నిరంతరం కొనసాగించాలె


Fri,September 13, 2019 11:19 PM

గ్రామాల్లో మార్పు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. దీనికి అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తుండటం ముదావహం. గ్రామాల్లో ఇప్పటికీ నిర్మితం కాని మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలి. విద్యుత్, రోడ్లు, ఇంటింటికీ మంచినీటి సరఫరా వంటి సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు చేపట్టాలి. అలాగే పౌరసమాజం కూడా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలి. రాష్ర్టాన్ని కాలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటాలి, వాటిని కాపాడాలి. అప్పుడే వాటి ఫలితాలు మనకు కనిపిస్తాయి. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న ప్రణాళికలే సరిపోవు. ప్రజల భాగస్వామ్యం కూడా అంతేముఖ్యం. మన గ్రామ అభివృద్ధి మన బాధ్యత అన్నవిధంగా పనిచేయాలి.
- ఎం. రమేశ్, మేడ్చల్


ప్రకృతి విధ్వంసాలను అడ్డుకోవాలె

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రకృతి వైపరీత్యాల ఫలితాలెలా ఉంటా యో అందరికీ అనుభవమే. అయినా వీటినుంచి మనం పాఠాలు నేర్చుకోవడం లేదు. ఉన్న వనరులను పొదుపుగా వాడుకునేలా విధాన రూపకల్పనలు జరుగాలి. ప్రజలుగా వ్యక్తిగత స్థాయి నుంచి ప్రభుత్వ విధానకర్తల దాకా ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు కృషిచేయాలి. అంతేగానీ ప్రకృతికి విఘాతం కలిగించేలా వనరుల వెలికితీత పేరుతో ఎలాంటి చర్యలు చేపట్టినా దానివల్ల నష్టపోయేది ప్రజలే. భవిష్యత్తు తరాలకు మనం ఆరోగ్యకరమైన వాతావారణాన్ని ఆస్తిగా ఇవ్వాలి. విద్యుత్, యురేని యం లేదా ఇతర తవ్వకాల పేరుతో సాగిస్తున్న ప్రకృతి విధ్వంసక చర్యలకు ఇకనైనా స్వస్తి పలుకాలి. యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండల పరిసర గ్రామాల్లో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయంపై సేవ్ నల్లమల పేరుతో సినిమా నటు లు మొదలు రాజకీయనాయకుల దాకా ముందుకురావటం అభినందనీయం. నల్లమలను రక్షించుకునేందుకు అందరూ కదలాలి. ప్రకృతి విధ్వంసం నుంచి తెలంగాణను కాపాడుకోవాలి.
- బుచ్చయ్య, తిరుమలా పురం, అమ్రబాద్ మండలం

112
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles