వృద్ధుల జీవితాల్లో వెలుగులు

Mon,September 3, 2018 11:26 PM

కంటి వెలుగు పథకం ప్రారంభానికి ముందు అనేక ప్రశ్నలు. ఏసీ రూముల్లో కూసొని ప్రశ్నలు వేసేవాళ్లకేం తెలుసు గ్రామాల్లో ఉండే వృద్ధులు పడే కష్టాలు అనుకు న్నా. గత ఆగస్టు 15న కంటివెలుగు ప్రారంభమయ్యాక, తెల్లారి నుంచి శిబిరాల్లో చిన్నారుల నుంచి వృద్ధులదాకా బారులు తీరిన దృశ్యాలు చూస్తే ఏ ఒక్కరూ ఈ పథకాన్ని తప్పుబట్టరు. చేతిల పైసల్లేక, దవాఖానల చూపించుకునే స్థోమత లేక నరకయాతన అనుభవిస్తున్న వృద్ధులెందరో నని ఆ బారులు చూస్తే అర్థమైంది. గతంలో కంటి చికిత్స కోసం వృద్ధులు ప్రైవేట్ దవాఖా నకు పోవాలంటే చాలా ఇబ్బందులుండేవి. ఇబ్బందులను పక్కనపెడితే చాలా ఖర్చుతో కూడున్నకున్న పని. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ పేదల సౌకర్యార్థం వారి సొంత గ్రామాల్లోనే కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తూ ఎంతోమంది మస్కబారిన కండ్లలో వెలుగులు నింపుతున్నడు. ఇప్పుడు వృద్ధులు, కంటి సమస్య ఉన్న ఇతర బాధితులు పట్టణాలకో, నగరాలకో వెళ్లి చికిత్స చేయించు కోనవసరం లేదు.

ఎవరి ఊళ్లో వాళ్లే కంటి చికిత్స చేయిం చుకోవచ్చు. పరీక్షలు చేసుకొని, అద్దాలు అవసరం ఉంటే అవి కూడా ఉచితంగా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ అవ్వను పలుకరించి నా ఇంటికి పెద్ద కొడుకు లెక్క సీఎం కేసీఆర్ సార్ అన్ని సౌలత్‌లు చేస్తండని సంబురపడుతున్నరు. నెలనెలా ఇచ్చే వృద్ధాప్య పింఛన్ నుంచి ఆరోగ్య బాగోగులు కూడా చూసు కుంటున్నడని మురిసిపోతున్నరు. నేనీ మధ్య ఓ అవ్వను మందలించినప్పుడు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డున్నది బిడ్డా. కండ్లు కనవడుతలెవ్వు. దవాఖాన్ల చూపెట్టుర్రంటే ఎంబడి వచ్చేటోళ్లే లేరని కండ్లపొంటి నీళ్లు తీసింది. కంటి వెలుగులో చికిత్స చేయించుకున్న ఆ అవ్వ సీఎం కేసీఆర్‌కు చేతులెత్తి మొక్కింది. ఇలా ఎంతోమంది అవ్వల జీవితాల్లో వెలుగులు నింపిండు కేసీఆర్. వృద్దాప్య పింఛన్లు అందుకు న్న అవ్వల మురుసుడుకు అంతే లేదు. దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి.
- వేల్పుల రాజు, రామకృష్ణకాలనీ, తిమ్మాపూర్, కరీంనగర్

195
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles