ఆధిపత్యానికి అంతం


Sat,October 5, 2019 12:58 AM

2014, జూన్ 2న సచివాలయంలోకి అడుగుపెట్టిన తెలంగాణ జర్నలిస్టులకు, ఉద్యోగులకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదే ఏడాది సీ బ్లాక్ ముందు బతుకమ్మ ఆడుతుంటే మా మనస్సు ఉప్పొంగింది. కల సాకారమైందని అలైబలై చేసుకున్నం.
Vijeykumar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన అనేక ఘటనలకు తెలంగాణ జర్నలిస్టుగా నేను ప్రత్యక్ష సాక్షి. తెలంగాణ రాక ముందు పలు పరిణామాలు కళ్ల్లారా చూశాను. ఇక నుంచి ఆ సచివాలయానికి వెళ్లడం కుదరదు. కాబట్టి పాత సచివాలయం తో నాకున్న చేదు జ్ఞాపకాలు కండ్ల ముందు కదలాడుతున్నాయి. చంద్రబాబునా యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన అనేక సంఘటనలు ఫాస్ట్ ఫార్వార్డ్‌లో మనస్సులో తిరుగుతున్నాయి. ప్రధానంగా సమ త, సీ, ముఖ్యమంత్రి బ్లాక్‌లు చరిత్రాత్మకమైన సం ఘటనలకు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో ఈ బ్లాకులన్నీ ఆంధ్రీకరణతో ఉండేవి. వేళ్లమీద లెక్కబెట్టే అధికారులు, స్వీపర్లు, అటెండర్లు మాత్రమే తెలంగాణవాళ్లు ఉండేవారు. జర్నలిస్టుల్లో కూడా ఆంధ్రావారిదే పెత్తనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచి వాలయ తెలంగాణ జర్నలిస్టులు మైనారిటీలుగా ఉండేవాళ్లం. మనం మాట్లా డే భాషతోనే తెలంగాణ వాళ్లమని ఆంధ్రా వాళ్లకు అర్థమయ్యేది. దీంతో ఆం ధ్రా జర్నలిస్టులకే మంత్రులు, అధికారులు వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు. సమాచారం కూడా మొదట వారికే చేరేది. తెలంగాణ సచివాల య జర్నలిస్టులను రెండవశ్రేణి పౌరులుగానే చూసేవారు. వాళ్లు వ్యవహరించే తీరు మనకు పూర్తిగా అర్థమయ్యేది. కానీ ఉద్యోగ భయం ఉన్నందువల్ల తగ్గి ఉండేవాళ్లం. ఒక్కోసారి అధికారులతో వాదనలు, తగాదాలు కూడా జరిగేవి. ఉదాహరణకు ఒక ఘటన చూద్దాం.


చంద్రబాబు కాలంలో విజన్-2020 పుస్తకం విడుదల చేశారు. ఆ పుస్తకం నాకివ్వలేదు. ఎందుకివ్వరు? అని గట్టిగా అడిగితే ఆఫీసుకు ఫోన్‌చేసి నాపై ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కటేం కర్మ, చంద్రబాబు కాలంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఆ సమయంలో తెలంగాణ జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడ్డారు. మాపై ఆం ధ్రా నాయకుల, అధికారులు వ్యవహరించే తీరు, వివక్ష, అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించేవి.
తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుందాం. 2009-14 వరకు సచివాలయంలో నిత్యం ఏదో ఒక ఆందోళన. ఉద్యమాలు, ఉద్యోగుల మధ్య వాదనలు, జర్నలిస్టుల మధ్య చర్చలు పోటాపోటీగా జరిగేవి. ఉద్యోగుల నుంచి మంత్రుల దాకా నిట్టనిలువునా చీలిపోయిన వాతావరణం కనిపించేది. జర్నలిస్టుల మధ్య కొట్లాటలు, తోపులాటలు కూడా జరిగేవి. కొందరం తెలంగాణ జర్నలిస్టులం తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రితో సహా మంత్రులను, అధికారులను మీడియా కాన్ఫరెన్స్‌లో ప్రశ్నించేవాళ్లం. మేం వేసే ప్రశ్నలకు మంత్రులు, అధికారు లు సమాధానాలను దాటవేసేవారు. తోటి ఆంధ్రా జర్నలిస్టులే తెలంగాణ జర్నలిస్టులకు సమాధానం ఇవ్వవద్దని మంత్రులకు చెప్పేవారు. ప్రశ్నలు అడుగుతుంటే మీరు అడుగవద్దని కొందరు ఆంధ్రా జర్నలిస్టులు వారించే వారు. ఈ సందర్భంలో సీ బ్లాక్ సాక్షిగా జర్నలిస్టుల మధ్య తోపులాట జరిగింది. ఒకట్రెండు సార్లు భౌతికదాడులు కూడా జరిగాయి.

సచివాలయంలో ముఖ్యమంత్రి రోజువారీ కార్యక్రమాల జాబితా రిపోర్టర్లకు జిరాక్స్ కాపీ ఇచ్చేవారు. ఆంధ్రా తత్వంతో నిండిన మీడియా కార్యదర్శి కార్యాలయ సిబ్బంది, తెలంగాణవాదం గట్టిగా వినిపించేవారికి ఆ జిరాక్స్ కాపీని ఇవ్వకపోయేవారు. ఈ వివక్షను సచివాలయంలో అటెండర్లుగా పనిచేసే తెలంగాణ బిడ్డలు మాతో చెప్పేవారు. ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే తెలంగాణ అటెండర్లు, సిబ్బందిపై కూడా ప్రాంతీయ వివక్ష చూపుతున్నారని మాకెన్నో ఫిర్యాదులు అందేవి. ఒకసారి ముఖ్యమైన ఆర్డినెన్స్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సర్క్యులేట్ అయింది. అయితే ఆ కాపీ మంత్రులకు చేరలేదు. తెలంగాణ ఉద్యోగి ఇదేదో సర్క్యులేట్ చేస్తున్నామని చెప్పి నాకొక్క కాపీ ఇచ్చి వెళ్ళిపోయాడు. మా ఛానల్‌కు అది పెద్ద బ్రేకింగ్ న్యూస్. దీంతో ఆంధ్రా జర్నలిస్టులు కంగుతిన్నారు. ఆ ఆర్డినెన్స్ మంత్రులకు చేరకుండా మా ఛానల్‌కు ఎలా వెళ్లిందని మీడియా కార్యదర్శిపై ప్రశ్నల పరంపర.

ఆయన మా ఛానల్ హెడ్‌కు ఫోన్‌చేసి కూడా అడిగారు. ఇలాంటి వివక్షల మధ్య తెలంగాణ సచివాలయ జర్నలిస్టుల ఉద్యమం కొనసాగింది. ఆ సమయంలోనే ఎవరు తెలంగాణ వాది, ఎవరు తెలంగాణ వాది కాదో తేలిపోయింది. సీ బ్లాక్ ముందున్న బారీకేడ్లకు కూడా చరిత్ర ఉన్నది. ఆ బారీకేడ్లు మొదట్లో లేవు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఉవ్వెత్తున ఎగసిపడిందో అప్పుడే ఆ భారీకేడ్లు ఏర్పాటయ్యాయి. అప్పటినుంచి సీ బ్లాక్ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా ఎవ్వరినీ రానిచ్చేవారు కాదు ఉమ్మడి ఆంధ్రా పోలీసు లు. తెలంగాణ ఎమ్మెల్యేలు రోజూ సీ బ్లాక్ ముందు ఆందోళనలు చేసేవా రు. ఈ ఆందోళనలు భరించలే ని అప్పటి ప్రభుత్వం, సమత బ్లాక్‌కు కొన్నిమీటర్ల దూరంలో నే ఆపేయటానికి ఓ రోజు రాత్రి 10 గంటలకు చకచకా డ్రిల్లింగ్ వేసి బారీకేడ్లు పెట్టారు. ఇది మీడియా కంటపడకుండా ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పదో ఈ సంఘటన తెలిపింది. సెక్యూరిటీలో ఉండే తెలంగాణ సిబ్బంది ఒకరు ఈ విషయం ముందే నాకు చెప్పారు. నాతోపాటు ఇంకో ఇద్దరు జర్నలిస్టులం అక్కడే ఉన్నాం. రాత్రి పదిగంటలకు వేసిన ఆ బారీకేడ్ల కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాం. ఆ తర్వాత రోజు బారీకేడ్లపై తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వచ్చి నిరసనలు చేశారు. ఇలా పాత సచివాలయంలో ఎన్నో చేదు జ్ఞాపకాలున్నాయి.

సచివాలయంలో అప్పుడప్పుడు తెలంగాణ ఉద్యోగులు, జర్నలిస్టులం కలి సి భోజనం చేసేవాళ్లం. ఆ సమయంలో జరిగే చర్చల్లో సచివాలయంలో తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ ఆడేరోజులు తప్పకుండా వస్తాయనుకునే వాళ్లం. ఆ కోరిక సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి మఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరింది. 2014, జూన్ 2న సచివాలయంలోకి అడుగుపెట్టిన తెలంగాణ జర్నలిస్టులకు, ఉద్యోగులకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదే ఏడా ది సీ బ్లాక్ ముందు బతుకమ్మ ఆడుతుంటే మా మనస్సు ఉప్పొంగింది. కల సాకారమైందని అలైబలై చేసుకున్నం. ఆంధ్రా ఆధిపత్యానికి, వివక్షకు, అహంకారానికి నిదర్శనంగా మారి న పాత సచివాలయం ప్రాంతంలో కొత్త సచివాలయ భవన నిర్మాణం జరుగుతున్నదంటే నా మనస్సు పులకరించిం ది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేననిపించింది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)

437
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles