పిల్లలు పరబ్రహ్మ స్వరూపులు, ప్రకృతిలోని ప్రతి వస్తు వు తనదేనంటూ మురిసిపోయే నగధీరులు. బాలల వికా సం కోసం బాల్యంలోకి అడుగులు వేసి ఆడాలి, పాడాలి, పరవశించాలి. అప్పుడే బాలల లోకంలోకి చేరుతాం. అట్టి బాలల అడుగులు గమ్యం వైపు పయనించేందుకు ఎంద రో బాల సాహితీవేత్తలు రాసిన కథలు, గేయాలు, జీవిత చరిత్రలు వ్యాసాల రూపాల్లో బాలల చెంతకు చేరి భవిష్యత్తుకు మార్గం చూపిస్తున్నాయి.
తెలంగాణలో బాల సాహిత్య వికాసం కోసం బాలలతో నే రచనలు చేయించేందుకు కార్యశాల ఏర్పాటుచేసి బాల కవులను సైతం తయారుచేస్తున్నారు. చిన్ననాడే సాహితీ బీజాలు నాటుతున్నారు. వాస్తవానికి బాలసాహిత్య రచన చేయాలంటే బాలల స్థాయికి దిగి ఆలోచించాలి. చెయ్యి తిరిగిన రచయితలు సైతం అమ్మో! బాల సాహిత్యమా అంటూ వెనుకడుగు వేసేవారు. కానీ నేడు బాల సాహిత్యానికి చక్కని ఆదరణ లభిస్తుండటంతో పరిస్థితులు మారిపోయింది. మేము సైతం రాయగలమంటూ, కలాలను కదిలించి ఎందరో సాహితీవేత్తలు రచనా పరిమళాలతో బాలసాహితీలోకంలో విహరిస్తున్నారు. పిల్లలకు మంచి నీతిని అందించేలా చిట్టిపొట్టి మాటలతో, ఆకర్షణీయమైన బొమ్మ లతో రచనామృతాన్ని అందించేది బాలసాహిత్యం.
అనేక సాహితీసంస్థలు కూడా నేడు బాలసాహిత్యానికి పెద్దపేట వేస్తుండటం సంతోషం. చిల్డ్రన్స్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ బాలచెలిమి ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో పాఠశాలల్లో విద్యార్థు ల చేత రచనలు చేయించి పుస్తకాలు ముద్రించి, బాల కవులను తయారుచేస్తున్న ఉపాధ్యాయులకు శతధా వందనా లు. ఒకవ్యక్తి కవిగా మారితే మంచిని పంచుతాడని, సమాజాన్ని చైతన్యపరిచి ప్రగతి వైపు మళ్లిస్తారని అంటాం. అలాంటి సందర్భంలో చిన్ననాడే సాహితీ రచనలతో బాల కవులుగా సమాజసేవ చేయాలని, జగతిని జాగృతపరుచాలని బాల కవులు ముందుకునడిస్తే భవిష్యత్ అంతా బం గారుమయం. ఆ శక్తి బాలసాహిత్యానికి ఉన్నది. అందుకే విరివిగా బాలసాహిత్య కార్యక్రమాలు కవి సమ్మేళనాలతో పాటుగా బాలోత్సవాలు జరుగాలి. అప్పుడే బాలసాహి త్యం వర్ధిల్లుతుంది.
- ఉండ్రాళ్ల రాజేశం, సిద్దిపేట
(నేడు బాలల దినోత్సవం..)