ఉధృతమవుతున్న నిరసనలు


Sat,November 9, 2019 01:02 AM

చౌ హాంకాంగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్సరం విద్యార్థి. నెట్‌బాల్, బాస్కెట్ బాల్ ఆటగాడు. యూనివర్సిటీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులు పెద్దఎత్తున చౌ అమరత్వం పట్ల తీవ్రంగా స్పందించారు. వేలాదిమంది నల్లగౌన్లు ధరించి చౌ మరణానికి నిరసన సూచికగా ప్రదర్శించారు. మరికొంత మంది విద్యార్థుల ప్రభుత్వం నిషేధించిన మాస్కులను ధరించి నిరసన తెలిపారు. యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా పట్టాలు పంపిణీ చేస్తున్నప్పుడు విద్యార్థులంతా హాంకాంగ్ కోసం నిలబడి పోరాడుతామని నినదించారు. ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు డిమాండ్లలో ఒకదాన్ని కూడా వదులుకోబోమని చౌ ఫొటోలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

హాంకాంగ్‌లో గత ఆరు నెలలుగా సాగుతున్న నిరసనోద్యమాలు తాజాగా ఓ విద్యార్థి మరణంతో మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులుగా సాగుతున్న విద్యార్థి నిరసనోద్యమాల్లో హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థి చౌ జా లోక్ అనే విద్యార్థి గత సోమవారం తీవ్ర గాయాలతో దవాఖాన పాలై ఈ శుక్రవారం చనిపోయాడు. దీంతో చైనా పాలనలోని హాంకాంగ్ అట్టుడుకుతున్నది. విద్యార్థికి గాయాలు ఎలా అయ్యాయన్న దానిపై స్పష్టత లేకున్నా ప్రజలు, విద్యార్థుల్లో ప్రభు త్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనోద్యమం సందర్భం గా పోలీసులు నిరసనకారులను చెల్లాచెదురు చేసే సందర్భంలో అతను పెద్ద భవనం పైనుంచి రెండు, లేదా మూడో అంతస్తు నుంచి పడిపోయి ఉంటాడని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. గతంలో నిరసనకారుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విద్యార్థిలోకం చౌ మరణానికి కూడా పోలీసులే కారణమై ఉండవచ్చు నన్న ప్రచారమున్నది. 22 ఏండ్ల విద్యార్థి చౌకు నివాళులు అర్పించేందుకు వేలాదిమంది విద్యార్థులు రోడ్లపైన నిరసన తెలుపుతున్నారు.

నెలల తరబడి సాగతున్న చైనా వ్యతిరేక ఆందోళనలు విద్యార్థి మరణంతో మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వ పాలనాతీరుపై ఆగ్రహంతో ఉన్న హాంకాంగ్ ప్రజలు ఈ దుర్ఘటనతో మరింత రాజకీయ సంక్షోభానికి కారణమయ్యే పరిస్థితులున్నాయి. గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న సందర్భంలో వేలాదిమంది విద్యార్థులు దవాఖానకు చేరి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ పూలబొకే లు సమర్పించారు. దవాఖాన గోడలపై, నోటీస్‌బోర్డుపై విద్యార్థి కోలుకోవాలని రాతలు రాశారు. మిత్రమా త్వరగా కోలుకోవాలి. మనం లెజిస్టేటివ్ కౌన్సిల్‌లో కలుసుకుందాం.., మిత్రమా మనం ఇలాంటి ఎన్ని పరిస్థితులను చవిచూడాలసి వస్తుందో.. అంటూ విద్యార్థులు తమ సందేశా ల్లో రాయటం గమనార్హం. గత జూన్ నెల నుంచి హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య పరిస్థితుల కోసం, అనుమానితులను విచారణ కోసం చైనా తరలించే చట్టానికి నిరసనగా హాంకాంగ్‌లో నిరసనోద్యమం ప్రారంభమైంది. నాటినుంచి చైనా ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా, స్థానిక హాంకాంగ్ పాలకులు అనుమానితులను అప్పగించే చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ముఖ్యంగా నిరసనోద్యమాల్లో పాఠశాల విద్యార్థులను ముందుభాగాన ఉంచి ఉద్యమిస్తున్నారు. 2012 లో చైనా అధ్యక్షుడు అధికారం చేపట్టిన నాటినుంచి ఇంత పెద్ద ఎత్తున నిరసనోద్యమం ఎదుర్కోవటం ఇదే మొదటిసారి.

నెలల తరబడి కొనసాగుతున్న నిరసనోద్యమం పట్ల హాంకాంగ్ పోలీసులు అతిగా ప్రవర్తిస్తూ హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తరచుగా హింస కొనసాగుతున్నది. నిరసనకారులు పెట్రోల్ బాంబులు విసిరిన ఘటనలున్నాయి. బ్యాంకులు, పెద్ద మాల్‌లు, మెట్రో స్టేషన్లు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు కూడా టియర్‌గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించిన సందర్భాలున్నా యి. మొత్తంగా చూస్తే ఎంతగా శాంతియుతంగా సాగుతున్నట్లు కనిపిస్తు న్నా నిరసనోద్యమంలో అనివార్యంగా హింస చోటుచేసుకుంటున్నది. ఆ క్రమంలోనే జూన్ నెలలో 35 ఏండ్ల మార్కో లెయుంగ్ అనే నిరసనకారు డు చనిపోయాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత మంది విద్యార్థు లు, యువకులు తమ ప్రాణాలు విడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చౌ హాంగ్‌కాంగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్స రం విద్యార్థి. నెట్‌బాల్, బాస్కెట్ బాల్ ఆటగాడు. యూనివర్సిటీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులు పెద్దఎత్తున చౌ అమరత్వం పట్ల తీవ్రంగా స్పందించారు. వేలాదిమంది నల్లగౌన్లు ధరించి చౌ మరణానికి నిరసన సూచికగా ప్రదర్శించారు. మరికొంత మంది విద్యార్థుల ప్రభుత్వం నిషేధించిన మాస్కులను ధరించి నిరసన తెలిపారు. యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా పట్టాలు పంపిణీ చేస్తున్నప్పు డు విద్యార్థులంతా హాంకాంగ్ కోసం నిలబడి పోరాడుతామని నినదించారు. ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు డిమాండ్లలో ఒకదాన్ని కూడా వదులుకోబోమని చౌ ఫొటోలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మా సహ విద్యార్థి చనిపోయిన విషాద సందర్భంలో మొఖంపై చిరునవ్వును పులుముకోలేమని చెన్ అనే విద్యార్థి అంటున్నాడు. చౌ ఎక్కడైతే గాయాలతో పడిపోయాడో ఆ స్థలంలో విద్యార్థులు పెద్దఎత్తున గుమికూడి నివాళిగా పూల గుచ్ఛాలుంచారు.
lab
మరోవైపు హాంకాంగ్ ప్రభుత్వం కూడా విద్యార్థి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసింది. జరిగిన ఘటన పట్ల పూర్తి విచారణ చేపడుతామ ని ప్రకటించింది. అతని చావుకు కారణాలను బయటకు తీస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే హాంకాంగ్‌లోని ప్రధాని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో వెయ్యిమంది విద్యార్థులు ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా 18 ఏండ్ల పెగ్గీ అనే విద్యార్థి మాట్లాడుతూ.. చౌ మరణం పట్ల పూర్తి విచారణ చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే ఇదే తరహాలో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశాడు. హాంకాంగ్ ఉత్తర భాగం నగరంలో హైస్కూల్ విద్యార్థులు కూడా చౌ చిత్రపటాలతో పెద్ద ఊరేగింపు తీశారు. దీంతో హాంకాంగ్‌లోని పెద్ద మాల్‌లు, షాపింగ్ సెం టర్లు మూతపడ్డాయి. పెద్దఎత్తున పోలీసుల మోహరింపుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

గత శుక్రవారం ఓ షాపింగ్ మాల్ దగ్గర ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఒక వ్యక్తి కత్తితో దాడి చేయటం తో ఒక వ్యక్తి చెవి తెగిపోయిన ఘటన తీవ్ర భయబ్రాంతులకు గురిచేసిం ది. కత్తిగాటుకు గాయపడిన వ్యక్తి స్థానిక రాజకీయవేత్తగా చెబుతున్నారు. 1997 నుంచి హాంకాంగ్ చైనా అధీనంలోకి వచ్చిన నాటినుంచీ ఏదో రూపంలో హాంకాంగ్‌లో నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. ఒక దేశం రెండు పాలనావిధానాలు పేరుతో చైనా హాంకాంగ్‌పై పాలనాధికారాలు చెలాయిస్తున్నది. వలస పాలనకు కొనసాగింపుగా సాగుతున్న చైనా విధానానికి వ్యతిరేకంగా హాంకాంగ్ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, స్వతంత్ర న్యాయవ్యవస్థ కోసం పోరాడుతున్నారు. కాగా చైనా పాలకులు మాత్రం హాంకాంగ్‌లో సాగుతున్న నిరసన ఉద్యమాల వెనుక పాశ్చాత్య దేశాల హస్తం ఉన్నదని ఆరోపించటం గమనార్హం.
( ది వైర్ సౌజన్యంతో..)

318
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles