జమ్మిచెట్టు ప్రాశస్త్యం


Mon,October 7, 2019 11:08 PM

జమ్మిచెట్టు దసరా నవరాత్రుల్లో గుర్తుకువ చ్చే చెట్టు. వాడుక భాషలో జమ్మిచెట్టుగా పిలుచుకునే ఈ చెట్టును శమీ వృక్షం అని సంసృ్కతంలో పిలుచుకుంటాం. శమీ వృక్షానికి దస రా పండుగకు ప్రశస్థమైన విశేషం ఉన్నది. వైదిక భాషలో అరణి అని పిలుస్తారు. అరణి అంటే అగ్ని ని ఉద్భవించేందుకు కాష్టాంతరించే మధింపజేయడానికి యోగ్యమైన దారువని అర్థం. అందుకే పురాణకాలం నుంచి శమీ వృక్షం పూజ్యనీయమైనది. జమ్మిచెట్టు వేలాడే శాఖలతో, ముళ్లతో కూడిన మధ్యరకంగా పెరిగే వృక్షం. జమ్మి పత్రాలు సన్నగా దీర్ఘవృత్తాకారంగా గురు ఆగ్రంతో పత్రకాలున్న ద్విపిచ్చకార సంయుక్త పత్రాలుంటాయి. ఈ చెట్టుకు సన్న టి పొడుగాటి కంకులతో అమర్చబడిన పసుపురంగు పుష్పాలుంటాయి. జమ్మిచెట్టును విజయదశమి రోజు న తప్పక దర్శనం చేసుకుంటారు. శమీపూజ ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ అర్జునస్య ధనుర్ధారీ.. రామస్య ప్రియదర్శనం అని పురాణాల ప్రకారం శ్రీరాముడు విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి రావణుని సంహరించి, విజయం పొందాడు. రాముడు, రావణాసురుడి పది తలలు చూసి భీతిల్లి నిద్రించిన శక్తిని పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని శ్రీరామునికి విజయాన్ని కలుగుజేసింది.


శ్రీరాముడు శక్తిని మేల్కొలిపిన సమయం ఆశ్వీయుజ శుక్ల పాఢ్యమి. నాటినుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానమెక్కి అయోధ్యకు బయల్దేరాడు. అలా బయల్దేరే ముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే దేవీ నవరాత్రుల ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడమనేది ఆనవాయితీగా వస్తున్నది. మహాభారతంలో కూడా పాండవులు పన్నెండేండ్ల అరణ్యవాసం పూర్తి చేసుకొని అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి, విరాటరాజు వద్ద కొలువుకు వెళ్లారు. ఏడాది తర్వాత తిరిగివచ్చి ఆ ఆయుధాలను ధరించి అర్జునుడు గో గ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీవృక్ష రూపంలో ఉన్న అపరాజితా దేవి తనను వేడిన వారికి సదా విజయాన్నందిస్తుంద ని, అందుకే శమీ వృక్షానికి ప్రాముఖ్యం. విజయదశమి నాటి ఆయుధపూజ వెనుక ఆంతర్యమూ ఇదే! జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు.

విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన జమ్మిచెట్టుకు పూజలు చేసి
శమీ శమయతే పాపం శమలోహిత కంటకా
ధారిణ్యర్జున బాణానాం రాసమస్య ప్రియవాదినీ
కరిష్యమాణ యాత్రాయాం, యథాకాల సుఖంమతా
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామ పూజితే॥
అనే శ్లోకం పఠించి, రాసుకున్న చిట్టీని ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శని దోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. ఎందుకంటే జమ్మిచెట్టు శనీర్వరునికి ప్రతీక. అనంతరం శమీ పత్రాలను తీసుకువచ్చి పెద్దల చేతిలో పెట్టి, పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా ఆనవాయితీ. తెలంగాణ లో జమ్మి దర్శనం అనంతరం పాలపిట్టను దర్శించుకోవడం ఆచారం.
r-mothi
అంతేకాకుండా జమ్మిచెట్టు అనేక ఔషధాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చెట్టుకు సురభి బంగారం అని పేరు కూడా వచ్చింది. దేవతా ప్రతీక అయినా జమ్మిచెట్లను ప్రతి దేవాలయ ప్రాంగణంలో ఉండేవిధం గా ప్రభుత్వం కృషిచేయాలి. అప్పుడే భావితరాలకు జమ్మిచెట్టు విశిష్టత తెలుస్తుంది.
(వ్యాసకర్త్త: సేఫ్‌ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు)

547
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles