నాటో ఎటు?
అమెరికా బలహీనపడుతున్న నేపథ్యంలో భిన్న ధ్రువ ప్రపంచం రూపుదిద్దుకుంటున్నది. ఉగ్రవాదం నుంచి నిరంకుశ దేశాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని పైకి చెప్పుకుంటున్నప్పటికీ, పారిశ్రామిక దేశాలకు వాటి వ్యాపార ప్రయోజనాలు, ఆధిపత్యమే ప్రధానమనేది స్పష్టం. పారిశ్రామిక దేశాలు వర్ధమాన దేశాలపై తమ ఆర్థిక విధానాలను రుద్దుతూనే ఉన్నాయి. రాజకీయంగా ఐక్యరాజ్యసమితిలో వాటి పెత్తనం సాగుతూనే ఉన్నది. ఇకసైనికంగా నాటో మరింత బలపడటం వల్ల వర్ధమాన దేశాలకు నష్టమే తప్ప లాభమేమీ లేదు....