారి విద్యా కమిషన్ సిఫారసుల్లో లేని అంశం?
1) 8 నుంచి 10 తరగతుల వరకు చరిత్ర, భూగోళం,
పౌరశాస్త్రాన్ని విడివిడిగా బోధించడం
2) 4 నుంచి 7 తరగతుల వరకు చరిత్ర, భూగోళం,
పౌరశాస్త్రం సమ్మిళితంగా బోధించడం
3) సాంఘిక శాస్త్ర బోధనాభ్యసనను పరీక్ష విషయంగా
మార్చడం
4) 6 నుంచి 10 తరగతుల వరకు సాంఘికశాస్ర్తాన్ని
సమైక్య పద్ధతిలో బోధించడం

7. సాంఘిక ప్రయోజనం ఉన్న ఉత్పత్తిదాయక కృషి,
విజ్ఞానశాస్ర్తాలు, మానవీయశాస్ర్తాన్ని సెకండరీ విద్యలో
ఉండాలని సిఫారసు చేసిన కమిటీ?

1) ఆచార్య రామ్మూర్తి కమిటీ
2) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
3) డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ
4) రాధాకృష్ణన్ కమిషన్

8. కిందివాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
1) కొఠారి విద్యా కమిషన్-1964-66
2) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ-1978
3) మొదలియార్ విద్యా కమిషన్-1952-53
4) బేసిక్ విద్యా విధానం-1937

9. 1 నుంచి 5 తరగతుల కోసం, సాంఘిక విజ్ఞానం కోసం, పరిసరాల విజ్ఞానం-1 ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ?
1) జనార్దన్‌రెడ్డి కమిటీ 2) ఆచార్య రామ్మూర్తి కమిటీ
3) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
4) ప్రొ. యశ్‌పాల్ కమిటీ

10.డా. మాల్కం ఆదిశేషయ్య కమిటీ సిఫారసుల్లో లేని అంశం?
1) వృత్తి విద్య ప్రాధాన్యం
2) సెమిస్టర్ పద్ధతి ప్రవేశపెట్టడం
3) గ్రామీణ పరిసరాలకనుగుణంగా విద్యా విధానం
4) పది మౌలికాంశాలు

11. సాంఘిక శాస్త్ర అధ్యయన ప్రధాన ధ్యేయం విద్య, ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం అని పేర్కొన్నది?
1) జేమ్స్ హెమింగ్స్ 2) జేఎమ్ ఫారెస్టర్
3) ఎంపీ ముఫత్ 4) మైఖేలిన్

12. సాంఘిక అధ్యయనం విద్యార్థులకు వేటిపై అవగాహన పెంపొందిస్తుంది?
1) సామాజిక సమస్యలపై అవగాహన
2) సామాజిక అనుభవం
3) సామాజిక జ్ఞానం 4) పైవన్నీ

13. ప్రకృతి పరిసరాలు, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల మధ్య గల
సంబంధాన్ని తెలుపుతున్నది?
1) భూగోళశాస్త్రం 2) చరిత్ర
3) అర్థశాస్త్రం 4) రాజనీతిశాస్త్రం

14. ఏ తరగతి నుంచి సాంఘిక అధ్యయనాలను శాస్త్ర విషయాలుగా వేర్వేరుగా ఉన్నా సమ్మిళితం చేస్తూ బోధిస్తారు?
1) 6 నుంచి 8 తరగతులు 2) 9,10 తరగతులు
3) 1 నుంచి 5 తరగతులు 4) పైవేమికావు

15. సాంఘికశాస్త్ర అధ్యయనం మానవ సమాజ వ్యవస్థీకరణ వికాసాలకు సమాజంలోని వర్గాల్లో సభ్యుడిగా ఉన్న మానవునికి ప్రత్యక్షంగా సంబంధించిన విషయం అని పేర్కొన్నది?
1) విక్టోరియా స్కూల్ బోర్డు
2) జేఎమ్ ఫారెస్టర్ 3) మైఖేలీన్
4) యూఎస్‌ఏ సెకండరీ విద్య పునర్‌వ్యవస్థీకరణ కమిషన్

16. 1986 జాతీయ విద్యావిధానం, సాంఘికశాస్త్ర విద్య ప్రణాళికలో పేర్కొన్న పది మౌలికాంశాల్లో లేని అంశం?
1) రాజ్యాంగ కర్తవ్యాలు 2) స్త్రీ, పురుష సమానత్వం 3) శాస్త్రీయ తత్వం 4) అంతర్జాతీయ అవగాహన

17. సామాజికశాస్ర్తాల బోధనలో భాగంగా సమాజ భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్న కమిటీ?
1) ప్రొ.రామ్మూర్తి కమిటీ 2) జనార్దన్‌రెడ్డి కమిటీ
3) ప్రొ. యశ్‌పాల్ కమిటీ 4) ఎన్‌సీఎఫ్-2005

18. 1986 జాతీయ విద్యా విధానాల అమలుకు-1992లో
ఏర్పాటైన ఆచరణీయ కార్యక్రమ కమిటీ ఎవరి
భాగస్వామ్యాన్ని సిఫారసు చేసింది?

1) స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం
2) పాఠశాల విద్యా కమిటీల భాగస్వామ్యం
3) విద్యవేత్తల భాగస్వామ్యం
4) తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యం

19. సాంఘిక ఔన్నత్యాన్ని గుర్తించి పాఠ్యాంశాల్లో హక్కులు-బాధ్యతలను విద్యా ప్రణాళికలో చేర్చాలని పేర్కొన్న కమిటీ?
1) ప్రొ. యశ్‌పాల్ కమిటీ
2) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
3) ప్రొ. రామ్మూర్తి కమిటీ
4) మాల్కం ఆదిశేషయ్య కమిటీ

20. కొఠారి విద్య కమిషన్ సాంఘిక అధ్యయనాలపై తన నివేదికలో పొందుపర్చని అంశం?
1) సాంఘికశాస్ర్తాలను ప్రత్యేక విషయాలుగా ఉన్నత
పాఠశాల స్థాయిలో బోధించాలి
2) వృత్తి విద్యాబోధనకు ప్రముఖస్థానం కల్పించాలి
3) సమైక్య బోధన జరుపడానికి ఉపాధ్యాయులకు
శిక్షణ ఇవ్వాలి
4) జాతీయ సమైక్యత విశ్వమానవ సౌభ్రాతృత్వానికి
ప్రాధాన్యం ఇవ్వాలి.

21. 1992లో ఏర్పాటైన జాతీయ సలహా సంఘం సాంఘికశాస్త్ర అధ్యయానికి సంబంధించి నివేదికలో పేర్కొనని అంశం?
1) చరిత్ర పాఠ్యాంశాల్లో పునరుక్తి ఎక్కువగా ఉంది
2) పౌరనీతి పాఠాలు కంఠస్థ విధానానికి లోనయ్యాయి
3) సమకాలీన విషయాల అధ్యయనాల్ని ప్రవేశపెట్టాలి
4) స్వతంత్ర భారతదేశ చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి.

22. సామాజికశాస్ర్తాల అధ్యయనంలో విద్యార్థుల్లో అవగాహన లేని విషయాంశాల స్మృతిని పెంచడం కంటే, అందులోని భావనలపై అవగాహన పెంపొందిస్తూ, సామాజిక, రాజకీయ వాస్తవాలను విశ్లేషించే సామర్థ్యాన్ని నైపుణ్యాలను పెంపొందించడం సాంఘికశాస్త్ర అధ్యయనం ప్రధానాశయం అని
పేర్కొన్నది?

1) జాతీయ విద్యా ప్రణాళిక చట్రం- 2005
2) ప్రొ. యశ్‌పాల్ కమిటీ
3) జాతీయవిద్యా విధానం- 1986
4) జాతీయ విద్యా ప్రణాళిక చట్రం- 2007

23. మాధ్యమిక స్థాయి సాంఘిక అధ్యయనాల బోధన ఆశయాల్లో తప్పుగా ఉన్నది?
1) భూగోళశాస్త్రం- ప్రజల జీవన విధానం- అభివృద్ధి
2) చరిత్ర- మెరుగైన జీవితానికి శిక్షణ
3) పౌరశాస్త్రం- ఉత్తమ పౌరశిక్షణ
4) అర్థశాస్త్రం-ఆర్థిక సమస్యలను పరిష్కరించుకొనే నైపుణ్యం

24. అమెరికాలో సాంఘికశాస్ర్తాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1916 2) 1937 3) 1952 4) 1948

25. ప్రాథమిక తరగతుల్లో ప్రస్తుతం సాంఘిక అధ్యయన పాఠ్యాంశాలను ఎలా పిలుస్తారు?
1) సాంఘికశాస్త్రం 2) పరిసరాల విజ్ఞానం-I
3) సామాజికశాస్త్రం 4) పరిసరాల విజ్ఞానం

26. సాంఘికశాస్త్రంలో పౌరశాస్త్రం బదులుగా రాజనీతిశాస్త్రం
అనే పదాన్ని వాడాలని ప్రతిపాదించింది?
1) జాతీయ విద్య ప్రణాళిక చట్రం- 2011
2) జాతీయ విద్య ప్రణాళిక చట్రం- 2007
3) జాతీయ విద్యా విధానం- 1986
4) జాతీయ విద్య ప్రణాళిక చట్రం- 2005

27. కిందివాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
1) ప్రొ. యశ్‌పాల్ కమిటీ- భారరహిత అభ్యసనం
2) జనార్దన్‌రెడ్డి కమిటీ- సమాజ భాగస్వామ్యం
3) డా. మాల్కం ఆదిశేషయ్య కమిటీ- వృత్తి విద్య
4) రామ్మూర్తి కమిటీ- స్వచ్ఛంద సేవా సంస్థలు

28. ఎవరి ఆశయాలు బేసిక్ విద్యావిధానంలో ప్రతిబింబిస్తాయి?
1) సర్ధార్ పటేల్
2) మౌలానా అబుల్‌కలాం ఆజాద్
3) మహాత్మా గాంధీ 4) మొదలియార్

29. సాంఘికశాస్త్ర బోధనను అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో ప్రవేశపెట్టడానికి తోడ్పడినవాదం?
1) వాస్తవిక వాదం 2) వ్యవహారిక సత్తావాదం
3) ఆదర్శవాదం 4) ప్రాకృతికవాదం

30. సాంఘికశాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో సాధించని అంశం?
1) సమాజంపై అవగాహన
2) సహకార భావన
3) వెనుకబడిన పేద విద్యార్థులకు ఉపయోగం
4) అనుభవపూర్వకమైన జ్ఞానం

31. సాంఘిక అధ్యయనం ద్వారా సాధించే విలువలు?
1) సమానత్వపు భావన
2) వివేకాత్మక ఆలోచన పరిజ్ఞానం పెంపు
3) సామాజిక అధ్యయనం 4) పైవన్నీ

32. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో ఇది ప్రయోగశాల?
1) సాంఘిక శాస్త్ర మ్యూజియం 2) సాంఘికశాస్త్ర క్లబ్బు 3) సమాజం 4) తరగతి గది

33. పాఠశాలల్లో సాంఘిక అధ్యయనాల్లో సమ్మిళిత (సమైక్య) విధానంలో ప్రవేశపెట్టడం ఏ తత్వానికి చెందినది?
1) ఆదర్శతత్వం 2) వాస్తవికతత్వం
3) వ్యవహారిక సత్తాతత్వం 4) ఏదీకాదు

34. సాంఘిక అధ్యయనం వ్యక్తుల మధ్య, సామాజిక సంస్థలకు, ప్రకృతి, వస్తువులకు మధ్య ఉండే సంబంధాలను అధ్యయనం చేస్తుంది. అందువల్ల దీనిని ఏ విధంగా పిలుస్తారు?
1) సమాజశాస్త్రం 2) మానవ అధ్యయనశాస్త్రం
3) సాంఘిక శాస్త్రం 4) ఏదీకాదు

35. సహజీవనం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేది సాంఘిక అధ్యయనం అని పేర్కొన్నది?
1) న్యూ ఎన్‌సైక్లోపీడియా, బ్రిటానికా
2) విక్టోరియా స్కూళ్ల బోర్డు
3) యూఎస్‌ఏలోని సెకండరీ పునర్‌వ్యవస్థీకరణ బోర్డు
4) భారతీయ మాధ్యమిక విద్యాసంఘం
ans
ganapathi

1144
Tags

More News

VIRAL NEWS