పిల్లుల శాపనార్థాలు

Mon,September 10, 2018 11:13 PM

కరెక్టు చెప్పినవురా సత్తి.. నువ్వన్నట్టు.. తెలంగాణ కావాల్ననే సోయిగానీ అందుకు వో నాయకత్వాన్ని తయారు చేసుకుందామని గానీ.. ఇవాళ యెగిరెగిరి పడుతున్న కాంగ్రేస్ నాయకులకున్నదా? ఉంటే గిట్లెందుకుందురు? నాడు ఆంధ్రా నాయకత్వం వెంటపడి రొండో శ్రేణి నాయకులుగా తిరిగినోల్లకుతెలంగాణ వస్తాలకే వొడ్డున పడ్డ శాప మాదిరి తయారయ్యింది వాల్ల పని.

ప్రగతి నివేదన సభకు పోయి వచ్చేతాలకే పానమంతా సొక్కినట్టయింది. తెల్లారి చెల్కకాడికి కూడా పోకుంట అట్లనే పండుకున్న నులకమంచంల ఇంత దిని. బిత్తిరి సత్తిగాడొచ్చి అన్నో లేవవే మే అట్ల పన్నవ్.. అని లొల్లిపెట్టిందాక మేల్క రాలే నాకు.యేందిరా తమ్మీ నువు గూడా పోలేదుర చెల్కకాడికి?
యేడ పోయిన్నే అన్న.. నిన్న ప్రగతి నివేదన సభ సూపర్ సక్సెసయిందిగా. మా దోస్తులతోని దావత్ చేసుకున్న.. తాళ్లల్లకు పోయి.అట్లనా నన్నుగూడ పిలిత్తే వొద్దునుగారా..అయితాంగని సత్తీ.. ఎట్ల జరిగిందిరా సభ యేమంటున్నర్రా జనాలు..యేమంటున్నరా.. శీ శీ శెవ్వా.. యేం మనుసులే పాడుగాను. దేన్నీ వోర్వరేమె వీల్లు. అయిందానికి కాందానికి వొకటేతీరు తిట్లూ శాపనార్థా లు.. గిట్లుంటాది. అని తిడుతున్నరు.యెవల్నిరా సత్తి..ఇంకెవల్నీ.. నిన్నటిసంది సభ మీద మన ముఖ్యమంత్రి మీద పడి యేడుస్తున్న కాంగ్రెసును, యింకా ఆల్ల తోక పార్టీల లీడర్లను.సత్తి.. ప్రగతి నివేదనకు ముందునుంచే మొదలైన ప్రతిపక్షాల వేదన సభను చూసినంక తట్టుకోలేని రోదనగా మారింది. ఉట్టిమీది వొట్టి శాపలు అందకపోతారికే పిల్లి శాపాలు పెట్టిందట వీల్ల పరిస్థితి కూడ అట్లనే తయారైంది.
గెలుపు ముందుగాల్నే డిసైడైపోయింది తెలంగాణల.యెవలికంటరు.యింకెవలకురా టీఆరెస్ పార్టీకే.అంతేనంటవా..

అంతే.. టీఆరెస్ పార్టీకి తమ మనోఫలకాల మీద ఎప్పుడో వోటు ముద్రవేసుకున్నరు జనాలు. నివేదన సబకు లక్షలాదిగా హాజరు కావడమంటే.. తెలంగాణకు కేసీయార్ ముఖ్యమంత్రిగా మరో ఐదేండ్లకు రెనివల్ చేయడమే. దాన్ని చూసి తట్టుకోలేక అపసోపాలు పడుతాన్నయి ప్రతి పచ్చాలు. దాని ఫలితమే రొండ్రోజులుగా ప్రతిపచ్చాల వేదికల మీంచి మీడియాలో వినిపిస్తున్న సప్పుల్లు. అయితే ఇవి ఉత్తుత్త వుత్తరకుమారులు చేసే తాటాకు సప్పుల్లేనని తేలిపోతున్నయి.

పంతులూ.. ఇంతకూ వాళ్ల బాదేంది గావచ్చు.. అని అడిగిన అదేరా బాబు నాకూ అర్థమయితలేదు. వొక పార్టీ సభ పెట్టుకుంటే ఏం మాట్లాడాలె ఎట్ల మాట్లాడొద్దు అనే విషయాన్ని ప్రతిపచ్చాలు చెప్పుతయా? ప్రగతి నివేదన.. అంటే దాన్ని ఇంగ్లీషుల ప్రోగ్రెస్ రిపోర్టు అం టరు. చేసిన పని చెప్పుకునుడున్నమాట.

అవును సత్తి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆరెస్ పార్టీ నేతలు కార్యకర్తలు జనంతో సహా అందరు వొక దగ్గరికి చేరుకోని, మనం చేసిన పనులేంటియి, కొత్త రాష్ట్రంల బాలారిష్టాలు ఎట్టుండె, అటు బయటి శత్రు వులు ఇటు ఇంటిదొంగలు పెట్టిన తిప్పలు ఎట్లుండె, అయినా వాటిని ఎట్లెట్ల దాటుకుంట వచ్చినం.. యాబై నెల్లల్ల 500 తీర్ల పథకాలకు రూపకల్పన చేసి వాటిని గాడిన పెట్టిన తీరు.. వీటన్నిటినీ వొక్కొక్కటీ హాజరైన జనాలకు వివరించిన్రు ముఖ్యమంత్రి. అసలు నాడు మ్యానిఫెస్టోల చెప్పకుంటనే మొదలుపెట్టిన వందలాది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం టియని అన్నింటినీ వివరించిన్రు సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు ఎం త కష్టమైందో తెలసుగార మనకు. ఇవాళ దేశం గర్వించదగ్గస్థాయిలో తెలంగాణ నిలవడటానికి నడుంకట్టి పనులుమొదలు పెట్టిన కాలం.. కేవలం రొండేండ్లే. మరెంత పట్టుబడితే ఈ పనులన్నీ అయితున్నట్టురా సత్తిగా నీకు తెల్వదార? ఎంత దార్శనికతతోని ఆలోచన చేస్తే యిదంత అయిందిరా. నాడు యేమన్నరు? మీకు పరిపాలన చెయ్యొత్తదా.. అన్న రు. కని యేమయింది. తెలంగాణ ఇవాళ దేశంలనే నెంబర్ వన్ దిశగా దూసుకపోతున్నది.

కరెక్టు చెప్పినవురా సత్తి.. నీ కడుపు సల్లగుండ. కాంగ్రెసోల్లకే కాదు ఈ నడుమనే కొత్తగ పార్టీ పెట్టిన గా పంతులుకు తెల్వదా. అసలు తెలంగాణ వద్దన్న టీడీపీకి తెల్వదా. అడ్డంపడ్డ సీపీఎంకు తెల్వదా. అందరికీ తెలుసు. అయినా ఎందుకు అట్లా వుల్టా మాట్లాడతాండ్రు అంటే.. మాట్లాడుతరు అట్లెనే. వాల్ల తీరే అంత. అరువయేండ్ల సంది వాల్లు ఎలగబెట్టింది ఏము న్నదిగనుక. వొక బాధ్యతున్నదా తెలంగాణ ప్రజలంటే భక్తి వున్నదా? వుంటె గిట్ల అడ్డగోలుగా ఎట్ల మాట్లాడుతరా సత్తి..
అవును పంతులూ.. మీరన్నది నిజమే. ఎత్తుకున్నోనికే తెలుస్తది కావిడి బరువు. వీళ్ళ కథ ఎట్ల తయారైందంటే.. సభల కేసీఆర్ వాళ్ళను తిట్టక పోతారికే కోపం వస్తాంది. తిట్టించుకుందానికి యావ ఎందుకో. కేసీఆర్ తిడితేనే వీళ్ళు లీడర్స్‌గ గుర్తిస్తారు అనే కాడికి పోయినరంటే ఏం చెప్పాలె.అవును పంతులు.. ప్రజల బతుకులు తెలిసిన మనిషినీ వాల్ల కష్టాల ను అర్థం చేసుకొని కన్నీల్లను తుడుస్తడనే విశ్వాసాన్ని సంపాయించుకున్న నాయకున్నే ప్రజలు ఆదరిస్తరు. అరువయేండ్ల తర్వాత దొరికిన అరుదైన నాయకుడు కేసీయార్‌ను మనోళ్లు ఎట్లొదులుకుంటరు?

ramesh
కరెక్టు చెప్పినవురా సత్తి.. నువ్వన్నట్టు.. తెలంగాణ కావాల్ననే సోయిగానీ అందుకు వో నాయకత్వాన్ని తయారు చేసుకుందామని గానీ.. ఇవాళ యెగిరెగిరి పడుతున్న కాంగ్రేస్ నాయకులకున్నదా? ఉంటే గిట్లెందుకుందురు? నాడు ఆంధ్రా నాయకత్వం వెంటపడి రొండో శ్రేణి నాయకులుగా తిరిగినోల్లకు తెలంగాణ వస్తాలకే వొడ్డున పడ్డ శాప మాదిరి తయారయ్యింది వాల్ల పని. వొకలంటే వొకలికి పడని తీరుతో వొక్క రాష్ట్రశాఖ ఇరువై ముఖ్యమంత్రి అభ్యర్థులు అన్నట్టుగా పోటీ పడుతున్న యీ కాం గ్రెసు పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు యెంటపోతరా? వీల్లెమ్మడి పోతే కుక్కతోక పట్టుకోని గోదారీదినట్టేనని తెల్వదా యేంది జనాల కు. జనం తమ వెంటరారని కాంగ్రెసోల్లకూ తెలుసు. కాకపో తే వో దింపుడుగల్లం ఆశ. నమ్మించజూస్తున్నరు. జనం తమ తప్పుడు హామీలకు యెగిరి గంతేసుకుంట సంకలు గుద్దుకుంట తమకే గుద్దుతరు వోట్లు అనుకుంటున్నరు కాంగ్రెసోల్లు. కానీ ఆ పప్పులు ఇప్పుడు వుడుకుతట్టు లేవు.
తెలంగాణ ఎనుకటోతిగె ఎడ్డిది కాదు. సోయి తెచ్చుకున్నది. నాడంటే గత్యంతరం లేక తెలంగాణకు ఎదిగిన నాయకత్వం లేక కాంగ్రెసు టీడీపీ ఎంటవచ్చిన్రు. కానీ ఇవాలేమక్కెరున్నది తెలంగాణ జనాలకు. ప్రపంచం మెచ్చిన రాజనీతి దురంధురుడు ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకునే మహా చక్రవర్తిగా జన హృదయాల్లో పీఠమేసుకున్న కేసీయార్ అనే దార్శనిక నేత తమకు అండగా వుండగా.. లేని నాయకున్ని ఎందుకుదోలాడుకోవాలె? ప్రజా సంక్షేమం పట్టని ప్రతిపచ్చాల స్వార్థ రాజకీయాలకు ఎం దుకు నీల్లు పోసి సాదాలె? వొక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కూడా పనిచేయలేని యీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి అందలమెక్కించి తాము అంధకారంలో ఎందుకు మునిగిపోవాలనుకుంటరు తెలంగాణ ప్రజలు?కాంగ్రెసోల్లొచ్చుడూ ఇదంతా అయ్యేపని కాదుకానీ ఇంకో ముచ్చెట చెప్పు పంతులూ.. అని నేను అడిగితాలికే..రేపు రాపోరా మరిన్ని చెప్తనన్నడే అన్నా..యింకోటి.. ప్రభుత్వం రద్దయి పాయె. ఇక ఓటెసుడు ఎప్పుడొస్తదా.. ఎప్పుడెప్పుడు గుద్దుదమా అన్నట్లు జనం చూస్తున్నరు.యెవ్పుడయితేందిరా కారుకు గుద్దుడేనాయె..నిజమేనే.. అన్నా.. యెనుకోముందో యెప్పుడైతేంది..యెనకముందు సూడకుంట కారుగుర్తుమీద వోటుగుద్దుడేనాయె.
గంతే గనీ.. మనం ఏసుడుతోనే సరిపోదు.
మన బజారోల్లను, ఊరోల్లను అందర్ని ఒకతాటిమీదిక తెవ్వాలె.
కారు గుర్తుకు ఓటేసుడుతోనే మన బతుకు బాగుంటదని చెప్పాలె.
బంగారు తెలంగాణ, పైరు పచ్చని తెలంగాణ చూస్తమని చెప్పాలె.
ఇయన్ని ఇన్న మా బిత్తిరోడు.. ఎగేసుకుంట ఇంటిముకం పట్టిండు.
జనాలందరికి సాటింపు జెయ్యటానికి..

478
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles