ఆహారభద్రతకు భరోసా కావాలె


Fri,September 20, 2019 12:46 AM

ఈ మధ్య దేశ ప్రధాన సమస్యలన్నీ పక్కకుపోయి జమ్ము కశ్మీర్ విషయాలే ప్రధానమైపోయాయి. మీడియా అంతా కశ్మీర్‌తోనే నిండి ఉంటున్నది. ఈ క్రమంలో దేశ సమస్యలన్నీ విస్మరించబడుతున్నాయి. దేశంలో వేగంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో ఒనగూడే పర్యవసానాలు, ఫలితంగా వ్యవసాయరంగంలో ఏర్పడే పరిస్థితుల గురించి కేంద్ర ప్రణాళి కా సంఘం కూడా పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తున్నది. వాతావరణ మార్పుతో వచ్చే ప్రమాదం సుదూర సమస్య కాదు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం 1901-2018 మధ్య దేశ ఉష్ణోగ్ర త 0.6 డిగ్రీలు పెరిగింది. గత పదిహేనేండ్ల కాలంలో చూస్తే 11 ఏండ్లు గరిష్ఠంగా ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. గత పదిహేనేండ్ల కాలంలో చూస్తే 2018 ఆరవ అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా దేశ చరిత్రలో లెక్కించబడింది. ఇదే క్రమంలో క్రమంగా ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగానూ పారిశ్రామిక, వాహన కాలుష్యం కారణంగా రాబోయే రోజులో ్ల3- 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్‌లో కూడా ఇదే రీతిన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో వ్యవసాయరంగం లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనున్నది. అలాగే దేశంలో తక్కువ ఆదాయం గల వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితులున్నాయి. వాతావరణ మార్పు ఫలితంగా ఆహారోత్పత్తులపైనే తీవ్ర ప్రభా వం పడుతుంది. ఒకానొక అధ్యయనం ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా దేశంలో ఆహారపదార్థాల ఉత్పత్తిలో 25 శాతం తగ్గిపోనున్న ది. మరోవైపు క్రమంగా పెరుగుతున్న జనాభా కూడా తోడైతే మరింత తీవ్రంగా ఆహార సమస్య తలెత్తుతుంది. 2019 నాటికి ప్రపంచ జనా భా7.7 బిలియన్లు ఉంటే అది 2030నాటికి 8.5 బిలియన్లకు చేరుకుంటుంది. జనాభా ఇలాగే పెరుగుతూపోతే 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా అధ్యయన సంస్థ పేర్కొన్నది. ఇదే క్రమంలో భారత దేశ జనాభా కూడా 130 కోట్ల నుంచి 2030 నాటికి సుమారు 150 కోట్లకు చేరుకుంటుం ది. 2050 నాటికి అది దాదాపు 160 కోట్ల్లకు చేరుతుంది.


వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన వేడి పెరుగుతుంది. దీంతో అతివృష్టి కూడా ఏర్పడుతుంది. కుండపోత వర్షాలతో వరదలు, మరోచోట అనావృష్టి పరిస్థితులతో కరువు ఏర్పడుతుంది. దీంతో వృక్ష, జంతుజాలంతో పాటు మత్స్య సంపదపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది.


ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారభద్రత, పౌష్టికాహారం విషయంలో ప్రభుత్వాలు కచ్చితమైన ప్రణాళికలతో ముందుకుపోవాలి. ఈ విష యానికి సంబంధించి ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే తగిన కార్యా చరణకు పూనుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన వేడి పెరుగుతుంది. దీంతో అతివృష్టి కూడా ఏర్పడుతుంది. కుండపోత వర్షాలతో వరదలు, మరోచోట అనావృష్టి పరిస్థితులతో కరువు ఏర్పడుతుంది. దీంతో వృక్ష, జంతుజాలంతో పాటు మత్స్య సంపదపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. వాతావరణ మార్పు సమస్య శాస్త్ర, ప్రకృతి సంబంధమైన విషయం మాత్రమే కాదు. కేంద్ర వ్యవసాయ శాఖ అధ్యయనం ప్రకారం 2011 నుంచే వ్యవసాయరంగంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోంచే ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)ను ఏర్పాటు చేసింది. దీని ప్రధాన ఉద్దేశం వ్యవసాయ రంగంలో ఏర్పడుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలతో అవసరమయ్యే పరికరాలను తయారుచేయాలి. పరిస్థితులకు అనుగుణంగా తట్టుకొని పెరిగే వంగడాలను అభివృద్ధి చేయటం. అలాగే మత్స్య సంపద పెరుగుదల కోసమే కాకుండా వృక్ష, జంతుజాల అభివృద్ధి కోసం విధాన రూపకల్పన కూడా చేయాలి. ఈ క్రమంలోంచే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏడు ఐసీఏఆర్ సంస్థలను నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఎన్‌ఐసీఆర్‌ఏ కూడా దేశవ్యాప్తంగా 151 జిల్లాలను వాతావరణం పరం గా తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని గుర్తించింది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు మాత్రం ఏమీ లేవనే చెప్పవచ్చు. రాబోయే కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఏం చేయాలో వ్యవసాయశాఖ తగు విధాన అంచనాలతో ముందుకు పోతున్నది. భవిష్యత్తులో 2050 నాటికి వ్యవసాయ భూమిలో ఏడు శాతం తగ్గుతుందని అంచనా. అలాగే 2080 నాటికి పదిశాతం తగ్గిపోనున్నది. వానకాలం సీజన్‌లో వేసే జొన్న సాగులో 2020నాటికి 18 శాతం తగ్గిపోనున్నది. వర్షపాతం తగ్గిపోతున్నకొద్దీ జొన్నతో పాటు ఆహా రపంటలన్నీ తగ్గిపోయి తీవ్రకొరత ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతాయి. ఉష్ణోగ్రత పెరుగుదలతో ఆహారపదార్థాల ఉత్పత్తిలో తగ్గుదల ఒకవైపు ఉంటే, మరోవైపు పశుగణంలో విపరీత పరిణామాలు సంభవిస్తాయి.

రెండోసారి గణనీయ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగంలో తగు విధమైన విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి ప్రయత్నాలు చేయటం లేదు. ఆర్థిక రంగంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలోనైనా తగువిధమైన విధాన నిర్ణయాలతో ముందుకుపోవాలి. తత్ఫలితంగా దేశాన్ని వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధంగా తయారుచేయాలి. అంతిమంగా దేశంలో ఆహార కొరత లేకుండా చేయాలి. ప్రజలందరికీ ఆహారభద్రతపై భరోసా కలిగించాలి.


పశుగణంలో పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో పశుగణం గణనీయంగా తగ్గిపోవటం మూలంగా వ్యవసాయరంగంతో పాటు, పాడిపరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. మత్స్య సంపద పెరుగుదలపై కూడా ఉష్ణోగ్రతల పెరుగుదల తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తుంది. చేపల ఉత్పత్తి తీవ్రంగా పడిపోతుంది. ఉష్ణోగ్రత పెరుగుదల సముద్రాలపై కూడా తీవ్ర ప్రభావం కలు గజేస్తుంది. సముద్రం లో ఆమ్ల గుణం పెరిగి సమస్త సముద్ర జీవుల మనుగడకు ప్రతికూలంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లోనే ఎన్‌ఐసీఆర్‌ఏ ఉష్ణోగ్రతలు పెరిగిన స్థితిలో కూడా తట్టుకొని అధికదిగుబడిని ఇచ్చే వరి, ఆలు, తదితర ఆహారపంటల వంగడాలను ఉత్పత్తి చేసింది. గంగా, సింధూ మైదానాల్లో పరిస్థితులను తట్టుకొని పెరిగే వంగడాలను కనుగొని ఉత్పత్తి పెరుటానికి దోహదం చేసింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పల్లి, ఆలు, సోయాబీన్ తదితర ఆహార పంటలు పండించటానికి నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చింది. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లో యాపిల్ పండ్ల ఉత్పత్తిని పెంచటానికి తగిన వంగడాలను అందుబాటులోకి తెచ్చింది. ఉత్త రభారతంలో పెరిగిన ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తట్టుకొని దిగుబడి ఇచ్చే పత్తి వంగడాలనూ రైతులకు అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులను తట్టుకొని పంట దిగుబడులు ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయటంలో తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 2010లో సహభాగిధన్ అనే వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. దీంతో అధిక ఉష్ణోగ్రతలు, కరు వు పరిస్థితులను తట్టుకుని అధిగ దిగుబడిని ఇస్తున్నది. ఉత్తర భారతం లో ఏర్పడిన కరువు పరిస్థితుల్లో కూడా ఈ రకం వరి వంగడంతో అధిక దిగుబడులు వచ్చాయి. మిగతా వరి వంగడాలు పంట కోతకు రావటానికి 120-150 రోజులు తీసుకుంటే, ఈ వంగడం 105 రోజు ల్లోనే వస్తుంది. ఐఆర్‌ఆర్‌ఐ సంస్థ మరో అడుగు ముందుకేసి వరద పరిస్థితు ల్లో పది పదిహేను రోజులు నీటిలో మునిగి పోయినా పంట చెడిపోకుం డా, వరి దిగు బడిని ఇచ్చే కొత్త వరి వంగడాన్ని తయారుచేయటం ముదావహం. ఈ విధమైన వరి ఒడిషా, శ్రీలంకలో అధికంగా వినియోగిస్తున్నారు. ఈ విధంగా జన్యుమార్పిడుల ద్వారా పరిస్థితులను తట్టుకొని నిలిచి రైతులకు అధిక దిగుబడినిచ్చే వంగడాలను తయారు చేస్తున్నారు.
siraj-hussain
వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను తయారుచేయటానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోధుమ, వరి, పప్పుధాన్యాలు, పల్లి, సోయాబీన్ లాంటి వంగడాలను ఉత్పత్తి చేయటానికి ప్రయత్నిస్తున్నారు. భారత విధానకర్తలు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా విపత్తులు సంభవించే దాకా వేచి చూడాల్సిన పనిలేదు. పరిస్థితులకు అనుగుణంగా పంటల విధానంలో మార్పులు తీసుకురావాలి. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో పంట ఉత్పత్తిలో తగు మార్పులు తీసుకురావాలి. రెండోసారి గణనీయ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగంలో తగు విధమైన విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి ప్రయత్నాలు చేయటం లేదు. ఆర్థిక రంగంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలోనైనా తగువిధమైన విధాన నిర్ణయాలతో ముందుకుపోవాలి. తత్ఫలితంగా దేశాన్ని వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధంగా తయారు చేయాలి. అంతిమంగా దేశంలో ఆహార కొరత లేకుండా చేయాలి. ప్రజలందరికీ ఆహారభద్రతపై భరోసా కలిగించాలి.

(వ్యాసకర్త: కేంద్ర వ్యవసాయశాఖ విశ్రాంత కార్యదర్శి)
(ది వైర్ సౌజన్యంతో)

310
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles