ఆదర్శం

Fri,June 14, 2019 01:12 AM

వికారాబాద్ జిల్లా కలెక్టర్ మస్రత్ ఖనమ్ ఆయేషా తన కుమార్తె దబిష్ రాణియాను జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట మైనార్టీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీంతో ఆమెను కీర్తిస్తూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలి. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగు తుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్ల లను చేర్పించాలని, అక్కడే నాణ్యమైన విద్య దొరుకుతుందని తల్లిదండ్రులకు చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూళ్లకు పంపించడం శోచనీయం.
- అన్నాజి రాజేందర్, కరీంనగర్

నివారణపై దృష్టిసారించాలి

సాధారణంగా వానకాలంలో డెంగీ, మలేరియాలాంటి విష జ్వరాలు విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధులు అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రబలే అవకాశాలుంటాయి. కాబట్టి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. విష జ్వరాల నివారణపై ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభిస్తే డెంగీ, మలేరియా ద్వారా వచ్చే మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టే అవ కాశాలుంటాయి. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
- ముదాం శ్రీధర్, హైదరాబాద్

హర్షణీయం

పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేయడం అభినందనీయం. ఈ ఆలోచనతో గ్రామాలు, పట్టణాలు గుణాత్మకంగా అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నింటా ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. వినూత్న నిర్ణ యాలు తీసుకుంటున్న కేసీఆర్ దేశానికే ఆదర్శం.
- అమిరిశెట్టి రాజేందర్, హన్మకొండ

193
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles