సమ్మె సమంజసం కాదు


Thu,October 10, 2019 12:38 AM

ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలు అన్నీ ఇన్నీ కావు. ఇదే అదనుగా ప్రైవేట్‌ వాహ నాల దోపిడీ పక్కనపెడితే, ఆర్టీసీ బస్సులను నడుపు తున్నవారు కూడా ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేయటం గర్హనీయం. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ప్రజ లకు ఇబ్బందులు కలుగకుండా యాజమాన్యం బస్సు లు నడుపాలన్న నిర్ణయం హర్షణీయమైనదే. అయితే ఆ బస్సులు నడుపుతున్న వారు ఏవిధమైన జవాబుదారీ తనం లేకుండా ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తున్నా రు. కనీసంగా ఛార్జీలకు రెండు రెట్లు వసూలు చేస్తున్నా రు. ఏమైనా అడిగితే దిగిపోండని చీదరించుకుంటున్నా రు. కోడెలు కోడెలు కొట్లాడితే లేగదూడలకు ప్రాణం మీదికి వచ్చినట్లుగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. బస్సుల్లో తగురీతిన ఛార్జీలు వసూలు చేయటానికి ప్రభుత్వం తగు సూచనలు చేయాలి. ఏదేమైనా పండు గ పూట ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడం సమంజసం అనిపించుకోదు.
- ఉప్పల ఉదయ్‌కుమార్‌, భువనగిరి


ఆరోగ్య సేవలు విస్తృతపరుచాలె

గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిల్లిపాది జ్వరాల బారిన పడిన ఉదంతాలుంటున్నాయి. దీంతో పాటు డెంగ్యూ వ్యాధి కూడా విస్తరిస్తున్నది. మండల, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. మౌలిక వసతులు, సౌకర్యాలు లేక రోగులు నేలపైనే వైద్య సేవలు పొందాల్సిన పరిస్థి తులు ఉన్నాయి. ఈ మధ్యన కురుస్తున్న వర్షాలతో కూడా విషజ్వరాలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు న్నాయి. కాబట్టి ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాలను బలోపేతం చేసి సాధారణ విషజ్వరాలకు తగిన చికిత్స ప్రజలకు ఇంటిదగ్గరే అందించే ఏర్పాటుచేయాలి. ఇలా చేసినప్పుడే జిల్లా కేంద్రంలోని దవాఖానలకు రోగుల తాకిడి తగ్గుతుంది. డెంగ్యూ జ్వరానికి కూడా తగు చికి త్సలు అందరికీ అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- డి.వాసు, లోయపల్లి, ఇబ్రాహీంపట్నం

136
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles