గు చెంగ్

Mon,September 10, 2018 12:59 AM

(1956, సెప్టెంబర్ 24-1993, అక్టోబర్ 8 )
Chenge
ఆధునిక చైనా కవిత్వాన్ని మలుపు తిప్పిన కవి గు చెంగ్! తన తండ్రి, ప్రముఖ సైనిక కవి అయిన గు గోంగ్ నుంచి వారసత్వంగానూ, ప్రకృతి-సామాజిక పరిశీలన నుంచి బౌద్ధికంగానూ కవిత్వాన్ని పుణికిపుచ్చుకొని, కవిత్వాన్ని తన లోలోపలి మనోభావాల అభివ్యక్తీకరణ సాధనంగా నమ్మిన ఆయన తన బాల్యం నుంచే కవితా సృజనను ఆరంభించారు. చైనాలో 1966-76 కాలంలో సంభవించిన సాంస్కృతిక విప్లవంలో భాగంగా, కళా, సాంస్కృతిక, సాహితీరంగాలపై చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకం గా రూపొందిన Misty Poets ఐదుగురిలో ఒకడిగా (బెయ్ దావో, షు టింగ్, హె డాంగ్, యాంగ్ లియాన్‌లు మిగతా నలుగురు) క్రియాశీల పాత్ర పోషించారు. దీనికి Today పత్రిక ద్వారా అస్పష్ట కవితా ఉద్యమానికి menglong shi శ్రీకారం చుట్టారు.
బీజింగ్‌లో పుట్టి, దేశదేశాలూ తిరిగి , 1989లో ప్రవాసంలోకి వెళ్లిపోయి, చివరికి ఆక్లాండ్ విశ్యవిద్యాలయంలో (న్యూజిలాండ్) అధ్యాపకుడిగా పని చేసిన ఆయన, వ్యక్తిగత కారణాలతో తన భార్య జై యిని హత్యచేసి, ఆ తర్వాత ఉరి వేసుకొని మరణించాడు. ఆయన కవితా సంకలనాల్లో Sea of Dreams, Nameless Flowers వంటివి ప్రముఖమైనవి.
జీవితంలోనూ, కవిత్వంలోనూ ధిక్కారాన్నే ప్రకటించి, ఆంక్షల ను కాలదన్ని స్వేచ్ఛను ప్రేమించి, నిత్య వివాదాలతో వ్యవస్థను ప్రశ్నించి, అస్పష్ట జగతే సమకాలీన సార్వత్రిక సత్యంగా భావించిన గు చెంగ్ నవీన చైనా వచన కవిత్వానికి దిక్సూచి!

574
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles