టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు

Fri,June 7, 2019 12:14 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 32 జడ్పీ స్థానాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టిం చింది. దీంతోపాటు పెద్దమొత్తంలో ఎంపీ టీసీ స్థానాలను కైవసం చేసుకున్నది. ఇటీ వల జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ 4 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకున్నది. అయితే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ పతనం మొదలైందన్న విమర్శకులకు స్థానిక సంస్థల ఫలితాలే సమాధానం చెప్పాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకా లతో లక్షలాది మందికి లబ్ధి జరుగుతున్న ది. దాని ఫలితమే స్థానిక సంస్థల్లో టీఆర్ ఎస్ పక్షాన గ్రామీణ ప్రాంత ఓటర్లు మద్ద తుగా నిలిచారు.
- అన్నాజి రాజేందర్, కరీంనగర్

చెరువు.. ఊరికి ఆదెరువు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పుడికతీత పనులకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ చెరువుల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు జంతువుల కళేబరాలు, చికెన్ సెంటర్‌లోని వ్యర్థాలను పడవేస్తున్నారు. దీంతో చెరువుల ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతున్నది. చెరువు ఊరికి ఆదెరువు. ఈ చెరువులను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రజలదే. కాబట్టి ప్రజలు చెరువులను రక్షించుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- చుంచు అరుణ్‌కుమార్, వెల్గనూర్, దండేపల్లి, మంచిర్యాల

చెక్‌పవర్ ఇయ్యాలె

రాష్ట్రవ్యాప్తంగా గత జనవరిలో సర్పంచి ఎన్నికలు జరిగాయి. ప్రతి గ్రామానికి సర్పంచి ఎన్నిక కాబడినారు. అయితే ఐదు నెలలు గడిచినా ఇంకా సర్పంచ్‌లకు చెక్ పవర్ రాలేదు. గ్రామీణాభివృద్ధిలో సర్పంచ్‌లది కీలక పాత్ర కాబట్టి వెంటనే ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వాల్సి న అవసరం ఉన్నది. అయితే ఈ చెక్‌పవర్‌ను సర్పంచ్‌లు దుర్వినియో గం కాకుండా చూసుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్

124
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles