ప్రజాపండుగకు పాలకుల పట్టం

Tue,July 16, 2019 01:01 AM

తెలంగాణలో జరిపే బతుకమ్మ, బోనాలు, పీర్ల పండుగ లు, తీజ్ ఉత్సవం తెలంగాణ జీవన విధానానికి ప్రతీకలు. మరే ప్రాంతంలోనూ ఇలాంటి పండుగలు లేవు. నిరుపమానమైన, ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సం స్కృతి రాజకీయ కారణాల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో మరుగున పడిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం మన సంస్కృతి పట్ల మనలో స్ఫూర్తిని రగిలించిన మహావ్యక్తి సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజలను రాజకీయంగా, సాంస్కృతికంగా జాగృతం చేసి, గాం ధీ పంథాలో అహింసా పద్ధతిలో సుదీర్ఘకాలం పాటు ఒక మహోద్యమాన్ని నడిపారు. మన గత వైభవాన్ని గుర్తుకుచేసి, రాష్ర్టాన్ని సాధించిన పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి మన సంస్కృతికి పునర్వికాసం, పునరుజ్జీవనం కలిగాయి. ఈ విషయంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోషించిన పాత్ర అద్వితీయం. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి, బతుకమ్మ పండుగను వాడవాడలా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలైన బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తు న్నది. ఈ ప్రోత్సాహం తెలంగాణ సంస్కృతి, కళల వికాసానికి ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణ సంస్కృతిలో బోనాలు, బతుకమ్మ పండుగలు అతి ముఖ్యమైన సామాజిక ఉత్సవాలు. బోనాలు ఆషాఢమాసంలో తొలకరి ప్రారంభమైన తర్వాత పంటలు వేస్తూ చేసుకునే పండుగ. బతుకమ్మ ఆశ్వయుజ మాసంలో పొలాలు పైరుపచ్చలతో కళకళలాడుతుండగా చేసుకునే పం డుగ. రెండు ప్రకృతికి సంబంధించిన పండుగలే. బోనాల పండుగ అమ్మవారి పండుగ. అమ్మవారికి పెట్టే నైవేద్యమే బోనం.

హైదరాబాద్ చారిత్రక నేపథ్యానికి నిలువెత్తు నిదర్శనమైన గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి రూపంలో వెలసిన ఆదిపరాశక్తికి తొలి బోనం, తొట్టెలను సమర్పించడంతో ఈ బోనాల జాతర మహాఘట్టం ప్రారంభమవుతుంది. ఆషాఢమాసం చివరిరోజున మళ్ళీ ఇక్కడి అమ్మవారికి చివరి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బోనాల జాతర ముగుస్తుంది.


బోనం అంటే భోజనం. కొత్త కుండలో బియ్యం, బెల్లం కలిపి వండుతారు. ఒక కొత్త కుండకు సున్నం పూసి, జాజు, పసుపు, కుంకుమలతో బొట్లుపెట్టి అందంగా అలంకరిస్తారు. ఆ కుండలో ఈ బెల్లం అన్నం నైవేద్యాన్ని వంచి, కుండపై చుట్టూ వేపాకులు పేర్చి, దానిపై చిన్న గిన్నెలో పానకం పోసి, ఆ పానకం గిన్నెపై ఒక ప్రమిదను అమర్చి మహిళలు బోనాన్ని ఎత్తుకొని, అమ్మవారి ఆలయానికి బయల్దేరుతారు. కొందరు అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దీన్ని చద్ది అని పిలుస్తారు. పసుపు నీటిని వేపాకులతో చల్లుకుంటూ బోనం ఎత్తుకున్న వారిని అనుసరించి ఇంటిల్లిపాదీ డప్పులు, కొమ్ములు, డోళ్ళు వాయించుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. బోనాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులు ఇంటికి తెచ్చుకొని, కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి పంచిపెడుతారు. కొందరు భక్తులు బోనంతో పాటుగా కోడిపుంజులను, మేకపోతులను, పొట్టేళ్ళను కూడా అమ్మవారికి బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగలకు ఆడపిల్లలను పుట్టిళ్ళకు పిలుచుకోవడం కూడా తెలంగాణలో ఆనవాయితీ. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగకు చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇది తెలంగాణ ప్రజల జీవనవిధానంలో ఒక భాగం. ఆషాఢమాసంలో ముప్ఫై రోజులు మూడు ప్రధాన ప్రాంతాల్లో వేర్వేరుగా జాతరలు నిర్వహిస్తారు. ఇది వనదేవతల ఆరాధన. పురాతనమైన తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఆషాఢమాసం ప్రారంభమయ్యే మొద టిరోజే బోనాల జాతర ప్రారంభమవుతుంది. ఏడాది మొత్తం పొలాలు పచ్చదనంతో కళకళలాడాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజ లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంత జీవనం గడుపాలని కోరుకుంటారు.

హైదరాబాద్ చారిత్రక నేపథ్యానికి నిలువెత్తు నిదర్శనమైన గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి రూపంలో వెలసిన ఆదిపరాశక్తికి తొలి బోనం, తొట్టెలను సమర్పించడంతో ఈ బోనాల జాతర మహాఘట్టం ప్రారంభమవుతుంది. ఆషాఢమాసం చివరిరోజున మళ్ళీ ఇక్కడి అమ్మవారికి చివరి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బోనాల జాతర ముగుస్తుంది. గోల్కొండ కోటలో తొలి బోనాల జాతర ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి జాతర జరుగుతుంది. వందల సంవత్సరాల ఘన చరిత్ర గల హైదరాబాద్ నగరం పాతబస్తీ లో నెలకొని ఉన్న మహిమాన్విత దేవాలయం లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి దేవాల యం. ఈ దేవాలయానికి 4 వందల ఏండ్ల మహత్తర చరిత్ర ఉన్నది. ఇక్కడ వెలసిన మహంకాళి అమ్మవారు భక్తులకు కొంగుబంగారంగా నెలకొని ఉండి, కోరికలను తీర్చుతుందనేది భక్తుల విశ్వాసం. 2014 జూన్ 2న తెలంగాణ ప్రజల కలల పంటగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజలు తరతరాలుగా ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటున్న బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ బలంగా నినదించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుం డా ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి స్వయంగా బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రజల ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా మొక్కు చెల్లించుకున్నారు. 1908వ సంవత్సరంలో నిజాం నవా బు మూసీ నది వరదల సందర్భంగా బోనం ఎత్తిన తర్వాత మళ్లీ 106 సంవత్సరాలకు మరొక తెలంగాణ పాలకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి బోనం ఎత్తారు. అమ్మవారి పట్ల తనకున్న భక్తి ప్రపత్తులను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు గల అపారమైన గౌరవాదరాలను కేసీఆర్ ప్రకటించారు.
Kolleti-Damodhar
అంతేగాక తెలంగాణ సంస్కృతి, సం ప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో దేశ రాజధాని ఢిల్లీ లో కూడా 2015 నుంచి ఏటా బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. బోనాలు జరిగే ప్రతి ఆలయానికి ప్రభుత్వమే నిధులు కేటాయించి, వసతి సౌకర్యాలు, అలంకరణ వంటి ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించే విధానాన్ని తెలంగాణ భాషా సంస్కృతులను ప్రేమించే ప్రజలంతా సంతోషంగా స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నా రు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్)

269
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles