అవినీతిని రూపుమాపాలె


Sat,November 9, 2019 01:00 AM

తహసీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అవినీతిపై చర్చ జోరుగా సాగుతున్నది. అవినీతిపై మేధావుల నుంచి సోషల్‌మీడియా నెటిజన్ల దాకా అనేక సూచ నలు చేస్తున్నారు. ఈ తరుణంలో మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసు కుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు దొరికిపోయాడు. విజయారెడ్డి హత్య తర్వా త ఓ రెవెన్యూ ఉద్యోగిని ఒక మహిళ నా దగ్గర తీసుకున్న లంచం తిరిగిచ్చేయమం టూ నిలదీసింది. ఈ వీడియో సోషల్ మీడి యాలో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనలు చూస్తుంటే ప్రభుత్వ అధికారులపైనే ఏవ గింపు కలుగతున్నది. ఇప్పటికైనా అవినీతి పై ఒక సార్వత్రిక పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది.
- సూరనేని శ్రీనివాస్, హైదరాబాద్


పారదర్శకంగా వ్యవహరించాలె

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ప్రతిష్ఠా త్మకంగా తీసుకొని పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశం. ఆసరా పింఛన్ల నుంచి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు పేదలకు ఆసరాగా నిలుస్తున్నాయి. పెళ్లీడుకొచ్చిన ఆడబిడ్డ పెళ్లి కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ పథకం కింద సుమారు రూ.లక్షకుపైగా వధువు తల్లిదండ్రులకు అందజే స్తున్నది. ఈ పథకం పట్ల ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందు కుంటున్నది. అయితే ఇలాంటి పథకాలపై కన్నేసిన నకిలీ ముఠాలు దొంగ పత్రాలు సృష్టిస్తూ నిధులను పక్కదోవ పట్టిస్తుండటం అర్హులై న వారికి ఆసరా పింఛన్లు రాకుండా అనర్హులకు పింఛన్లు రావడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కళ్యాణలక్ష్మీ పథకంలో కూడా ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటుండటం బాధాకరం. పథకా ల అమలు విషయంలో రాజకీయ నాయకులు, అధికారులు పారదర్శకం గా వ్యవహరించాలి. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు గడప గడపకూ చేరేలా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తూ ప్రభుత్వ నిధులను పక్కదోవ పట్టిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతి, అక్రమార్కుల ఆగడాలను అరికట్టాలి.
- జంగిలి మహేశ్, కోతిరాంపూర్, కరీంనగర్

73
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles