ఘనంగా ప్రారంభమైన జర్మన్ చిత్రోత్సవం


Tue,April 10, 2018 12:39 AM

mamidi-harikrishna.jpg
ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్(జర్మనీ) సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్.కె. జోషి ఔత్సాహిక సినీ కళాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేలా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ రూపంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను అభినందించారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సినిమా రంగంలోకి అడుగుపెట్టాలనుకునే నవతరం యువతకు అంతర్జాతీయ సినిమాను పరిచయం చేయడమే కాకుండా వాటిలోని థీమ్, టెక్నిక్, టేకింగ్‌లపై అవగాహన కల్పించడం కోసం ఈ ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉపకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను తెలుసుకోవడం వల్ల మన తెలంగాణ సినిమా రాబోయే కాలంలో ఎలా వుండాలో తెలుసుకోవడానికి ఈ ఫెస్టివల్ ఓ కేస్ స్టడీగా ఉంటుంది అని తెలిపారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జర్మన్ దర్శకుడు వేర్నర్ హోర్జోగ్ చిత్రాల్ని ప్రదర్శించనున్నారు. తొలిరోజు ఈ ఫిలిం ఫెస్టివల్‌కు పలువురు సినీ ప్రియులు హాజరయ్యారు. వెర్నర్ హోర్జోగ్ దర్శకత్వం వహించిన అగిర్రె వ్రాత్ ఆఫ్ గాడ్ సినిమాను ప్రదర్శించారు. స్పానిష్, పోర్చుగీస్ సైనికుల జీవితాల్లోని వ్యథలను ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ చిత్రం సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.

1290

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles