అమెరికా బంధం


Sat,September 8, 2018 01:01 AM

ప్రపంచీకరణ నేపథ్యంలో భారత్ వంటి వర్ధమాన దేశాలు తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనేక చర్చ అనంతరం డబ్ల్యూటీవోలో చేరడానికి అం గీకరించాయి. కానీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న నిబంధనలను మాత్రమే అంగీకరిస్తామని అమెరికా ఇప్పుడు వాదించడం సబబు కాదు. అమెరికా మాత్రమే కాదు, అన్ని దేశాలు వాణిజ్య రక్షిత విధానాల వైపు మళ్ళితే, ఇక డబ్ల్యూటీవో ఉన్నది ఎందుకు? అమెరికా వాణిజ్య నిబంధనలను సమగ్ర దృక్పథంతో చూడాలె.

అమెరికా, భారత్ విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య (టూ ప్లస్ టూ డైలాగ్) చర్చ రెండు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయింది. కానీ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి జిమ్ మాటిస్‌తో పాటు చర్చల ప్రాధాన్యం దృష్ట్యా అమెరికా సైనిక దళాల అధిపతి జనరల్ జోసెఫ్ డన్‌ఫోర్డ్ కూడా రావడం విశేషం. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా బృందంతో చర్చలు జరిపిన చర్చ లు ఫలప్రదం అయినట్టే చెబుతున్నారు. అయితే వీటి పర్యవసానాలు దీర్ఘకాలికమైనవి. అమెరికా బృందంలోని ఒక అధికారి చెప్పినట్టు వచ్చే యాభై ఏండ్ల పాటు ప్రభావం చూపేవి. కమ్యూనికేషన్స్ కాంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రీమెంట్ (కామ్‌కాసా) అనే ఒప్పందం రెండు దేశాల సంబంధాలలో మైలు రాయి వంటిది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా రహస్య సాంకేతిక భాషలో ఉన్న కమ్యూనికేషన్స్ పరికరాలను భారత్‌కు సరఫరా చేస్తుంది.

అమెరికా యుద్ధ విమానాలలో వీటిని ఉపయోగించు కోవచ్చు. రెండు దేశాల మధ్య రక్షణ పరమైన నాలుగు కీలక ఒప్పందాలలో ఇప్పటి వరకు మూడు కుదిరాయి. మిగతా రెండింటిలో ఒకటి దీనికి తోడు సైనిక సమాచారం భద్రతా ఒప్పందం. మరొకటి సైనిక రవాణా సంబంధమైనది. 2002 నుంచి ఇటువంటి ఒప్పందాలపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఒప్పందాల మూలంగా భారత్ పూర్తిగా అమెరికా వైపు ఒరిగే అవకాశం ఉన్నదా? దాని పరిణామాలు ఎట్లా ఉంటాయనే చర్చ కూడా సాగుతున్నది. గతంలో కీలకమైన యుద్ధ సమయంలో అమెరికా భారత్‌కు సహకరించలేదు. అయినదానికి కానిదానికి భారత్‌పై ఆంక్షలు పెట్టడం, ఒత్తిడి తెచ్చి తనకు ఉపగ్రహంగా మార్చుకోవాలని యత్నించడం అమెరికా ధోరణి. అటువంటి దేశంతో రక్షణ మైత్రి ఎంత వరకు అభిలషణీయమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఇంతగా చర్చలు జరిగినప్పటికీ, రష్యా, ఇరాన్ తో సంబంధాల విషయంలో మినహాయింపు ఇస్తున్నట్టు కచ్చితంగా అమెరికా హామీ ఇవ్వడం లేదు. రష్యా నుంచి రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోవడంపై, తాము భారత్ వంటి భాగస్వామిని ఇబ్బం ది పెట్టదలుచుకోలేదని అమెరికా మాట మాత్రం గా అన్నది. తమ ఆంక్షల లక్ష్యం రష్యా ను ఇబ్బం ది పెట్టడానికే తప్ప భారత్‌ను కాదని కూడా పేర్కొన్నది. ఈ మాటలు కొంత ఊరట కలిగిస్తున్నాయి. కానీ అడపాదడపా మళ్ళా ఆంక్షలు ఎత్తివేయ లేద నే బెదిరింపులు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం, చబహర్ ఓడరేవును అభివృద్ధి చేయడంపై అమెరికా దిగివచ్చినట్టు కనిపించడం లేదు. భారత్ వర్ధమాన ఆర్థి క వ్యవస్థ. ఇంధన అవసరాలు భారీగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు సరఫరా కీలకమైంది. కానీ అమెరికా మాత్రం ఇరాన్‌పై ఆంక్షలను అమలు చేయవలసిదేనని స్పష్టం చేస్తున్నది.అఫ్ఘానిస్థాన్‌తో, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలకు ఇరాన్‌లోని చబహర్ రేవు ముఖ ద్వారం వంటిది. పాకిస్థాన్ భూభాగం నుంచి రవాణాకు ఇబ్బందులు ఉన్నందున ఇరాన్‌తో సత్సంబంధాలు తప్పనిసరి. దీనికితోడు ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో గస్తీపై భారత్‌పై ఆధారపడదలుచుకున్నది. ఇది భారత్ ప్రాధాన్యం కాదు. ఉత్తర కొరియా, ఇరాన్ దేశాల నుంచి అణ్వస్ర్తాలను తొలగించే క్రమం లో భారత్ సహకరించానేది అమెరికా కోరిక. కానీ ఇరాన్‌తో ఉన్న సత్సంబంధాల మూలంగా భారత్ ఇది ఇబ్బందికరమే. రష్యా, ఇరాన్ విషయంలో మెతకగా ఉన్నట్టు కనబడుతూనే, అమెరికా క్రమంగా భారత్‌ను తన పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు టూ ప్లస్ టూ చర్చల సరళిని బట్టి తెలుస్తున్నది.

వాణిజ్య లోటు కూడా టూ ప్లస్ టూ చర్చలలో ప్రాధాన్యం పొందింది. వాణిజ్య లోటును పూడ్చడానికి వచ్చే మూడేండ్లలో పది బిలియన్ డాలర్ల కొనుగోళ్లు చేయాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నది. యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ అంగీకరించిన తరువాత కూడా ఈ లోటు పూడ్చలేదనేది అమెరికా అభిప్రాయం. ఇప్పటికే చైనా, కెనెడా వంటి ఇతర దేశాలతోపాలు భారత్‌పై వాణిజ్య ఆంక్షలను విధించింది. అయితే డబ్ల్యూటీవో నిబంధనల పరిధిలో వ్యవహరించాలని భారత్ అంటున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత్ వంటి వర్ధమాన దేశాలు తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనేక చర్చ అనంతరం డబ్ల్యూటీవోలో చేరడానికి అం గీకరించాయి.

కానీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న నిబంధనలను మాత్రమే అంగీకరిస్తామని అమెరికా ఇప్పుడు వాదించడం సబబు కాదు. అమెరికా మాత్రమే కాదు, అన్ని దేశాలు వాణిజ్య రక్షిత విధానాల వైపు మళ్ళితే, ఇక డబ్ల్యూటీవో ఉన్నది ఎందుకు? అమెరికా వాణిజ్య నిబంధనలను సమగ్ర దృక్పథంతో చూడాలె. ఏది ఏమైనా టూ ప్లస్ టూ చర్చల పేరిట అమెరికా నుంచి అత్యున్నత స్థాయి బృందం వచ్చి తీవ్రస్థాయిలో చర్చలు జరిపింది. ఇక ముం దు కూడా తీవ్ర స్థాయి ఒత్తిడులు అమెరికా నుంచి ఉంటాయి. వీటిని తట్టుకొని మన ప్రయోజనాలను కాపాడుకునే సంస్కృతిని విదేశాంగ, రక్షణ, వాణిజ్య రంగాల యంత్రాంగం అలవరచుకోవాలనే సూచనలు రావడం గమనార్హం.

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles