ఒక అంతర్రాష్ట్ర సంభ్రమం

Thu,July 18, 2019 01:20 AM

ఆనాటి అ సెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసార రూపంలో తెలంగాణలో ఎక్కువమంది చూసి ఉండరు. చాలామం ది ఆ తర్వాత ఛానల్ వార్తల సమయంలో చూడటమో, పత్రికలలో చదువటమో జరిగి ఉంటుంది. వారికి అది కూడా కొంత సంభ్రమం కలిగించే ఉండాలి. కానీ ప్రత్యక్ష ప్రసారాన్ని పూర్తిగా చూసినవారి సంభ్రమానికి అయితే అవధులు లేకపోయి ఉండా లి. ఇది రెండు రాష్ర్టాలలోనూ జరిగి ఉంటుంది. పరిస్థితి 2014-19 మధ్య ఒకవిధంగా ఉండటానికి, తర్వాత ఈ విధంగా మారటానికి కారణాలు ఏమిటో ఎవరైనా ఊహించగలవే. ఆ వివరాలలోకి వెళ్లేముందు ఈ నెల 11న జరిగిందేమిటో క్లుప్తంగా చెప్పుకుందాము. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో జగన్మోహనరెడ్డి పాల్గొనటాన్ని టీడీపీ ఆక్షేపిస్తూ, కాళేశ్వరం వల్ల ఆంధ్ర ప్రాంతం ఎడారిగా మారగలదన్న నాయకుడు, ఆ విషయమై గత అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేసినవాడు, ఇప్పుడు అదే కార్యక్రమంలో పాలుపంచుకోవ టం ఏమిటని ప్రశ్నించింది. అందుకు జగన్ ఇచ్చిన సమాధానంలో నాలుగు అంశాలున్నాయి. 1.కాళేశ్వరం నిర్మాణం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆయన దానిని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు జరిగింది బటన్ నొక్కి నీళ్లను వదలటం మాత్రమే. ఆ పనికి తాను వెళ్లలేకపోయినా చేసుకునేవారు. 2.కృష్ణా, గోదావరులకు ఎగువ న గల రాష్ర్టాలు అన్నీ తాము కోరుకున్న ప్రాజెక్టులను యథేచ్ఛగా నిర్మించుకుంటున్నాయి. ఆ విధంగా మహారాష్ట్ర, కర్ణాటకలను నిర్మాణం విషయంలోగాని, ప్రాజెక్టుల ఎత్తు పెంపుదలపై గాని ఆపలేకపోయాము. తాము నిరసనలు చెప్పగలం, కేంద్రానికి ఫిర్యాదులు చేయగలం, కోర్టులకు ట్రిబ్యునళ్లకూ పోగలం. అదంతా చేశాము కూడా. కానీ ఏదీ ఆగలేదు.

ఈ నెల 11న ఆంధ్ర అసెంబ్లీలో కనిపించిన దృశ్యాలను ఒక సంభ్రమం అనాలి. అక్కడ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆ రాష్ట్ర అసెంబ్లీ మొదటి సమావేశాలు ఆ రోజునే ఆరంభమయ్యాయి. వారి అసెంబ్లీలో గత ఐదేండ్ల కిందట రాష్ట్ర విభజన ప్రభావం కనిపించింది. ఆ పరిస్థితి ఇప్పుడు సంభ్రమకరమైనరీతిలో మారిపోయింది. కేసీఆర్‌ను జగన్మోహనరెడ్డి పదే పదే పొగుడుతుండగా, చంద్రబాబుకు సమాధానాలు కరువయ్యాయి. ఆంధ్ర ప్రజలు జగన్ మాటలకే చప్పట్లు చరిచారు.


మునుముందు కూడా ఆగే పరిస్థితి లేదు. 3. ఇదే పద్ధతిలో మరొక ఎగువ రాష్ట్రమైన తెలంగాణ కూడా తను కోరుకున్నట్లయితే చేయగలదు. వారిని కూడా ఎట్లనూ ఆపలేము. 4.ఈ రకరకాల చర్యల వల్లనైతేనేమి, వాతావరణ మార్పులతో వర్షపాతాలు తగ్గుతుండటం కారణం గా అయితేనేమీ కృష్ణా, గోదావరులలో నీటి ప్రవాహం దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గణనీయంగా తగ్గుతున్నది. ఉదాహరణకు కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం కృష్ణ నీరు శ్రీశైలం దిగువకు 1100-1200 టీఎంసీలు వస్తుండేవి. కానీ గత పదేండ్ల సగటు అందులో సగానికి పడిపోయింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కృష్ణపై ఆల్మట్టి ఎత్తును మరొక అయిదు మీటర్లు (519 నుంచి 524కు) పెంచితే ఇంకా 110 టీఎంసీ ల నీరు ఆగిపోయే ప్రమాదం ఉన్నది. వీటన్నింటిపై చంద్రబాబు ఆ కాలమంతా చేసింది ఏమిటి? అందరికీ తెలిసిన ఇటువంటి నేపథ్య వివరాలను పేర్కొన్న జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష తెలుగుదేశం ముందు, తమ రాష్ట్ర ప్రజల ముందు మరొ క అయిదు అంశాలతో ఒక కొత్త థియరీని ఆవిష్కరించారు. అవి ఈ విధంగా ఉన్నాయి. 1.వర్తమాన కాలంలో, ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులలో, రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కలహాలతో, కేంద్రంతో, ట్రిబ్యునళ్లతో, కోర్టులతో ఏమీ ప్రయోజనం లేదని తేలిపోయింది. మునుముందు కూడా ఉండదు. 2.ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణతో, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మైత్రీపూర్వకంగా ఉండదలచుకున్నాం. 3. నీటి విషయమై ఈ సహాయం చేసేందుకు కేసీఆర్ ఓ ఉదారదృష్టితో స్వయంగా ముందుకువచ్చారు. ఒక ముందడుగు వేశారు. గోదావరి నీటిని స్వయంగా తెలంగాణ భూ భాగంలోనే గల పాయింట్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వనున్నారు. 4.ఈ ప్రతిపాదిత అనుసంధానాల వల్ల రెండు రాష్ర్టాలకూ ప్రయోజనం కలుగుతుంది.

గోదావరిలో నీటిని కలిపే ఉప నదులలో ఆంధ్రప్రదేశ్‌లో ని శబరి వాటా 11 శాతం మాత్రమే కాగా, తెలంగాణలోని ప్రాణహిత, ఇంద్రావతి 65 శాతం నీటిని ఇస్తున్నాయి. జగన్ ఇంత విపులంగా చెప్పిన తర్వాత అందుకు ఏమి సమాధానమివ్వాలో తెలియని చంద్రబాబు అంతా అయిన వెనుక భవిష్యత్తులో తెలంగాణవారు నీరివ్వమంటే ఏమి చేయగలరని ప్రశ్నించారు. అందుకు జగన్ నవ్వారు.


ఆంధ్రప్రదేశ్‌కు ఇం కా ఎక్కువ. 5.గోదావరిలో నీటిని కలిపే ఉప నదులలో ఆంధ్రప్రదేశ్‌లో ని శబరి వాటా 11 శాతం మాత్రమే కాగా, తెలంగాణలోని ప్రాణహిత, ఇంద్రావతి 65 శాతం నీటిని ఇస్తున్నాయి. జగన్ ఇంత విపులంగా చెప్పి న తర్వాత అందుకు ఏమి సమాధానమివ్వాలో తెలియని చంద్రబాబు అంతా అయిన వెనుక భవిష్యత్తులో తెలంగాణవారు నీరివ్వమంటే ఏమి చేయగలరని ప్రశ్నించారు. అందుకు జగన్ నవ్వారు. నవ్వి, నలభై ఏండ్ల అనుభవం ఉందంటున్న నాయకునికి ఇటువంటి ప్రాజెక్టులు పరస్పర ఒప్పంద రూపంలో జరుగుతాయనే చిన్న విషయం కూడా తెలియదా అని అడిగారు. ఆ నాటి చర్చ మొత్తంలో చంద్రబాబు మొహం లో కత్తివేటుకు నెత్తురు చుక్క లేకపోవటం పలుమార్లు జరిగింది. ఇప్పు డు మరొక్కసారి జరిగింది. ఒప్పందాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు, రెం డు రాష్ర్టాల అధికారులూ సంతకాలు చేస్తారని చంద్రబాబుకు ఈ సందర్భంగా తెలియజెప్పారు జగన్. ఇదంతా చంద్రబాబు ఆరోపించినట్లు వైఖరిలో మార్పు అనే అనుకుంటే, అందుకు ఖరగ్‌పూర్ ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి ముక్తాయింపు ఇస్తూ, స్టాండ్స్ ఆర్ డైనమిక్, నాటి స్టాటిక్ (వైఖరులు పరిస్థితిని బట్టి మారుతాయి) అని స్పష్టం చేశారు. చర్చ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి అన్న కొన్ని మాటలను విన్నమీదట ఒక సందేహం బలంగా కలిగింది. కేసీఆర్‌తో సఖ్యగా ఉండితీరుతామని ఆయన పదేపదే అన్నారు. కేసీఆర్‌ది ఔదార్యమని (మేగ్నానిమి టీ అనే ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగిస్తూ) అరడజను సార్లు నొక్కిచెప్పారు. స్నేహంగా ఉంటే తప్పేమిటో చెప్పమని అడిగారు. దీనినంతా రాజకీయ దృష్టితో గాక అభివృద్ధి దృష్టితో చూడాలని చంద్రబాబు మొహంలోకి సూటిగా చూస్తూ హితవు చెప్పారు. ఇవన్నీ గమనించినపుడు, పైన చెప్పుకున్నట్లు గత ఐదేండ్ల పాటు అందరూ కలిసి కేసీఆర్‌ను ఉమ్మడిగా నిం దించిన సభలోనే జరిగినప్పుడు, ఆంధ్ర ప్రాంత ప్రజలు జగన్ పట్ల నిరసన చూపగలరేమోనన్న సందేహం కలిగింది.
Ashok
కానీ అటువంటిదేమీ లేకపోగా, జగన్ వైఖరి పట్ల అంతటా మద్దతు ఉన్నట్లు, చంద్రబాబుకు సమర్థన ఏమీ లేనట్లు విశాఖ పట్నం నుంచి విజయవాడ మీదుగా అనంతపురం వరకు జరిపిన విచారణలు స్పష్టం చేశాయి. కేసీఆర్, జగన్ సత్సంబంధాల పట్ల ఈ వైఖరులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందునుంచి ఉన్నవని తెలిసిందే. అప్పుడు కూడా ఈ కారణాన్ని చూపి జగన్ పట్ల వ్యతిరేకతను పెంచేందుకు చంద్రబాబు విఫలయత్నం చేశారు. కేసీఆర్ తో తన సత్సంబంధాల గురించి జగన్ అప్పుడే బాహాటంగా ప్రకటించా రు. ఈ విధమైన అంతర్రాష్ట్ర సహకార దృష్టి చంద్రబాబుకు గత ఐదేండ్లలో ఉండి ఉంటే రెండు రాష్ర్టాలకు చాలా మేలు జరిగేది. ఇటువంటి నేపథ్యం తనకు ఉండి కూడా గత గురువారం నాడు జగన్మోహనరెడ్డి సాక్షాత్తూ అసెంబ్లీలోనే కేసీఆర్‌ను పదేపదే ప్రశంసించటం నిజంగానే సంభ్రమాన్ని కలిగించింది. అయితే దీనంతటికి మూలం పరస్పర సహకారం ద్వారా అభివృద్ధి సాధన అనే దానిలో ఉందని మనం గ్రహించాలి. కలిసి నడుద్దాం అని వారిరువురు జూన్ 28న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చేసిన ప్రకటనలో, ప్రగతిభవన్ గడపను ఉభయులూ ఒకేమారు కుడికాలును ముందుకువేసి దాటటంతో, తమ కు ఇక కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యాలు తప్ప భేషజాలు లేవని ప్రకటించటంలో, ఆనాటి సమావేశంలో రెండు రాష్ర్టాల అధికారులకు ఇచ్చిన ఆదేశాలలో, అప్పటినుంచి అధికారుల స్థాయి చర్చలు నిర్విరామంగా సాగుతున్న తీరులో ఉన్నది. నాయకత్వ దార్శనికతలు కన్పించేది ఈ విధంగానే. అది చంద్రబాబుకు లేకపోయింది. ఈ నేపథ్యాలు అన్నింటిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆ తీరున సాగటం, అందుకు అక్కడి ప్రజల మద్దతు ఫెడరలిజానికి కొత్త భాష్యాలను చెప్పిం ది. ఫెడరలిజం ఒక రాజకీయ పరిభాష అనే అపోహలు కొందరికి ఉన్నా యి. కానీ రకరకాల ఫెడరలిజం మాటలన్నీ అంతిమంగా అభివృద్ధి సాధనలు, వాటి ఫలితాలు ప్రజలకు చేరటానికి సంబంధించినవే. కేసీఆర్, జగన్‌లది అటువంటి ఫెడరల్ సఖ్యతే.

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles