శబ్దకాలుష్యానికి చెక్ పెట్టాలె

Sat,July 13, 2019 12:33 AM

నగరాల్లో వాయు కాలుష్యానికి తోడు శబ్ద కాలుష్యం పెద్ద సమస్యగా పరిణమిస్తున్న ది. ఈ మధ్యకాలంలో యువత పెద్ద పెద్ద ద్విచక్ర వాహనాలను, బుల్లెట్, ఎన్‌ఫీల్డ్ లాంటి వాహనాలను వినియోగిస్తూ వాటి కి పెద్ద శబ్దం వచ్చేట్లు సైలెన్సర్లను పెట్టుకుంటున్నారు. నిజానికి అవి కూడా ఎలాంటి శబ్దం లేకుండా నడిచే పరిస్థితి ఉంటుంది. కానీ కొంతమంది యువత డాబు కోసం, ప్రత్యేకత కోసం పెద్ద శబ్దం వచ్చే తీరుగా వాటిని మార్చుకొని రోడ్లపై విపరీతమైన వేగంతో పోతూ శబ్ద కాలు ష్యానికి కారణమ వుతున్నారు. అలాంటి వాహనాలను ట్రాఫిక్, రవాణా శాఖాధి కారులు సీజ్ చేసి శబ్దం రాకుండా చేయా లి. అప్పుడే శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టినవారమవుతాం.
- నర్మాల కృష్ణతేజ, లక్ష్మీనగర్, కరీంనగర్,

కాళేశ్వరంతో కండ్లు తెరువాలె

కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఏండ్లకు ఏండ్లు రాష్ర్టాన్ని పాలించినా గోదావరి జలాలను వినియోగంచుకోవటానికి ప్రయత్నించలేదు. కానీ రాష్ట్ర అవ తరణ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జలాలను తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చటానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూప కల్పన చేసి మూడేండ్లలోనే పూర్తిచేసి సాగునీటి అవసరాలను తీరుస్తున్నా రు. ఇలాంటి ప్రయత్నాన్ని హర్షించటానికి బదులు కోర్టు కేసులతో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవటం ద్రోహపూరితమైన చర్యలే.
- వీర పూర్ణచందర్‌రావు,మూసాపేట, హైదరాబాద్

కనీస వసతులు కల్పించాలె

ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందునుంచే ప్రభుత్వం, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుబాటు లో ఉంటుందని విస్తృత ప్రచారం చేశారు. దీంతో పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరారు. కొన్ని స్కూళ్లలో ప్రవేశాలు లేవని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి రావటం ముదావహం. కాబ ట్టి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వసతుల కల్పనపై శ్రద్ధపెట్టాలి.
- బత్తిని లక్ష్మయ్య, మిర్యాలగూడ

172
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles