తీరు మార్చుకోవాలె

Thu,June 13, 2019 12:58 AM

మొన్న జరిగిన ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామ ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కన్నారు. కానీ ప్రజలు ఊహించని రీతిలో తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం లో, కేంద్రంలో చిత్తుగా ఓడించారు. ఈ తీర్పు కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు. ఏం చేయాలో పాలుపోక అటు ప్రధాని మోదీని, ఇటు సీఎం కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల తీరును ప్రజలు గమ నిస్తూనే ఉన్నారు. వారిలో మార్పు రాకుం టే ప్రజలే బుద్ధి చెబుతారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో 369 మందిని చంపినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వా మ్యం ఎందుకు గుర్తుకురాలేదని వారు ప్రశ్నిస్తున్నారు.
- బైరి జనార్దన్, ప్రగతినగర్, హైదరాబాద్

వదంతులు నమ్మవద్దు

వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో రోజురోజుకు వదంతులు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకులు, ప్రతిపక్షాలు కలిసే ఈ వదంతులకు జీవం పోస్తున్నట్లు అనుమానం కలుగుతున్నది. నిత్యం ఏదో ఒక అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం కొన సాగుతున్నది. ఏటా 4 వందలకు పైగా యువతులు మిస్సింగ్ అవుతున్నా రంటూ ఒక వదంతు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇలాంటి అవాస్తవాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోవద్దు. అట్లాగే వదంతులను ప్రచారం చేస్తున్నవారిని పోలీసు అధికారులు గుర్తించి వారి పై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- కొలిపాక లాస్య, పెద్ద సముద్రాల, హుస్నాబాద్

హర్షణీయం

రాష్ట్రవ్యాప్తంగా వానకాలం ప్రారంభ సమయానికే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం అభినం దనీయం. గత రెండు, మూడు రోజులుగా రైతు ఖాతాల్లో రైతుబంధు నగదు జమవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- బందెల శ్రీనివాస్, కమాన్ చౌరస్తా, కరీంనగర్

181
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles