నిబంధనలు పాటించాలె


Wed,September 11, 2019 01:02 AM

రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథుడు నేటితో నిమజ్జనం కానున్నాడు. అయితే ఈ నిమజ్జనోత్సవాలలో తరచూ కొన్ని తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. విగ్ర హాలు మీదపడి గాయాల పాలవ్వడం, యువకులు చెరువుల్లో గల్లంతవ్వడం లాం టివి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటన లు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులతో పాటు, ప్రజలది కూడా. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమమూ విజ య వంతం కాదనేది తెలుసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఆ దిశగా నిర్వాహకులు, యువకులు, భక్తులు నడుచుకోవాలి.
- కొలిపాక శ్రీనివాస్ గౌడ్, సముద్రాల


భయాందోళనలు వద్దు

డెంగీ, మలేరియా వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నది. దవా ఖానల్లో కావాల్సినన్ని మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నది. దీంతో పాటు ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలను కూడా పొడిగించింది. ప్రతి జ్వరం డెంగీ జ్వరం కాదు, కాబట్టి ప్రజల భయాందోళనలకు గురికావా ల్సిన పనిలేదు. డెంగీ లక్షణాలేవో తెలుసుకొని, కనిపించిన వెంటనే దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. దీంతో పాటు డెంగీ దోమల నివారణ కోసం ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- దాయి లింగం యాదవ్, పోచారం, రంగారెడ్డి జిల్ల్లా

హర్షణీయం

సోమవారం సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేయడం ఆహ్వానించదగిన పరిణామం. రైతుబంధు పథకం ఏటా రెండు పసళ్లకు రూ.10 వేలు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్‌లో 12 వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం హర్షణీయం. రైతుకు మంచిరోజు లు వచ్చాయని చెప్పడానికి నిదర్శనం ఈ నిర్ణయం.
- మాసబోయిన రజినీ, బద్దిపల్లి, కరీంనగర్

162
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles