కైవసం చేసుకోవాలె

Wed,June 12, 2019 01:10 AM

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ చేతికి గాయం కావడం బాధాకరం. దావన్ ఇప్పటికే సిరీస్‌లో ఒక సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే దావన్‌కు విశ్రాంతి, ఆయన మూడు నాలుగు మ్యాచ్ లకు అందుబాటులో లేకపోవడం లోటే. అయినప్పటికీ భారత జట్టు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. వరుస విజయాలతో ఊపుమీ దున్న భారత్‌కు ముందున్నది కఠిన పరీక్ష. న్యూజిలాండ్, పాక్, శ్రీలంక, వెస్టిండిస్ లాంటి పటిష్ట జట్లతో పోటీ పడనున్నది. కాబట్టి సరైన వ్యూహంతో ముందుకుపోవా లి. అయితే ధావన్ లోటును ఎవరు భర్తీ చేస్తారనే విషయం పక్కనపెడితే ప్రపంచక ప్‌ను మరోసారి ఇండియా కైవసం చేసుకో వాలనేది ప్రతి భారతీయుని కోరిక.
- పుల్కం సంపత్, రాములపల్లె, జగిత్యాల

సంక్షేమం కోసం కృషిచేయాలె

మధ్యంతర భృతి కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇన్నిరోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడానికి ప్రభుత్వానికి ఇన్నిరోజులు ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగి సింది. కాబట్టి ప్రభుత్వం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరు తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల సం క్షేమం కోసం కృషిచేయాలి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్

అప్రమత్తత అవసరం

రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి కొన్నిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వానలు కురిసే అవకాశం ఉన్నది. కాబట్టి నగరాల్లోని మ్యాన్‌హోల్స్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. గతానుభవాలను పరిశీలిస్తే మ్యాన్‌హోల్స్‌లో పడిన రెండు మూడు ఘటనలు చోటుచేసుకు న్న దాఖలాలున్నాయి. కాబట్టి మ్యాన్‌హోల్స్‌ను మూసేయాలి. - కొత్వాల్ ప్రవీణ్, బేగంపేట్, హైదరాబాద్

221
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles