మట్టి గణపతి

Wed,September 12, 2018 11:27 PM

చిన్ని చిన్ని చేతులు మట్టి ముద్దతో
చిట్టి పొట్టి గణపతిని చేస్తున్నాయి
అద్భుతం!
చూస్తుండగానే ఏనుగు తల
ఉండ్రాల్ల బానెడు బొజ్జ
నాలుగు చేతులు
చిట్టెలుక వాహనం!
మట్టికి మహాగణపతి యోగం
బాలల ముందు బాల గణపతి
రంగురంగుల షోకు మైదాకు గణపతి కాదు
మహిమ గల మట్టి గణపతి
సనాతన గణపతి!
అధికార దాహం
కాంగ్రెస్, టీడీపీలది అధికార దాహం తప్ప మరోటి కాదు. గతంలో అధికారం వెలగబెట్టినప్పుడు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏమాత్రం ఆలోచన చేయలేదు. వివక్ష, అణిచివేతల గురించి పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమం సాగుతున్నప్పుడు ఉద్యమానికి మద్దతునీయలేదు. తీరా రాష్ట్రం ఏర్పడి ముందుకుపోతున్న తరుణంలో అడ్డంకులు కల్పించే పనికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు ఎందుకని అంటూనే, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయటానికి ప్రయత్నిస్తున్నాయంటే వాటి అధికార దాహం తేటతెల్లమవుతున్నది.
- బైరి జనార్దన్, ప్రగతినగర్, జేఎన్‌టీయూ
- కందాళై రాఘవాచార్య

184
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles