పాలకూర సాగు సులభం లాభాలు అధికం


Thu,October 10, 2019 03:45 AM

RAITHUBADI
ఆరోగ్యానికి ఆకుకూరలు మంచివి అంటారు నిపుణులు. అయితే ఆకుకూరల్లోని పాలకూరలో మంచి పోషక విలువలు ఉంటాయి. దీంతో ఈ ఆకు కూరకు అధిక ప్రాధాన్యం ఉన్నది. దీని సాగుకు నీరు తక్కువగా అవసరం. దీంతోపాటు సులభ పద్ధతిలో సాగు చేసుకునే అవకాశం ఉన్నది. అంతేకాదు మార్కెట్‌లో కూడా ఈ ఆకు కూరకు మంచి గిరాకీ ఉన్నది. అందుకే రైతులు ఈ సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కు కోవచ్చునని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర సాగు గురించి వారు తెలిపిన వివరాలు..


సాధారణంగా పాలకూరను సారవంతమైన మురుగునీరు పోయే నేలలు అనుకూలం. చౌడునేలల్లోనూ పాలకూరను పండించవచ్చు. సాధారణంగా మన ప్రాంతంలో దీనిని అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు పండించవచ్చు.

నాటుకునే విధానం: ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనా లు అవసరం. విత్తనాలను 20X10 సెంటీమీటర్ల దూరంలో ను, 3-4 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. ఇలా విత్తుకు న్న విత్తనాలు 8-10 రోజులలో మొలకెత్తుతాయి.

ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 6-8 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరువు, 4 కిలోల అజోస్పైరిల్లమ్‌, 4 కిలోల ఫాస్పో బాక్టీరియంలు వేయాలి.

రసాయన ఎరువులు: ఎకరాకు 10 కిలోల నత్రజని, 10 కిలో ల భాస్వరం, 20 కిలోల పొటాష్‌లను వాడాలి. ప్రతి కోత తర్వాత 10 కిలోల నత్రజని వేయాలి.

నీటి యాజమాన్యం: విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వాలి. భూమిలో తేమను బట్టి ప్రతి 7-10 రోజులకు ఒక్కసారి నీటి తడి ఇవ్వాలి. తుంపర పద్ధతిలో నీటిని అందిస్తే నీటిని పొదుపు చేయడంతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయవచ్చు.

సస్యరక్షణ: ఆకుకూరలకు తక్కువ సాంద్రత గల పురుగు మందులను మాత్రమే వాడాలి. పేనుబంక, ఆకులు తినే గొంగ ళి పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మి.లీ.ల మలాథిన్‌ కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ మందును కలిపి పిచికారీ చేయాలి. మందును పిచికారీ చేసిన తర్వాత పదిరోజుల సమ యం గడిచిన తర్వాతే ఆకులు కోయాలి.

ఆకుల కోత: విత్తిన 3-4 వారాలకు మొదటి కోతకు వస్తుంది. తర్వాత 7-10 రోజలు వ్యవధిలో 4-6 కోతలు తీసుకోవచ్చు.
దిగుబడి: పాలకూరలో ప్రధానంగా ఆల్‌గ్రీన్‌, పూసాజ్యోతి, ఊటి నెంబర్‌-1 అనే రకాలు ఉన్నాయి. వీటిలో ఆల్‌గ్రీన్‌ అనేరకం ఎకరాకు ప్రతి 15 రోజులకు ఒకసారి కోత చొప్పున 6,7 కోతలలో 5 టన్నులు, పూసాజ్యోతి 6-8 కోతలలో 16-19 టన్నులు, ఊటి నెంబర్‌-1 రకం 4 కోతలలో 24 టన్నుల దిగుబడి వస్తుంది. దీంతో ఎకరా పాలకూర తోటలో రైతులకు అన్ని పెట్టుబడులు పోగా రూ. 3లక్షలకు పైనే ఆదాయం ఉంటుంది.
RAITHUBADI1

మంచి లాభాలు

పాలకూరలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి దీనివల్ల మార్కెట్‌లో దీనికి మంచి డిమాండు ఉంటుంది. కాబట్టి రైతులు ఈ ఆకు కూరను సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. ఈ పంట సాగు తేలిక. మంచి విత్తనాలను ఎంచుకున్న తర్వాత వాటిని సరైన పద్ధతులలో నాటు పెట్టి సకాలంలో నీటి తడులు అందించాలి. మోతాదు ప్రకారం ఎరువులు వేస్తూ.. అవసరానికి తగ్గట్టుగా మందులను వాడితే మంచి దిగుబడులు వస్తాయి.
- సీహెచ్‌.నరేష్‌, 9603268682 కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి

నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945 గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా

469
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles