ఇంట్లో ఈగల రోత...


Sat,September 14, 2019 01:22 AM

మోదీజీ అయిదున్నరేండ్ల కిందట తొలిసారి ప్రధాని అయినప్పుడే ఆర్థికమాంద్యం, అభివృద్ధి రేటు తగ్గుదల, ద్రవ్యోల్బణ విజృంభణ, రూపాయి చిక్కిపోవడం, ఎగుమతుల తగ్గుదల, దిగుమతులు పెరుగడం, వ్యవసాయిక సంక్షోభం, పారిశ్రామిక స్తబ్ధత వంటి అనర్థాలు తీవ్రస్వరూపం ధరించసాగాయి.రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయిన మోదీజీ యువకులకు పకోడీలు అమ్మండి పిలుపునిచ్చారు. తత్ఫలితంగా నేడు దేశంలో నిరుద్యోగం,నిరుపాధి గత 45 ఏండ్ల ఎన్నడూ లేనంతగా తీవ్ర స్వరూపం ధరించాయి. ప్రధాని మోదీజీ విదేశాలకు వెళ్లి అక్కడి అధినేతలకు జమ్ముకశ్మీర్‌లో తమ ప్రభుత్వం ఇటీవల 370, 35 ఏ ఆర్టికల్స్ రద్దుతో తీసుకున్న చర్యలను వివరిస్తున్నారు. ఇది భారతదేశ అంతర్గత సమస్య అని అంటున్నారు. విదేశాల అధినేతలకు ప్రధాని మోదీజీ వివరణలు ఇస్తున్నారు గనుక జమ్ముకశ్మీర్ అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.

Prabhakar-Raoo
మన సామెతలేవీ ఊసుపోక, ఊరకే పుట్టలేదు-అవి అనుభవా ల పుట్టలు, అవి అందించే మహత్తర సందేశాలు మరకతాల గనులు, కామిత ఫలదాయినులైన కల్పవృక్షాల వనులు. ఇంట్లో ఈగల రోత, బయట పల్లకీల మోత అన్నారు. ఇదే ఉర్దూలో చెప్పాలంటే ఊపర్ షేర్వానీ అందర్ పరీషాని. మనవాళ్లు చాలా లోతు గా వెళ్లారు. తమ వారసులకైనా కొంత మేలు జరుగాలన్న ఉద్దేశంతో గతుక మెతుకులు లేవు, మీసాలకు సంపెంగి నూనె అని కూడా అన్నా రు. ఎందుకైనా మంచిదని మన పూర్వీకుల నేటి వారసులు అనేకులు గడ్డంతో కలిసిపోయే మీసాలను పెంచుకుంటున్నారు గాని విడిగా, గడ్డం లేకుండా, మీసాలను పెంచుకోవడం లేదు, ఎందుకైనా మంచిదని. మా ఊరిలో, తిక్కన సోమయాజి, శ్రీనాథ కవి సార్వభౌముడు, భక్తాగ్రేసర కవీశ్వరులు పాల్కుర్కి సోమన, బమ్మెర పోతన ప్రభృతులు నాడు, ఇటీవలికాలంలో కవిజీ కాళోజీ, అగ్నిధార దాశరథి లాంటి ఎందరో మహనీయులు విహరించిన ఓరుగల్లు పట్టణంలో అనగా అసఫ్‌జాహీ పాలన చివరిరోజుల్లో ఏడవ నిజావ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాలేకుమ్ సలామ్, ఖుదాహఫీజ్ చెప్పడానికి ఒకటి, రెండేండ్ల ముందు మట్టెవాడ చార్‌బౌలీ బస్తీలో ఒక పెద్ద పహిల్వాన్ ఉండేవాడు-ఆయన లక్డీకా పహిల్వాన్‌గా పేరొందాడు.

ఆయనంటే వరంగల్లు పట్టణమంతా-అటు కాజీపేట దాక, ఇటు వరంగల్ కోట, శంభుని పేట వరకు గజగజ వణికేవారు. చార్‌బౌలి బస్తీలోకి వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. లక్డీకా పహిల్వాన్ కోట వంటి తన ఇంటినుంచి బయటికి వచ్చేవాడు కాడనేవాళ్లు. లక్డీకా పహిల్వాన్ తన కర్ర పట్టి ఉగ్రరూపంతో గరమ్ గరమ్‌గా రంగంలోకి దిగితే ఎంతటివాడైనా చిత్తుకాక తప్పదని ఆనోటా ఈనోటా ప్రచారం జరిగేది. అవి మౌత్ టు మౌత్ కమ్యూనికేషన్ రోజులు. లక్డీకా పహిల్వాన్ భయంకరుడన్న ప్రచారం-ఇప్పటి మీడియా అప్పుడు లేకున్నా బలంగా జరిగింది. ఇంతటి భయవిహ్వల దుస్థితిలో వరంగల్ పట్టణ ప్రజలు ఆ రోజుల్లో క్షణమొక యుగంగా బతికారు. మట్టెవాడకు, వరంగల్లు కోటకు మధ్య ఉరుసు-కరీమాబాద్ బస్తీలలో కొందరు పహిల్వాన్లు ఉండేవారట. కానీ, వాళ్లెవరూ లక్డీకా పహిల్వాన్‌తో ఢీకొనడాని కి సాహసించలేదు. ఎల్లమ్మ బజారులోని ఒక వ్యాయామశాలలో ఎంతోకాలం తర్ఫీదు శిక్షణ పొందిన ఓ యువకుడు ఓరోజు రామా విలాస్ చౌరస్తాలో నిల్చొని ప్రకటించాడు ఫలానా తేదీన ఫలానా సమయాన చార్‌బౌలీలోని లక్డీకా పహిల్వాన్ ఇంటికి వెళ్లబోతున్నట్లు. ఈ యువ పహిల్వాన్ పని అయిపోయినట్లేనని అందరూ అనుకున్నారు. యువ పహిల్వాన్ ఎందరు ఢీలా పడేసినా వెనుకంజ వేయలేదు. ప్రకటించిన తేదీన ప్రకటిత సమయానికి లక్డీకా పహిల్వాన్ ఇంటి ముందుకెళ్లి అక్కడ కాపలా ఉన్న చేలాలకు, చెంచాలకు చెప్పాడు లోపలున్న పహిల్వాన్‌ను బయటికి పిలువాలని. చేలాలు వెళ్లి చెప్పినా లక్డీకా పహిల్వాన్ బయటికి రాలేదు-భయపడ్డాడు. క్షణాల్లో గుప్పుమన్నది లక్డీకా పహిల్వాన్ బయటికి రాలేద ని, యువకుడితో ఢీకొనడానికి భయపడ్డాడని. అంతే, అంతకాలం ఎగిరిన లక్డీకా పహిల్వాన్ బెలూన్ ఫట్‌మన్నది.

లక్డీకా పహిల్వాన్ కండలు పెంచుకున్నాడు గాని అతనికి గుండెబలం శూన్యం. యువ పహిల్వాన్‌కు కండ, గుండె బలం, మేధోశక్తి మూడూ ఉన్నాయి. ఈ మూడింటితో పాటు నైతిక బలం కూడా ఉండటం విశే షం. ఇటీవల, ఆర్థిక మందగమనం, తిరోగమనం వార్తల నిరుత్సాహ, నిస్తేజ, నిర్వీర్య వాతావరణంలో వందరోజుల పాలన పూర్తయి సంబురాలు జరుపుకున్న బీజేపీ ప్రధాని మోదీజీ ఆర్థికవ్యవస్థ అధోగతి గురించి దేశ ప్రజలు బాధపడి బీపీ పెంచుకోకుండా జాతికి జాజిపూదండగా సరికొత్త నినాదం ఒకటి కానుకగా ఇచ్చారు. ఫిట్ ఇండియా నినాదం ఇది. దేశ ప్రజలు కండలు పెంచుకొని పహిల్వాన్లు కావాలన్నది ఈ సరికొత్త నినాదం తాత్పర్యం. AN APPLE A DAY KEEEPS DOCTOR AWAY అన్నది పాత సూక్తి A SLOGAN A DAY KEEPS THE VOTER HAPPY అన్నది ఇప్పటి సూక్తి. గత అయిదున్నరేండ్ల కాలం లో మొత్తం ఎన్ని సూక్తులు లేక SLOGANలు వచ్చాయో తెలుసుకోవాలంటే మోదీజీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రకటించాలె. లోతు గా పరిశీలిస్తే మోదీజీ సరికొత్త నినాదం నిజానికి కొత్తది కాదని, వందేండ్ల పాతదని వెల్లడవుతుంది. వందేండ్ల కిందట మహాకవి గురజాడ కండ గలవాడేను మనిషోయి అని అన్నారు. మహాకవి గురజాడ తెలుగు భాష-సారస్వత రంగాల్లో ఆధునిక యుగ వైతాళికుడు. ఆయన మహా మేధావి. విజయనగర సంస్థానం వారసత్వం కేసులో తీర్పు ఇస్తూ మద్రాసు హైకోర్టు బ్రిటిష్ న్యాయమూర్తులు గురజాడ మేధోశక్తిని ప్రశంసించారు. కండగలవాడేను మనిషోయ్ అని అన్న గురజాడ అంతకుముందే తిం డి కలిగితే కండ గలదోయ్ అన్నారు. తిండి లేకుండా యోగ చేస్తే కండ పెరుగదు. గురజాడ వాస్తవం చెప్పారు.

మోదీజీ, ఆయన అనుంగు అనుచరులు ఈ వాస్తవాన్ని గుర్తించడంలేదు. ప్రస్తుతం స్వతంత్ర భారతదేశ జనాభా ఈజీగా 130 కోట్ల స్థాయికి వచ్చింది. ఇంతమందికి తిండిపెట్ట డం, ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవన ప్రమాణాలు పెంచడం, ఆదాయ వ్యత్యాసాలు లేకుండా చేయడం, సగటు సంపాదన పెంచడం సాధ్యంకాదని మోదీజీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఐదేండ్ల-కుచాల ఆలస్యంగా గుర్తించారు. 303 బలంతో, కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత నవభారత నిర్మాణం గురించి మాట్లాడుతూ మోదీజీ మొదటి పంద్రాగస్టు సభలో ఎర్రకోట నుంచి దేశ ప్రజలకు అమూల్య సందేశం అందించారు. జనాభా పెరుగుదలను అరికట్టాలన్నారు. (కొందరు బీజేపీ నేతలు హిందూ దంపతులు పది మం దిని కని, హిందువుల జనాభాను పెంచాలంటున్నారు). ఇది మోదీజీ అందించిన సరికొత్త మంత్రోపదేశమని ఇండియన్ మీడియాలో బహు ప్రచా రం జరిగింది. కానీ, ఇదికూడా పాత మంత్రమే. దేశానికి స్వాతం త్య్రం లభించిన తర్వాత నాలుగేండ్లకు, 68 ఏండ్ల కిందట నెహ్రూ ప్రభుత్వం జనాభా పెరుగుదల నిరోధానికి జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. తత్ఫలితంగా గత కొన్నేండ్లలో దాదాపుగా 20 కోట్ల జననాలను నిరోధించడం సాధ్యమైంది.

మోదీజీ అయిదున్న రేండ్ల కిందట తొలిసారి ప్రధాని అయినప్పుడే ఆర్థికమాంద్యం, అభివృద్ధి రేటు తగ్గుదల, ద్రవ్యోల్బణ విజృంభణ, రూపాయి చిక్కిపోవడం, ఎగుమతుల తగ్గుదల, దిగుమతులు పెరుగడం, వ్యవసాయిక సంక్షోభం, పారిశ్రామిక స్తబ్ధత వంటి అనర్థాలు తీవ్రస్వరూపం ధరించసాగాయి. రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయిన మోదీజీ యువకులకు పకోడీలు అమ్మండి పిలుపునిచ్చారు. తత్ఫలితంగా నేడు దేశంలో నిరుద్యోగం, నిరుపాధి గత 45 ఏండ్ల ఎన్నడూ లేనంతగా తీవ్ర స్వరూపం ధరించాయి. ఈ దుస్థితిని తట్టుకోలేక ఆర్‌బీఐ గవర్నర్లు ఇద్దరూ వరుస గా, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్, ప్రధాని ఆర్థిక సలహాదారు తమ పదవులకు రాజీనామా చేసి బయటపడ్డారు. (ఆర్థిక వేత్తలు, నిపుణులు వద్దని హెచ్చరిస్తున్నా వినకుండా, ఆక్స్‌ఫర్డ్ ఆర్థికవేత్తలను హేళనచేస్తూ, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన, పదేండ్లు మచ్చ అన్నది లేకుండా ప్రధాని పదవిని నిర్వహించి న డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను రెయిన్‌కోట్‌తో స్నానం చేసినవాడని చులకన చేసి) 2016 నవంబర్ 8న మోదీజీ ప్రవేశపెట్టిన నోట్లరద్దును మన్మోహన్‌సింగ్ లీగల్ ప్లండరింగ్ (చట్టబద్ధ దోపిడీ) అని విమర్శించారు. నాడు మన్మోహన్ హెచ్చరించినట్లే భారత ఆర్థికవ్యవస్థ ఘోరంగా దెబ్బతిని తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ పరిణామాల దుష్ట ప్రభా వం రాష్ర్టాలన్నింటి మీద ప్రసరిస్తున్నది. జమ్ముకశ్మీరు ప్రత్యేకస్థాయి రద్దు తో శుభ పరిణామాలు సంభవిస్తాయని మోదీజీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ జీ అంటున్నారు.

ప్రధాని మోదీజీ విదేశాలకు వెళ్లి అక్కడి అధినేతలకు జమ్ముకశ్మీర్‌లో తమ ప్రభుత్వం ఇటీవల 370, 35 ఏ ఆర్టికల్స్ రద్దుతో తీసుకున్న చర్యలను వివరిస్తున్నారు. ఇది భారతదేశ అంతర్గత సమస్య అని అంటున్నా రు. విదేశాల అధినేతలకు ప్రధాని మోదీజీ వివరణలు ఇస్తున్నారు గనుక జమ్ముకశ్మీర్ అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. 45 రోజుల నుంచి జమ్ముకశ్మీర్ ప్రజలు కనీస మానవ హక్కులను, ప్రాథమిక పౌరహక్కులను, నిత్యజీవన, దైనందిన సదుపాయాలను, కమ్యూనికేషన్ సౌకర్యాలను, పత్రికల ప్రచురణను సైతం కోల్పోయి, ఇండ్లనుంచి బయటికి రాకుండా సాయుధ, సైనిక బలగాల నిఘాలో బతుకుతున్న దుస్థితి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో విమర్శలకు గురవుతున్నది. జమ్ముకశ్మీర్‌లో సాయుధ బలాల పర్యవేక్షణలో తెరిచిన కొన్ని విద్యా సం స్థలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూఎస్‌ఏ, బ్రిటన్ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు జమ్ముకశ్మీరులో మానవహక్కులకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తపరిచాయి. జమ్ముకశ్మీర్‌లో 45 రోజుల నుంచి ఏం జరుగుతున్నదో, మోదీజీ ప్రభు త్వ చర్యలను (370వ ఆర్టికల్ రద్దుతో) కశ్మీరీలు ఏ విధంగా ప్రతిఘటిస్తున్నారో అమెరికా, బ్రిటన్ మీడియా, విశేషించి అక్కడి ప్రముఖ పత్రికలు వివరిస్తున్నాయి.

కొన్ని లక్షలమంది సైనికుల, సెంట్రల్ రిజర్వ్ పోలీసుల, స్థానిక పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కశ్మీరీలు, వారి నేతలు ఇండ్లనుంచి బయటికి వస్తే తీవ్ర నిరసనలుంటాయని మోదీజీ ప్రభుత్వం భయపడుతున్నదనడంలో సందేహం లేదు. 370వ ఆర్టికల్ రద్దును కశ్మీరీలు సమర్థిస్తున్నారని అజిత్ ధోవల్ (జాతీయ భద్రతా సలహాదారు), జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అంటున్నారు. కశ్మీరీలు సమర్థిస్తే సాయుధ బలగాలు, ఆంక్షలు, నిర్బంధాలు అవసరం లేదు. ఐరాస ఆధ్వర్యంలోని మానవహక్కుల మండలి జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కులకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తపరిచింది, అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్య గమనార్హమైనది We continue to be very concerned by widespread detentions, includi -ng of local political leaders and business leaders and the restrictions on the people of Kashmir.. మంచు కొండల కశ్మీర్‌లో మంటలు ఎగసిపడుతున్నా, దేశమంతటా ఆర్థికవ్యవ స్థ కుప్పకూలుతున్నా ప్రధాని మోదీజీ అగ్రరాజ్యం రష్యాకు రూ.7 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం అతి విచిత్రం!.

411
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles