బీజేపీ పగటికలలు


Thu,September 12, 2019 01:29 AM

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుం దని, కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు ప్రగల్భా లు పలుకుతున్నారు. ఇందులో భాగం గానే అధికార పార్టీలో నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే కొందరు కేంద్ర బీజే పీ నేతలు కూడా రాష్ట్రంలో పర్యటించి రాష్ర్టానికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే పథకాల్లో కేంద్రం వాటా పెద్దమొత్తంలో ఉన్నదంటూ అసత్యాలు చెప్పారు. అయితే నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్నదనుకోవడం వాపును చూసి బలుపు అనుకోవడమే తప్పా వేరే కాదు.
- పి.అశోక్, రాంనగర్, వరంగల్


బాధ్యతగా తీసుకోవాలె

వినాయక నిమజ్జనాల అనంతరం నగరాలు, పట్టణాలతో పాటు చెరువు లు, కాల్వలు ప్లాస్టిక్ కవర్లు, పూలు, పండ్లు, రంగుల లాంటి వ్యర్థాలతో కలుషితమవుతాయి. ఈ వ్యర్థాలను వెంటనే శుద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే చెరువుల్లోని నీరు మురుగునీరుగా మారి దోమలు ప్రబలే అవకాశం ఉంటుంది. అసలే ఇప్పుడు ప్రజలు సీజనల్ వ్యాధులతో సత మతమవుతున్నారు. సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బం ది శుద్ధి చేసే బాధ్యతలను తీసుకోవాలి.
- బేగరి ప్రవీణ్‌కుమార్, అంతారం, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా

అభివృద్ధి దిశగా తెలంగాణ

ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులతో కలిపి తెలంగా ణ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడింది. ఈ మంత్రి వర్గంలోకి ఇద్దరు మహిళా మంత్రులను తీసుకోవడం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కృషిచేస్తున్నది కాబట్టే ఇద్దరు మహిళా మంత్రులకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. పూర్తిస్థాయి మంత్రివర్గంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకుసాగాలి.
- బొల్లం రమాదేవి, అల్వాల్, హైదరాబాద్

160
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles