అందరి బాధ్యత


Fri,August 16, 2019 12:51 AM

స్వచ్ఛతే లక్ష్యంగా గ్రామాలు, పట్టణాల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల ప్రత్యే క కార్యాచరణ చేపట్టడం ముదావహం. గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. దీనికి అనుగుణంగా ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఉపయోగంలో లేని బోర్లు ఎక్కడున్నా మూసివేయాలని ప్రభు త్వం కోరుతున్నది. ఇది మంచి నిర్ణయం. గతంలో ఈ బోరుబావుల వల్ల జరిగిన విషాద సంఘటనలు మన అనుభవంలో ఉన్నవే. కాబట్టి పౌర సమాజం ఇలాంటి బోరుబావుల సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి మూసివేయించా లి. ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలి.
- ఎం.మోహన్,మంథని


అభినందనలు

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీ సాధించి జట్టు విజయంలో కోహ్లీ కీలకపాత్ర పోషించాడు. అట్లనే ఈ దశాబ్దకాలంలో అత్యధి క పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సృష్టించారు. కెప్టెన్‌గా 21 సెంచరీలు సాధించి ఇతర యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తు న్న కోహ్లీకి అభినందనలు. కోహ్లీ దేశానికి ఇలాంటి విజయాలు మరిన్ని అందించాలి. మరెన్నో రికార్డులు సాధించాలి.
- జి.అజయ్, హైదరాబాద్

చైనా తీరు గర్హనీయం

కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నది. కానీ చైనా మొదటినుంచి పాకిస్థాన్ చర్యలకు పరోక్ష మద్దతు ఇస్తున్నది. ఒకవైపు భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామ ని చెబుతూనే మరోవైపు కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వాదనకు వంతపాడటం గర్హనీయం. ఆసియాలోనే అతిపెద్ద ఆర్థికశక్తులుగా ఉన్న భారత్, చైనా దేశాలు సహృద్భావంతో మెలగాలి. అంతేగాని పాకిస్థాన్ చేసే కవ్విం పు చర్యలను సమర్థించేవిధంగా వ్యవహరించడం మంచిది కాదు. ఇప్పటికైనా చైనా తన వైఖరిని మార్చుకోవాలి..
- బి.వేణుగోపాల్, సంగారెడ్డి

171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles