లాభాల బాట బంతిపూల సాగు

Wed,August 29, 2018 11:24 PM

ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు బంతి సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అన్నీ సీజన్లలో ఈ పూలకు మంచి గిరాకీ ఉంటుంది. సాగు కూడా తేలికే. పండుగల సమయాల్లో పూలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. కాబట్టి ఏడాది పొడవునా పూల సాగు చేపట్టవచ్చని ఉద్యానవన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. ప్రశాంత్ తెలిపారు.
banthi

విత్తనమోతాదు

ఎకరా నారుమడికి 800 - 1000 గ్రాముల విత్తనాలు సరిపోతా యి. సన్నగా, పొడవుగా, బలహీనంగా ఉన్న నారును నాటవద్దు.

రకాలు పూస నారింజగైండా, పూస బసంతగైండా, ఆఫ్రికన్ జైంట్, డబుల్ ఆరెంజ్, ఆఫ్రికన్ జైంట్, డబుల్ ఎల్లో రకాలు కొన్ని హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకోవచ్చు.

banthi2

నారుమడి యాజమాన్యం

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బంతి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. మంచి విత్తనాలను ఎంపిక చేసుకుని ప్రస్తుతం నార్లు పోసుకోవాలని ఉద్యానశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రధాన పొలంలో వానకాలం 15 మీటర్ల ఎత్తులో నారు మడిని ఎంపిక చేసుకోవాలి. విత్తనాన్ని ముందుగా ఎండోసల్ఫాన్ లేదా ఫాలిడాల్ పొడితో శుద్ధి చేయాలి. దీనివల్ల చీమలు, చెదలు పట్టవు. చలికాలంలో విత్తిన మడులపై ఎండు గడ్డి పలుచగా చల్లితే విత్తనం త్వరగా మొలకెత్తుతుంది. మొలక రాగానే గడ్డిని తీసివేయాలి. వారంలో మొలక కనిపిస్తుంది. బంతి చౌడు, ఆమ్ల నేలలు తప్పా, అన్నిరకాల నేలల్లో సాగుకు అనుకూలం. ఇసుక, మురుగునీటి పోయే సౌకర్యం ఉన్న నల్లరేగడి నేలలు, ఎర్రనేలల్లో అధికంగా పండుతుంది. మొక్క పెరుగుదల, పూల దిగుబడి ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత పై ఆధారపడి ఉంటుంది. బంతి సాగులో ఆరోగ్యకరమైన నారు పెంపకం అవసరం. నారు ఎత్తుగా 15-30 సెం. ఎత్తు ఉండేలా చూడాలి. వీలైనంత ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడాలి. అక్టోబర్ రెండవ వారం వరకు విత్తుకోవాలి. 20 రోజుల వ్యవధి గల మొక్కలు విత్తడం శ్రేయస్కరం.

యాజమాన్య పద్ధతులు..

దుక్కిలో ఎకరాకు 20 టన్నుల చొప్పున మురిగిన పశువుల ఎరువు,. 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వ రం, 80 కిలోల పొటాష్ పోషకాలు ఇచ్చే ఎరువులు వేయాలి.

అంతరకృషి..

కలుపు ఎప్పటికప్పుడు తీసివేయాలి. నిర్లక్ష్యం చేస్తే కలు పు పెరిగి ప్రధాన పంట దిగుబడి తగ్గుతుంది. సాళ్ల మధ్య మట్టిని కదిలించాలి. దంతెలు కొట్టి చేయడం వల్ల మొక్క అడుగు భాగాన వేళ్లకు గాలి తగిలి మొక్క బలంగా పెరుగుతుంది. నాటిన 50 రోజుల వరకు అంటే మొక్క బలంగా పెరుగడం, పూత పట్టే వరకు తేమ ఉండేలా చూడాలి. ఏ దశలోనూ తేమ తగ్గితే దిగుబడి తగ్గే అవకాశాలుంటాయి. బంతి మొక్క నిటారునా పెరుగుతుంటే గమనించి కాండపు చివర భాగాన్ని తుంచి తీసివేయాలి. అలా చేయడం వల్ల పక్కన అనేక కొమ్మలను పెడుతుంది. వానకాలం నీరు అంత అవసరం ఉండదు. కానీ అప్పుడప్పుడు ఒరుపు ఇస్తే, ప్రధాన సమయాలలో నీటి తడులు పెట్టేందుకు ప్రణాళిక ఉండాలి.

దిగుబడి

పూల దిగుబడి దాదాపు ఎకరాకు 4- 6 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది.
-మాసయ్య
వ్యవసాయ యూనివర్సిటీ, 9000377929

854
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles