సమాఖ్యతత్వం ప్రధానం


Sun,October 6, 2019 01:32 AM

పధ్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ గడువు ముగింపునకు వచ్చేకొద్దీ, దేశ సమాఖ్య విత్త విధాన స్వరూపంపై చర్చ పెరుగుతున్నది. రాష్ర్టాలకు పన్నుల బదలాయింపు చేయాలన్న ఫైనాన్స్ కమిషన్ సూచనలను పరిస్థితి ఏమిటి? 15వ ఫైనాన్స్ కమిషన్ పరిధిని విస్తృత పరుస్తారా? జీఎస్టీ వ్యవస్థ ప్రభావాలు ఎట్లా ఉంటాయ నే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంప్రదాయకంగా ఫైనా న్స్ కమిషన్ పరిధిలో లేని అంశాలపై కూడా చర్చ సాగుతున్నది. ఒకప్పుడు ప్రణాళికా సంఘం పరిధిలో ఉండే అంశాలను కూడా పరిశీలనకు చేపట్టే సంస్థగా ఫైనాన్స్ కమిషన్‌ను భావించేవారు. ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహామండలి చైర్మన్ బిబెక్ డెబ్రాయ్ ఇటీవల రాసిన వ్యాసాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవ చ్చు. ఈయన అభిప్రాయం ప్రకారం.. సీఎస్‌ఎస్ (కేం ద్రం స్పాన్సర్ చేసే పథకాలు) బాస్కెట్ గడువు పధ్నాలుగవ ఫైనాన్స్ కమిషన్‌తో పాటే ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాలను హేతుబద్ధీకరించే, పునర్వ్యవస్థీకరించే అవసరం ఏర్పడ్డది. ఇది చాలా తీవ్రమైన ఆలోచనాధోరణి. కేంద్ర పథకాల కింద ఉండే నిధులను తరలించాలనే సూచనలు చేసే అధికారం ఫైనాన్స్ కమిషన్‌కు లేదు. ఈ సంస్థ పరిధిలోకి అవి రావు. సీఎస్‌ఎస్ పధ్నాలుగవ ఆర్థిక సంఘంతో పాటే గడువు తీరిపోతాయని చెప్పడం కేంద్రం నుంచి రాష్ర్టాలకు నిధుల తరలింపుపై గల తప్పుడు అవగాహనకు నిదర్శనం. కేంద్రం రెండురకాలుగా నిధులను బదిలీచేస్తుంది. ఒకటి సాధారణ అవసరాలకు సంబంధించినవి, రెండవది నిర్దిష్టమైనవి. ఫైనాన్స్ కమిషన్ ఐదేండ్లకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ కమిషన్ చేసే సూచనలు సాధారణ అవసరాలకు సంబంధించినవి మాత్రమే. వీటికి ఏ ప్రత్యేక పథకాలతో ముడిపెట్టి చూడకూడదు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వశాఖల ద్వారా నిర్దిష్ట అంశాలకు సంబంధించిన కేటాయింపులు చేస్తుంది.


7వ షెడ్యూల్‌లోని అంశాలను పునఃపరిశీలించడం అంటే కేంద్ర, రాష్ర్టాలకు సంబంధించిన అధికార విభజనను మార్చడమే. దీనివల్ల కేంద్ర రాష్ర్టాల మధ్య ఉన్న అధికార సమతుల్యం కదిలిపోతుంది. కేంద్ర రాష్ర్టాల అధికారాల పునర్విభజనకు సంబంధించి మార్పులు చేయాలని భావించేవారి ఆలోచనలు ఏమిటో గమనించవలసి ఉన్నది.


ఇందు లో సీఎస్‌ఎస్‌తో పాటు కేంద్ర పథకాలు (సీఎస్) కూడా ఉంటాయి. ఈ నిధుల బదిలీకి ఏ కేంద్ర మంత్రిత్వశాఖ ప్రత్యేక పథకాలతో సంబంధం లేదు. అంటే ఈ పథకా లు ఫైనాన్స్ కమిషన్ పరిధికి బయటఉండేవి. కేంద్రం ప్రత్యేకించి ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఫైనా న్స్ కమిషన్‌కు అప్పగిస్తే తప్ప కమిషన్‌కు వీటితో సం బంధం లేదు. అందువల్ల పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ గడువు ముగియగానే ఈ పథకాల కాలం చెల్లుతుందన డం తప్పు. కేంద్ర ప్రభుత్వం ఎంతకాలం అనుకుంటే, అంతకాలం వీటిని కొనసాగించవచ్చు.
బిబెక్ డెబ్రాయ్ తన వ్యాసంలో రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ను పునఃపరిశీలించాలని కూడా అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ర్టాల మధ్యవ్యయాన్ని ఈ షెడ్యూ ల్ విభజించి చెబుతుంది. ఆరోగ్యరంగానికి కేంద్రం ఖర్చుపెడుతున్నప్పుడు, రక్షణరంగానికి రాష్ర్టాలు ఎం దుకు నిధులు ఇవ్వకూడదని ఈయన ప్రశ్నిస్తున్నారు. ఈ వాదన చాలా సమస్యలు సృష్టిస్తుంది. ఆయన పోలికలు అసంబంద్ధమైనవి. అంతేకాకుండా భిన్నస్థాయిల్లో ని ప్రభుత్వాల విధులు ఫెడరల్ వ్యవస్థలో భిన్నంగా ఉం టాయి. ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి- కేం ద్ర, రాష్ర్టాల మధ్య శాసనాధికారాలను మూడు రకాలు గా విభజించింది. 7వ షెడ్యూల్‌లోని మూడు జాబితాలలో అంశాలవారీగా అధికార విభజనలను చేసింది. కేంద్ర, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా స్పష్టంగా వివరించింది. దీన్నిబట్టి రాష్ర్టాలు కూడా తమ విధుల నిర్వహణకు భారీవ్యయం అవసరమని చెప్పినట్టయింది. అయితే ఆదాయాన్ని సమీకరించే అధికారం రాష్ర్టాలతో పోలిస్తే కేంద్రానికే ఎక్కువగా ఉన్నాయి. ఈ అసమతౌల్యాన్ని సరిదిద్దేందుకే భారీగా నిధుల విడుదల రాష్ర్టాల కు చేయవలసి వస్తున్నది. ఇక్కడ మరో అంశాన్ని కూడా గుర్తించాలె. దేశవ్యాప్తంగా రాష్ర్టాల మధ్య అభివృద్ధిలో అంతరాలున్నాయి. విద్య, ఆరోగ్యం, ఉపాధి మొదలైన అంశాల ప్రాతిపదికగా చూస్తే జీవన నాణ్యతలో ఎంతో తేడా ఉన్నది.

తక్కువ ఆదాయం ఉన్న రాష్ర్టాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి. వీటికి ఆదాయమార్గాలు చాలా తక్కువ. ప్రజాసేవలు మొదలైన అంశాలకు సంబంధించిన కనీస ప్రమాణాలు పాటించడానికి కేంద్రం కొన్ని నిర్దిష్ట అంశాలకు సంబంధించి నిధులు విడుదల చేయ డం తప్పనిసరి. విద్య, ఆరోగ్యం మొదలైన అంశాల్లో కొన్ని రాష్ర్టాల ను ఆదుకోవలసి ఉంటుంది. కేంద్ర నిర్దిష్ట పథకాల కోసం అం టూ నిధులు విడుదల చేయకపోతే ఆయా రంగాలకు నిధులు అందవు. రాష్ర్టాలకు ఆదాయం లేకపోవడం వల్ల కావచ్చు, ప్రాధాన్యాలు గుర్తించకపోవడం వల్ల కూడా కావచ్చు. సీఎస్‌ఎస్, సీఎస్ పథకాల కోసం వ్యయం చేయడానికి రాష్ర్టాలకు నిధుల కొరత ఉందని డెబ్రాయ్ కూడా తమ వ్యాసంలో ప్రస్తావించారు. కేం ద్ర నిధులు లేకపోతే కొన్ని రాష్ర్టాలకు కొన్ని ప్రధాన రం గాలకు కూడా నిధులుండవు. ఒక అంశం మీద శాసనం చేయడానికి, వ్యయం చేసే అధికారానికి సంబంధం ఉంటుంది. కేంద్రం రక్షణ రంగానికి సంబంధించి శాసనం చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుం ది. రాష్ర్టాలకు అధికారం ఉండదు. అందువల్ల కేంద్రమే వ్యయం చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, రైల్వేస్, అణు ఇంధనం, ఆదాయం పన్ను, కస్టమ్స్ సుంకాలు మొదలైన అంశాలపై కేంద్రానికి మాత్రమే అధికారాలు ఉం టాయి. రాష్ర్టాల జాబితాలో ఉండే అంశాలు ఎక్కువగా సామాజిక ఆర్థిక సేవలకు సంబంధించినవై ఉంటాయి. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. ప్రజలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ అంశాలు రాష్ర్టాల పరిధిలో ఉంటేనే సమర్థవంతంగా అమలుచేయడం సాధ్యమవుతుంది.
c-singh
7వ షెడ్యూల్‌లోని అంశాలను పునఃపరిశీలించడం అంటే కేంద్ర, రాష్ర్టాలకు సంబంధించిన అధికార విభజనను మార్చడమే. దీనివల్ల కేంద్ర రాష్ర్టాల మధ్య ఉన్న అధికార సమతుల్యం కదిలిపోతుంది. కేంద్ర రాష్ర్టాల అధికారాల పునర్విభజనకు సంబంధించి మార్పులు చేయాలని భావించేవారి ఆలోచనలు ఏమిటో గమనించవలసి ఉన్నది. సాధారణ అంశాలకు, నిర్దిష్ట కార్యకలాపాలకు కేంద్రం రాష్ర్టాలకు నిధులు ఇస్తున్నది. దీనివల్ల రక్షణరంగానికి సంబంధించి నిధులు సరిపోవడం లేద నే వాదన ముందుకుతెస్తున్నారు. అయితే కేంద్ర రాష్ర్టా ల మధ్య ఆదాయవ్యయాలను మార్చవలసి ఉన్నది. ఫైనాన్స్ కమిషన్ సూచనల నేపథ్యంలో రాష్ర్టాలకు భారీగానిధుల బదలాయింపు జరుగవలసి ఉన్నది. అయితే కేంద్ర, రాష్ర్టాల ఆదాయాల పునఃసమీక్ష జరుగవలసి ఉన్నది. జీఎస్టీ అమలుచేసిన తర్వాతి పరిస్థితుల్లో ఇటువంటి సమీక్ష అవసరం ఏర్పడ్డది. అయితే వ్యయాల ప్రాధాన్యాలను మార్చడం కోసమే 7వ షెడ్యూల్‌పై చర్చ జరుపడం మంచిది కాదు. దీనివల్ల రాష్ర్టాల స్వయం సమృద్ధికి ఇప్పుడున్న కొద్దిపాటి అధికారాలు లేకుండా పోతాయి. 7వ షెడ్యూలు శిలాశాసనం అని దీనిని మార్చకూడదని భావించడం సరికాదు. అయితే రాష్ర్టాలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడానికి, సమాఖ్య స్వరూపాన్ని మరింత అర్థవంతంగా చేయడానికి మార్పులు చేయవచ్చు.

(వ్యాసకర్త: స్వతంత్ర పరిశోధకులు. పబ్లిక్ ఫైనాన్స్
రంగంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి,
ఐరాసకు సేవలందిస్తున్నారు.
(వ్యాసకర్త: పబ్లిక్ ఫైనాన్స్ అనలిస్ట్)

321
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles