అల్జీమర్స్‌పై అవగాహన కలిగించాలె


Sat,September 21, 2019 12:35 AM

మనలో చాలామంది ప్రతిరోజు ఏదో ఒక విషయం మర్చిపోతుంటాం. దీనివల్ల తాత్కాలిక ఇబ్బంది కలిగినా రోజువారీ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం ఉండదు. యాభై ఏండ్లు దాటిన తరువాత ఎక్కువమందిలో వచ్చే సమస్య మతి మరుపు. దీన్ని అల్జీమర్స్‌ వ్యాధి అంటారు. ఈ సమ స్య వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకే ఈవ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ సెప్టెంబర్‌ 21ని ప్రపంచ అల్జీమర్స్‌ దినంగా ప్రకటించిం ది. 1906లో జర్మన్‌ సైకాలజిస్ట్‌, పాథాలజిస్టు అయిన అలాయ్‌ అల్జీమర్‌ ఈ వ్యాధిని గుర్తించి, దాని లక్షణాలను వివరించాడు. మెదడులో జరిగే మార్పుల కారణంగా మానసిక అనారోగ్యం కలిగి జ్ఞాపక శక్తిని కోల్పోతారని చెప్పాడు. శరీరానికి వ్యాయామం, మెదడుకు పదునుపెట్టే పనులుచేస్తే మతిమరుపును దూరం చేయవచ్చని వైద్యు లు సూచిస్తున్నారు. 2019 సెప్టెంబర్‌21ని ‘డిమెన్షియా అవగాహన మాసం’గా ప్రకటించారు
- నెరుపటి ఆనంద్‌, ఉపాధ్యాయులు, టేకుర్తి (నేడు ప్రపంచ అల్జీమర్స్‌ దినం)


ప్రపంచ శాంతికి పాటుపడుదాం

నేడు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. విద్వేషాలతో ప్రపంచం అట్టుడుకుతుంది. వీటివలన ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యక్తులు, సంస్థలు, దేశాలు ప్రపంచశాంతి కోసం తమవంతు ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించినరోజు ఇది. తగాదాలు, యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం అవసరం. ఉగ్రవా దం పెరిగిపోతున్న నేటి ఆధునిక యుగంలో ప్రపంచశాంతి చాలా అవసరం. ఈ సందర్భంలో ఐక్య రాజ్యసమితి పిలుపుతో దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 21 తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటున్నాయి. అం త ర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధనకోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఎటువంటి ఘర్షణలు లేని శాంతియుత జీవనానికే ప్రజా నీకం మొగ్గు చూపుతున్నది. ఇది అంతర్జాతీయ శాంతి దినోత్సవమే కాదు కాల్పుల విరమణ రోజు కూడా.
- కాళంరాజు వేణుగోపాల్‌, ఉపాధ్యాయుడు (నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం)

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles