మేలుచేసే నాయకుడెవరు?

Tue,July 16, 2019 10:47 PM

2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు అనేక ఆర్థిక విధానాలను ప్రతిపాదిస్తున్నారు. ఈ విధానాలను సాధారణంగా స్వేచ్ఛా మార్కెట్‌కు లేదా సోషలిస్టు విధానాలుగా వర్గీకరించవ చ్చు. అయితే ఈ రెండురకాల మాటలు అమెరికన్లకు అయోమయం కలిగిస్తాయి. ప్రత్యేకించి పెట్టుబడిదారీ విధానం అంటే స్వేచ్ఛామార్కెట్ విధానంగా భావిస్తారు. కానీ పెట్టుబడిదారీ విధానం అంటే ఆస్తిపై ప్రైవేట్ యాజమాన్యం, స్వేచ్ఛా మార్కెట్ మొదలుకొని సోషల్ డెమొక్రసీ వరకు అన్నిరకాల నమూనాలుంటాయి. ఈ భిన్నవిధాల పెట్టుబడిదారీ వ్యవస్థలలో మార్కెట్ కార్యకలాపాలకు, ఆస్తి పరిరక్షణకు, చట్టబద్ధ పాలనకు కనీస నిబంధనలుంటాయి. పలు క్యాపిటలిస్టు సమాజాలలో బలహీనవర్గాలను పరిరక్షించడానికి సామాజిక పథకాలుంటాయి. క్యాపిటలిస్టు ఆర్థిక వ్యవస్థల్లోని ప్రభుత్వాలకు రెండు ప్రాథమిక పంథాలుంటాయి. ఒకటి- సమిష్టి ప్రయోజనం కోసం మార్కెట్ నిబంధనలను ఏర్పరుచ వచ్చు లేదా స్వేచ్ఛా మార్కెట్ ముసుగులో బడా పరిశ్రమలకు బాధ్యతలను అప్పగించవచ్చు. రెండవ పంథా- అసమానతలను తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి సార్వత్రిక సామాజిక పథకాలను అమ లుపరుచవచ్చు లేదా ప్రభుత్వ వ్యయాన్ని కనీసస్థాయికి తగ్గించడానికి ఆయా పథకాలను ఉపసంహరించుకోవచ్చు. ప్రభుత్వం ఏ మార్గం అనుసరిస్తుందనే దాన్నిబట్టి దేశంలో అసమానతలు, గ్రీన్‌హౌజ్ వాయువుల విడుదల, సమాజ సంక్షేమం ఆధారపడి ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యరుల ఆర్థిక విధానాలు ఎటువంటివి అనేది సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, వారి ప్రతిపాదనలు ఎట్లా ఉన్నవనేది విశ్లేషించుకోవాలె.

అమెరికాలో మెరుగైన పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన వనరులున్నాయి. నేటి ప్రజల సంక్షే మం కోసం ఏయే విధానాలు అవలంబించాలె, భవిష్యత్తరాల కోసం ఎటువంటి న్యాయబద్ధమైన సుస్థిరమైన ఆర్థికవ్యవస్థను రూపొందించుకోవాలె అనే స్పష్టత ఉన్నది. అయితే ఈ విధానాలను
అనుసరించేవారినే దేశాధ్యక్షుడిగా, చట్టసభ సభ్యులుగా ప్రజలు ఎన్నుకోవలసి ఉన్నది.


సమాజ సంక్షేమానికి సంబంధించిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషలిజం అంటూ తేలికగా కొట్టిపారేస్తుంటారు. స్వేచ్ఛా మార్కెట్‌ను ప్రశంసిస్తారు. మార్కెట్ ఎకానమీ పనిచేయడానికి ఏ నిబంధనలూ అవసరం లేదని అభిప్రాయపడుతారు. ట్రంప్ అభిప్రా యం ప్రకారం- ప్రభుత్వం ఎటువంటి నిబంధనలనూ ఏర్పాటుచేయకూడదు. బహుళజాతి కార్పొరేషన్లు తమకు అనుగుణమైన రీతిలో మార్కెట్ నియమాలను నిర్ణయించుకుంటాయి. భారీ టెక్ కంపెనీలు, ఇతర రంగాలలోని గుత్తాధిపత్యం గల సంస్థలు పోటీ లేని పరిస్థితులను కోరుకుంటాయి. మార్కెట్ నియమాలు లేకపోతే పోటీ కూడా ఉండదు. ఏ కొద్ది కంపెనీలో ముఠాగా ఏర్పడి తమకు అనుగుణమైన విధానాలను నెలకొల్పుతాయి. కొత్తవాటిని ఎదుగనివ్వవు. ట్రంప్ విధానాలు మొత్తం విధాన నిర్ణయాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేవిగా ఉన్నాయి. ఇంధన రంగాన్నే తీసుకుందాం. బొగ్గు, చమురు, గ్యాస్ కంపెనీలే పర్యావరణ విధానాలను నిర్ణయిస్తాయి. వాతావరణాన్ని ఎంత కాలుష్యభరి తం చేయాలనేది నిర్ణయించేది ఈ బడా కంపెనీలే. అమెరికా సమాజం ఇప్పటికే శిలాజ ఇంధనాలకు అలవాటుపడ్డది. అయితే ఎంత వేగంగా పునరుపయోగ ఇంధనాలను వాడుకలోకి తేవాలనేది నిర్ణయించేది ప్రభుత్వం కాదు. ఇంధన కంపెనీలే నిర్ణయించుకుంటాయి. ఇక ఆరోగ్య రంగాన్ని పరిశీలిద్దాం. ట్రంప్ విధానాల ప్రకారం మందుల ధరలు ఎంత ఉండాలనేది నిర్ణయించవలసింది ఔషధ కంపెనీలే. బీమా కంపెనీలు పాతికశాతం లాభాలు జుర్రుకుంటున్నాయి. అమెరికా రక్షణ విధానాల ను ప్రభుత్వం నిర్ణయించాలని ట్రంప్ కోరుకోరు. ఆయన అభిమతం ప్రకారం- ఆయుధ కంపెనీలు నిర్ణయిస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు షేర్ల మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ఈ రంగానికి చెందిన బడా కంపెనీల చేతుల్లో ఉంటాయి. ఈ విధంగా కీలక రంగాలన్నిటిలో బడా కంపెనీలు తిష్టవేశాయి. ఈ బహుళజాతి కంపెనీలే ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇష్టారీతిన ధరలను పెంచుకుంటాయి. కొత్తగా ఎదుగుతున్న కంపెనీలను అణిచివేసి తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకుంటాయి.

అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థులు తమ ఆర్థిక విధానాలను వెల్లడించినట్టయితే, తమ జీవనప్రమాణాలు మారడానికి ఇవి ఎంతమేర ప్రత్యామ్నాయాలను చూపగలవో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆరోగ్య రక్ష ణ, ఉన్నత విద్య, శిశు సంక్షేమంతో పాటు కుటుంబం, మిత్రులు, సమాజంతో సమతుల్య జీవనం గడపడానికి కావలసిన భద్రమైన ఉద్యోగం, గౌరవప్రదమైన వేతనం తమకు లభిస్తుందా అనేది ప్రజలు ఆయా అభ్యర్థుల ఆర్థిక విధానాలను బేరీజు వేసుకొని తెలుసుకోగలుగాలె.


అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో తమకు కావలసినవారిని చట్టసభ సభ్యులుగా గెలిపించుకుంటాయి. ఈ చట్టసభ సభ్యులతో లాబీయింగ్ చేస్తూ ప్రభుత్వ విధానాలను శాసిస్తా యి. తమ రంగాల్లో తమ పెత్తనం, తమ లాభాలుండేలా చూసుకుంటా యి. ఈ కార్పొరేట్ సంస్థలు ప్రజాస్వామ్య ఉద్యమాలను దెబ్బతీస్తాయి. గతంలో పలువురు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థులు ఈ కార్పొరేట్ సం స్థల వల్ల కలుగుతున్న ముప్పును హెచ్చరించారు. బడా పారిశ్రామిక సం స్థల మూలంగానే అవినీతి పెరిగిందనీ, అసమానతలు పెరుగుతున్నాయ నీ, వాతావరణ సంక్షోభం ఏర్పడినదనీ, అమెరికా ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదం ఏర్పడిందని ఎలిజబెత్ వారెన్ వాపోయారు. కొన్ని విషయాల్లో వారెన్‌కు, సాండర్స్‌కు విభేదాలున్నాయి. ఇరువురు ప్రజాప్రభుత్వానికి అధికారాలు ఉండాలని కోరుకుంటారు. మార్కెట్ స్వరూప స్వభావాలను ప్రభుత్వం నిర్ణయించడం ద్వారానే సమాజ సంక్షేమం నెలకొంటుందని అంగీకరిస్తారు. బడా వ్యాపారులు, సంపన్నులపై అధిక పన్నులు విధించాలని, పర్యావరణ చట్టాలను కఠినంగా అమలుచేయాలని అంటారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య రక్షణ, శిశు సంరక్షణ, ఉన్నత విద్య, గృహవసతి, గౌరవ ప్రదమైన ఉద్యోగం, సామాజిక భద్రత ఉండాలని ఇరువురు అభ్యర్థులు కోరుతున్నారు. వీరిరువురే కాకుండా, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న ఆశావహులు అందరూ ఈ విధానాల పట్ల సానుకూలంగానే ఉన్నారు. అయితే కొందరు అభ్యర్థులు మాత్రం మధ్యేవాద విధానాలను అనురిస్తున్నామంటూ, రైటిస్టు స్వభావాన్ని కనబరుస్తున్నారు. ఇందుకు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ మాట లు అద్దం పడుతున్నాయి. ఆయన ఇటీవల తమకు విరాళాలు ఇచ్చే దాత ల సమావేశంలో మాట్లాడుతూ తాను గెలిస్తే ఇప్పుడున్న విధానాల్లో ఎటువంటి మౌలిక మార్పు ఉండదని హామీ ఇచ్చారు.

అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థలో భారీ ప్రక్షాళన అవసరం. వాతావరణ సంక్షోభాన్ని, తీవ్రస్థాయిలో ఉన్న అసమానతలను రూపుమాపాలంటే ప్రక్షాళన తప్పదు. విస్తృతస్థాయలో సంక్షేమ పథకాలను, స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చునని యూరప్ దేశాలు నిరూపించాయి. ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానం సం పదను హరించడానికి తగ్గిస్తుందని, సుస్థిర న్యాయబద్ధమైన ఆర్థికవ్యవస్థను నెలకొల్పుతుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ ఈ స్టిగ్లజ్ అభిప్రాయం. అభివృద్ధి విధానాల పేరుతో సమాజం, ప్రకృతి విధ్వంసం జరుగకూడదు. మన అభివృద్ధి విధానాలు ప్రకృతిని కాపాడేవిగా ఉండాలె. ప్రజలు సుఖంగా ఉండేవిధంగా రూపొందించాలె. అయితే సుస్థిర ప్రపంచం- అర్థవంతమైన జీవితం కలిగి ఉండాలంటే ఏయే విధానాలు సరైనవో తెలుసుకోవడానికి ఒక సూచిక ఉండాలె. బర్క్‌లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని మా పరిశోధక బృందం ఒక సూచికను తయా రుచేసింది. ఈ సస్టయినెబుల్ షేర్డ్- ప్రాస్పరిటీ పాలసీ ఇండెక్స్ (ఎస్‌ఎస్‌పీఐ) ద్వారా సుస్థిర ప్రపంచంలో అర్థవంతమైన జీవితాన్ని కల్పించే విధానాలను కొలువవచ్చు. ఈ సూచిక ఆధారంగా యాభై దేశాల ర్యాం కులను నిర్ణయించాం. ఇందుకు మూడు ప్రధాన ప్రాతిపదికలను అనుసరించాం. ఒకటి-నిబంధనలు, పన్నులతో కూడిన మార్కెట్ నిర్మాణా న్ని ప్రభుత్వ విధానాలే నిర్ణయించాలె. రెండు-పర్యావరణ పరిరక్షణ చర్యలు ఉండాలె. మూడు-ఆరోగ్యకరమైన, విద్యావంతులైన ప్రజలు, మౌలికవసతులు, మానవ హక్కు లు, చక్కని సామాజిక జీవనం మొదలైన వాటికి దోహదపరిచే ప్రభుత్వ పథకాలు ఉండాలె. అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థులు తమ ఆర్థిక విధానాలను వెల్లడించినట్టయితే, తమ జీవనప్రమాణాలు మారడానికి ఇవి ఎంతమేర ప్రత్యామ్నాయాలను చూపగలవో ప్రజలు నిర్ణయించుకుంటారు.
clair-brown
ఆరోగ్య రక్షణ, ఉన్నత విద్య, శిశు సంక్షేమంతో పాటు కుటుంబం, మిత్రులు, సమాజంతో సమతుల్య జీవనం గడుపడానికి కావలసిన భద్రమైన ఉద్యోగం, గౌరవప్రదమైన వేతనం తమకు లభిస్తుందా అనేది ప్రజలు ఆయా అభ్యర్థుల ఆర్థికవిధానాలను బేరీజు వేసుకొని తెలుసుకోగలగాలె. అమెరికా వంటి ధనిక దేశంలో ఇవేమీ పెద్ద కోరికలు కావు. ఇంతకన్నా మెరుగైన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను సృష్టించుకోగల ఆర్థిక వనరులు అమెరికాకు ఉన్నాయి. మన సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల కోసం ఏ విధానాలు మంచివో మనకు తెలుసు. ఈ కొత్త వ్యవస్థను నిర్మించే అధ్యక్షుడి ని చట్టసభ సభ్యులను దేశం ఎన్నుకోవలసి ఉన్నది.
-(వ్యాసకర్త: ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్. బర్క్‌లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ వర్క్, టెక్నాలజీ, సొసైటీ కేంద్రం డైరెక్టర్. బుద్ధిస్ట్ ఎకనమిక్స్, ఏన్ ఎనలైటెండ్ అప్రోచ్ టు ది డిస్మల్ సైన్స్ రచయిత)

-(వ్యాసకర్త: కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని సస్టయినెబుల్ షేర్డ్- ప్రాస్పరిటీ పాలసీ ఇండెక్స్ పరిశోధక సమన్వయకర్త)

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles