లౌకికవాదానికి గడ్డురోజులు

Tue,June 11, 2019 01:13 AM

modi-rss
పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీ సాధించటంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై, ప్రధాన రాజకీ య పార్టీలు అనుసరించిన విధానాలపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. గెలిచింది వాదమా, లేక వ్యక్తా అన్నది సదా ఈ చర్చల్లో నానుతున్నది. ఈ సాధారణ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 353 సీట్లను గెలుచుకున్నది. దేశంలోని 13 రాష్ర్టాల్లో 50 శాతానికి పైగా ఓట్లను సాధించింది. ఈ విజయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మే 23న ప్రసంగిస్తూ..ముప్ఫై ఏండ్లుగా కొనసాగుతున్న నాటకం పరిసమాప్తమైందని ప్రకటించారు! అంతటితో ఆగకుండా.. ఇప్పటి దాకా రాజకీయపార్టీలన్నీ ఓ నకిలీ ముసుగు కప్పుకొని ఓట్ల కోసం నాటకమాడాయి. అదే సెక్యులరిజం. లౌకికవాదమనేదే పెద్ద భ్రాంతి. నకిలీ, లౌకికశక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చేవారు. కానీ 2014, 2019 ఎన్నికలు వాటికి సమాధానం చెప్పింది. ఏ ఒక్క పార్టీ దేశ ప్రజలను లౌకి కవాదం పేర పక్కదారి పట్టించలేకపోయారు.. అని చెపుకొచ్చారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ గెలిచిన ఎన్నికల సీట్ల సంఖ్యను గురించి మాట్లాడలేదు. తనది భావజాలపరమైన విజయంగా నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బహుశా ఆయన చెప్పింది వాస్తవమేనేమో. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఓటమికి కారణమైన కుం భకోణాలు, అగ్రనేతల అవినీతి రాజకీయాల నుంచి గుణపాఠాలు తీసుకోలేదు. వాటిని సరిదిద్దుకునే చర్యలకు ఉపక్రమించలేదు. కానీ ఓటమి ని సెక్యులరిజం మాటున దాచి ఉంచటానికి ప్రయత్నించింది. ఆ క్రమం లో కాంగ్రెస్ మార్క్ అవినీతి అక్రమాలకు లౌకికవాదాన్ని బలిపెట్టింది.

దేశంలో ప్రధానంగా కాంగ్రెస్ లౌకిక మార్గాన్ని వీడనాడిన స్థితి కనిపిస్తున్నది. మొన్న మోదీ సాధించిన అసాధారణ విజయంతో ఆర్‌ఎస్సెస్, బీజేపీ శక్తుల రాజకీయ విధానం పైచేయి సాధించినట్లుగా, లౌకికవాదంపై మత మెజారిటీ వాదం గెలిచినట్లుగా భావించా ల్సి వస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ రెండు కలిసి కూడా బీజేపీ ని నిలువరించలేకపోయాయి. గతంలో వారు ములాయం, కాన్షీరాం కలిశారు.., జై శ్రీరాం గాలిలో కలిసిపోయిందని అన్నారు. కానీ ఆ ప్రభావం ఇప్పటి ఎన్నికల్లో ఏ మాత్రం చూపలేదని తేలిపోయింది.


పార్టీ అగ్రనాయకత్వమంతా సెక్యులర్ రాజకీయ పంథా ద్వారా పునర్‌వైభవాన్ని పొందేందుకు తమవైన ఎత్తుగడలతో ముందుకుసాగారు. కాంగ్రెస్ అభిప్రాయం ప్రకారం ముస్లిం ప్రజానీకమంతా ప్రస్తుత బీజేపీ రాజకీయ విధానాలతో తీవ్రంగా గాయపడ్డారని భావించింది. మరోవైపు బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ముస్లిం అనుకూల విధానమంతా బుజ్జగింపు రాజకీయాల్లో భాగమని ఎదురుదాడికి దిగింది. ఈ సంతుష్టి రాజకీయాల నేపథ్యంలోనే దేశంలో సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్, కుందూ కమిటీ లాంటివి ఉనికిలోకి వచ్చాయి. తమవై న అధ్యయనాలను వెలువరించాయి. ఈ అధ్యయనాలన్నింటా.. ముస్లిం ప్రజలు సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడినారని తెలిపాయి. ఈ క్రమంలోంచే ముస్లిం ప్రజలపై మెజారిటీ వాదం ఆధిపత్యం చేస్తున్నదని కాంగ్రెస్ వాదించి, లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలని కోరింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ లౌకిక ప్రత్యామ్నాయాన్ని నిర్మాణం చేసే బదులు అది కూడా మతవాద బాటలో పయనించింది. గుజరాత్ ఎన్నికల ప్రచార సందర్భంలో రాహుల్‌గాంధీ దేవాలయాన్ని సందర్శించారు. అయితే ఇదే పెద్ద సమస్య కాకపోయినా, బీజేపీ అనుసరిస్తున్న విధానం మెజారిటీ వాదమని విమర్శిస్తూనే, మరో పక్క కాంగ్రెస్ నేత రాహుల్ దేవాలయాల చుట్టూ తిరుగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇప్పటిదాకా బీజేపీ మౌనం దాల్చటాన్ని కాంగ్రెస్ సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. మతం పేరుతో అల్లర్లు, సామాజిక అశాంతిని రేపేవారు నకిలీ హిందువులని నిందించింది.

కాంగ్రెస్ అనుసరిస్తున్న వామపక్ష ఆర్థికవాద విధానాలు, హిందు త్వ సాంస్కృతిక రాజకీయ విధానం ఒకదానికి ఒకటి పొసగనివి. ఆ క్రమంలోంచే కాంగ్రెస్ రాజకీయంగా ప్రభావితం చేయలేకపోతున్నదని అర్థం చేసుకోవచ్చు. రాహుల్‌గాంధీ విస్పష్ట లౌకిక రాజకీయ విధానాన్ని అనుసరించకపోవటంలోనే అసలు సమస్య ఉన్నది. భారతీయ భావన, భావజాల ఘర్షణ అనే విషయంలో కాంగ్రెస్ మరింత స్పష్టమైన విధానంతో ముందుకుపోవాలి. నెహ్రు సోషలిజం, గాంధియన్ సెక్యులరిజంలను నిజమైన అర్థంలో పాటించినప్పుడే కాంగ్రెస్‌కు పునాది ఉంటుంది.


మోదీ అసలైన హిందూ కాదని వాదించింది. ఆ మాటకొస్తే తానే నిజమైన హిందువునని రాహుల్‌గాంధీ చెప్పుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తాను శివభక్తుడినని చెప్పుకుం టూ, తన గోత్రాన్ని కూడా చెప్పుకున్నారు. అంతటితో ఆగలేదు హిందూ అనుకూల కాంగ్రెస్ ప్రయాణం. మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా గో మూత్రం నుంచి ఔషధాలు తయారుచేయవచ్చని తద్వారా రైతులు ఆర్థికంగా లాభపడవచ్చని కాంగ్రెస్ ప్రచారం చేసింది. దీన్నే రామపథ్‌గా చెప్పింది. ఇప్పటిదాకా లౌకిక వాదానికి నిజమైన ప్రతినిధినని చెప్పుకునే కాంగ్రెస్, దాని నుంచి పక్కకు జరిగిన దానికి నిదర్శనంగా దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే మధ్యప్రదేశ్‌లో సరిగ్గా ఎన్నికల సమయంలోనే ముగ్గురు ముస్లిం యువకులను, ఆవులను హత్య చేశారన్న నెపం తో అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. ఈ చర్యలన్నీ కాంగ్రెస్ పార్టీ విధా నం కూడా కాషాయ మార్గమేనని చాటి చెప్పుకున్నది. మొత్తంగా చూస్తే.. దేశంలో ప్రధానంగా కాంగ్రెస్ లౌకిక మార్గాన్ని వీడనాడిన స్థితి కనిపిస్తున్నది. మొన్న మోదీ సాధించిన అసాధారణ విజయంతో ఆర్‌ఎస్సెస్, బీజేపీ శక్తుల రాజకీయ విధానం పైచేయి సాధించినట్లుగా, లౌకికవాదంపై మత మెజారిటీ వాదం గెలిచినట్లుగా భావించా ల్సి వస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ రెండు కలిసి కూడా బీజేపీ ని నిలువరించలేకపోయాయి. గతంలో వారు ములాయం, కాన్షీరాం కలిశారు.., జై శ్రీరాం గాలిలో కలిసిపోయిందని అన్నారు. కానీ ఆ ప్రభా వం ఇప్పటి ఎన్నికల్లో ఏ మాత్రం చూపలేదని తేలిపోయింది. ఏదేమైనా.. మోదీ చెప్పినట్లు- బీజేపీ వాదాన్ని ఏ పార్టీ తనదైన వాదంతో ఎదిరించలేకపోయింది. అదేక్రమంలో 1984లో జరిగిన ఢిల్లీ ఊచకోత విషయంలో రాహుల్‌గాంధీ పదేపదే క్షమాపణలు కోరారు. కానీ బీజేపీ 2002 గుజరాత్ అల్లర్ల విషయంలో మాత్రం ఒక్కమాట మాట్లాడలేదు.

anirban
అంతేగాకుండా గో రక్షకలను పూలదండలతో సత్కరించింది. కానీ గో రక్షకుల చేతిలో బాధితులుగా మిగిలిన వారి కుటుంబాలను కాంగ్రెస్ పరామర్శించటానికి సాహసించలేదు. ఈ క్రమంలో ముస్లిం ప్రజల్లో ఎన్నికల రాజకీయాల్లో తమకు రక్షణ లేదన్న పరిస్థితి ఏర్పడింది. బీజేపీ మాత్రం ముస్లిం ప్రజల సంఖ్యను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే తనదైన విధానంతో దూసుకుపోయింది. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రజల తరఫున నిలిచి లౌకిక భావనలను పాదుకొల్పటంలో ఘోరంగా విఫలమయ్యారు. అంతే కాదు.. వారు బీజేపీ అతివాద హిందుత్వకు విరుగుడుగా సాఫ్ట్ హిందుత్వను తెరమీదికి తెచ్చారు. కానీ వారేమి చేసినా, బీజేపీ చెబుతు న్న, చేస్తున్న హిందుత్వను ఎదుర్కొని నిలువలేకపోయాయన్నది వాస్త వం. కాంగ్రెస్ అనుసరిస్తున్న వామపక్ష ఆర్థికవాద విధానాలు, హిందు త్వ సాంస్కృతిక రాజకీయ విధానం ఒకదానికి ఒకటి పొసగనివి. ఆ క్రమంలోంచే కాంగ్రెస్ రాజకీయంగా ప్రభావితం చేయలేకపోతున్నదని అర్థం చేసుకోవచ్చు. రాహుల్‌గాంధీ విస్పష్ట లౌకిక రాజకీయ విధానాన్ని అనుసరించకపోవటంలోనే అసలు సమస్య ఉన్నది. భారతీయ భావన, భావజాల ఘర్షణ అనే విషయంలో కాంగ్రెస్ మరింత స్పష్టమైన విధానంతో ముందుకుపోవాలి. నెహ్రు సోషలిజం, గాంధియన్ సెక్యులరిజంలను నిజమైన అర్థంలో పాటించినప్పుడే కాంగ్రెస్‌కు పునాది ఉంటుంది. 1991 కాలంలోనే రైతు పాడెక్కాడు. ఆ తర్వాత కాలంలో రైతు మరింత పాతాళంలోకి దిగజారాడు.

ఇలాంటి విషయాలు అసలు చర్చకే నోచుకోలేదు. ఎన్నికలు, ఓట్ల కోసమే యుద్ధం కాకుండా ఒక ఎడతెగని భావజాల సంఘర్షణ జరుగాలి. ఆ క్రమాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశించాలి. ఇలాంటి భావజాల యుద్ధం చేయాలంటే.. మొదట వారికి తమదైన భావజాలం ఏదనేదాని పట్ల స్పష్టత అవసరం. ఆ క్రమంలోంచి తప్పు డు భావజాలాన్ని ఎదరించి తుత్తునియలు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి భావజాల విజయంలోంచే అసలైన విజయంగా చెప్పుకుంటు న్న ఎన్నికల విజయం సాక్షాత్కరిస్తుంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందా..?
(వ్యాసకర్త: జేఎన్‌యూలో పరిశోధకుడు)
ది వైర్ సౌజన్యంతో...

248
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles